H.C.U historey :-
hcu forest-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు.. ప్రభుత్వానివా? యూనివర్సిటీవా?
విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణం.. సర్వే నం.25లో 400 ఎకరాల భూమిని ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడమే.
ఒకవైపు యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, మరోవైపు ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.
ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం.
దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
మొదట్లో, అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు.
ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు. అప్పట్నుంచి అక్కడే కొనసాగుతోంది. అయితే, ఈ భూముల గురించి వివాదం 21 ఏళ్ల కిందట మొదలైంది.
2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది.

అప్పట్లో ఐఎంజీ అకాడమీ కంపెనీకి ప్రభుత్వం 850 ఎకరాలు కేటాయించగా, అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌కు దీన్ని వినియోగించాలనేది లక్ష్యం.
కానీ ఇచ్చిన గడువులోపు ఐఎంజీ అకాడమీ తన పనులు ప్రారంభించకపోవడంతో 2006లో అప్పటి ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది.
దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘ కాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ, 2024 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది.
దీంతో గతేడాది ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఆ ప్రతిపాదనలకు స్పందిస్తూ.. కాంగ్రేస్ ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయిస్తూ 2024 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు.
అందులో భాగంగానే అక్కడ ఉన్న చెట్లను చదును చేస్తుంటే అది సెంట్రల్ యూనివర్సిటీ భూమలని ఉద్రిక్తత మొదలైంది.
యూనివర్శిటీ అధికారుల ప్రకారం.. 2003లో ఐఎంజీ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే తిరిగి వర్సిటీ ఆధీనంలోకే భూములు వస్తాయని అంటున్నారు.
2006లో రాష్ట్ర ప్రభుత్వంపై ఐఎంజీ అకాడమీ హైకోర్టు వెళ్లింది. ఆ సమయంలో భూముల కోసం యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలేదు. దానివల్ల ఆ భూములు ప్రభుత్వానివేనని అంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం.. యూనివర్సిటీ అధికారులే ఆ 400 ఎకరాలు తమ భూములు కావని చెప్పారని చెబుతోంది.
ఈ భూములకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏనాడు హెయ్ సీయూ ఇంప్లీడ్ కాలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ భూములను ప్రభుత్వం ఆ భూములను వేలం వేస్తుంటే విద్యార్థులు, యూనివర్శిటీ అభ్యంతరం చెబుతున్నారుని ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ భూముల యూనివర్సిటీని ఆనుకుని ఉండటం వల్ల అవి యూనివర్శిటీ భూములని విద్యార్థులు భావిస్తున్నారని ప్రభుత్వం అంటోంది
మొత్తానికి ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ భూములు విషయంలో ఓ వైపు విద్యార్ధులు, మరోవైపు రాజకీయ పార్టీలు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చెబుతున్న వాదనలు ఏమేరకు స్పందన వస్తుందో చూడాలి.
Comments
Post a Comment