అమెరికా రహస్యంగా చేస్తున్న ప్రయోగాల గురించి మీకు తెలుసా? ఇప్పటికీ కొనసాగున్నాయి! అమెరికా.. ప్రపంచ అగ్రరాజ్యంగా ఉన్న దేశం. ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ.. తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా.. రహస్య ప్రయోగాలు చేస్తోంది. వాటిల్లో ప్రాజెక్ట్ MK Ultra, Area 51, PRISM ఈ పేర్లు వినగానే ఒక మిస్టరీ సినిమా సీన్ మన కళ్లముందు కనబడుతంది. కానీ, ఇవి కేవలం సినిమా కథలు కాదు.. అమెరికా చరిత్రలో నిజంగా జరిగిన, ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలిన సంఘటనలు. అసలు ఈ రహస్య ప్రయోగాలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు అవి ఏ స్టేజ్‌లో ఉన్నాయి? అనే విషయాలతోపాటు అమెరికా రహస్య ప్రయోగాల చీకటి అధ్యాయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా రహస్య ప్రయోగాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది. 1947-1991 మధ్య జరిగిన కోల్డ్ వార్‌లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. సైన్స్, టెక్నాలజీ, గూఢచర్యం, ఆయుధాలలో ఒకరినొకరు మించిపోవాలనే పోటీతత్వం నడిచేది. ఈ సమయంలో, అమెరికా తన శత్రువులను అధిగమించడానికి, లేదా వారి రహస్యాలను తెలుసుకోవడానికి, అనేక రహస్య ప్రయోగాలను చేపట్టింది. ఈ ప్రయోగాలు కొన్ని సైన్స్ ఆధా...
Posts
Showing posts from April, 2025
- Get link
- X
- Other Apps
సముద్రంలో కనిపించిన వింత జీవి.. ఇది కేజీ రూ.28 వేలు సముద్రం అంటేనే ఒక మాయా లోకం. చూడటానికి ఎంతో అందంగా కనిపించే సముద్రంలో ఎన్నో అందమైన జీవులు కనిపిస్తాయి. అయితే అందమైన జీవులతోపాటుగా కొన్ని భయంకరమైన జీవులు కూడా కనిపిస్తాయి. అలాంటి ఒక వింత జీవి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇది యూరప్‌లోని వేల్స్‌లోని బెన్నార్ బీచ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఒక సముద్ర జీవి. వేల్స్‌లోని డైఫ్రిన్ ఆర్డుడ్వీ దగ్గర ఉన్న బెన్నార్ బీచ్‌లో ఒక రోజు షెల్ లాంగ్‌మోర్ అనే మహిళ సముద్ర తీరంలో నడుస్తోంది. ఒడ్డున కొట్టుకొచ్చిన ఒక విచిత్రమైన జీవిని చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. దాని ఆకారం, రూపం చూస్తే సముద్రంలోని ఏదో రాక్షస జీవిలా కనిపించింది. పొడవైన, బాతు మెడలాంటి ఆకారంతో, రాళ్లకు అతుక్కుని ఉన్న ఆ జీవులు ఆమెను భయపెట్టాయి. కానీ, ఈ జీవి గురించి తెలిస్తే, అది భయపెట్టే జీవి కాదని, పైగా అదొక అద్భుతమైన, ఖరీదైన సముద్ర సంపద అని తెలుస్తుంది. సముద్ర నిపుణులు ఈ జీవిని పరిశీలించి, ఇవి Gooseneck Barnacles అని గుర్తించారు. వీటిని బాతు బర్నాకిల్స్ లేదా గూస్ బర్నాకిల్స్ అని కూడా పిలుస్తారు. ఎ...
- Get link
- X
- Other Apps
గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించిన టీచర్! తన కోసం జైలులోనే డిగ్రీ చదివిన గ్యాంగ్‌స్టర్! ఈ రోజుల్లో ప్రేమంటే ఓ ఫిల్టర్ ఫోటో... ఒక Insta స్టోరి. కానీ కొన్ని ప్రేమలు నేరంగా మొదలై, జీవితంగా మారిపోతాయి. అలాంటి ప్రేమ కథే ఇది. ఒక టీచర్, ఒక గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించింది. ఆ గ్యాంగ్‌స్టర్ జైలులో ఉన్నప్పుడు... ఆమె జైలులోకి వెళ్లి అతనిని పెళ్లి చేసుకుంది. ఇది సినిమా కాదు... ఇది నిజమైన కథ. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండే ఒక టీచర్ పేరు స్నేహా. స్నేహా ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్. తనకి జాబ్, హోమ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. రోజూ స్కూలుకు వెళ్లి, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులని చూసుకుంటూ అదే జీవితం అన్నట్లు బతికేది. ఒకరోజు, స్నేహకు ఒక పేపర్లో వార్త కనిపిస్తుంది. ఒక క్రిమినల్ ‘విక్రాంత్’ ను పోలీసులు అరెస్ట్ చేశారని. ఆర్టికల్‌లో ఉన్న ఫోటో, ఆ కథనం ఆమె మనసుని కదిలించింది. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్‌లో ఉన్న అతని ముఖంలో పశ్చత్తాప ఎక్స్‌ప్రెషన్ కనిపించింది స్నేహకు. పత్రిక చదవడం, ఆ వ్యక్తి గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం వంటివి చేసింది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి. విక్రాంత్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్...
- Get link
- X
- Other Apps
విజయవాడలో ఉగ్రవాదులు! హై అలర్ట్‌లో విజయవాడ! జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. ఈ దాడి పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో జరిగినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో, విజయవాడలో ఉగ్రవాద కదలికలపై నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీనితో విజయవాడ నగరం హై అలర్ట్‌లో ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం, సిమి అంటే ‘స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ సంబంధాలున్న 10 మంది అనుమానిత ఉగ్రవాదులను గుర్తించారు. వీరిలో నలుగురు విజయవాడ నగరంలో, మరో ఆరుగురు శివారు ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ అనుమానితులు ఏసీ మెకానిక్‌లు, మసీదుల వద్ద బిచ్చగాళ్లు, బడ్డీకొట్లలో కార్మికులుగా మారువేషంలో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ హెచ్చరికలు విజయవాడలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాయి, ప్రజల్లో ఆందోళనను కలిగించాయి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. ఈ ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో, నగరంలో భద్రతా బలగాలు విస్తృత చర్యలు చేపట్టాయి. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రానా తాతా నేతృత్...
- Get link
- X
- Other Apps
బిడ్డను చంపి.. తల్లిపై గ్యాంగ్ రేప్..! నేడు చట్టాలు ఎంత కఠినతరం చేసినా కానీ, దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హర్యానాలోని జీంద్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన మనసును కలచివేస్తోంది. దేశంలో రోజురోజుకీ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, రోజూ సగటున 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీంద్‌లోని ఓ మురికివాడలో జరిగిన ఈ ఘటన మరోసారి సమాజంలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. ఓ మహిళ, ఆమె ఐదేళ్ల చిన్నారిపై నలుగురు దుండగులు చేసిన దాడి గుండెల్ని పిండేసేలా ఉంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. హర్యానా రాష్ట్రంలోని జీంద్ మురికివాడలో ఓ మహిళ భర్త నలుగురు పిల్లలతో నివసిస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం గుడిసెలో భర్త లేని సమయం చూసి స్నేహితులతో కలిసి అమిత్ వచ్చాడు. ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నిద్రపోతున్న బాధితురాలపై దాడి చేశారు. అనంతరం ఆమెతో పాటు ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్త కుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం బాధితురాలిపై నలుగురు ...
- Get link
- X
- Other Apps
సీమా హైదర్ పాకిస్థాన్‌కు వెళ్లాలా? భారత్‌లోనే ఉండొచ్చా? చట్టం ఏం చెబుతోంది? మీకు సీమా హైదర్ గుర్తుందా? 2019లో PUBG ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ 32ఏళ్ల ఒక పాకిస్తాన్ మహిళ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడితో ప్రేమపడి, చట్టవిరుద్ధంగా ఇండియాలోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల సీమా హైదర్.. PUBG ఆడుతూ నోయిడాకు చెందిన సచిన్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాట్ చేసుకున్న తర్వాత ప్రేమలో పడ్డారు. 2023లో సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చి సచిన్‌ను పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత కేసులు నమోదవడం, అవి ఇప్పుడు విచారణంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్‌లో ప్రతి పాకిస్తానీ.. భారత్ నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ అయింది. మరి పాకిస్తాన్ నుంచి పాయిపోయి వచ్చిన సీమా ఇప్పుడు భారత్‌లో వదిలి వెళ్లాలా? లేక ఇక్కడే ఉండిపోవచ్చా? అని హాట్ టాపిక్‌గా నడుస్తోంది. దీనిపై సీమా లాయర్ స్పందించాడు. సీమా లాయర్ ఎ.పి. సింగ్.. కేంద్రం ఆదేశాలు పాకిస్థానీ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే వర్తిస్...
- Get link
- X
- Other Apps
పది తలల రావణాసురుడికి ప్రత్యేక ఆలయం.. మనకి దగ్గర్లోనే..? పది తలల రావణుడు.. రాముడి చేతిలో ఓడిపోయిన రాక్షసుడిగా మనందరికీ తెలుసు. కానీ, రావణుడు అనేక విద్యలు తెలిసిన మహాపండితుడు. అయినా మనం అతన్ని రాక్షసుడిగానే గుర్తుపెట్టుకున్నాం. కానీ, ఈ దేశంలో ఓ ఊరు మాత్రం, రావణుడిని దేవుడిలా పూజిస్తుంది. ఆలయం కట్టి ప్రతిరోజూ అర్చనలు, అభిషేకాలు చేస్తుంది. మనం ఎలా అయితే, భగవంతుడికి ప్రత్యేకంగా జాతర జరుపుతామో. అదే విధంగా ఆ ఊరుఊరంతా రావణుడికి జాతర నిర్వహిస్తుంది. ఈ ఊరిలో రాముడి పేరు కాదు, రావణుని పేరే వినిపిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే పూజారి రావణుని ఆశీస్సులు కోరతారు. ఒకసారి ఊరిలో వర్షం కురిసిందంటే అది రావణుడి కటాక్షమని నమ్ముతారు. ఇదంతా వినడానికి వింతగా ఉంది కదా? కానీ ఈ కథ వెనుక దాగున్న నిజాలు, నమ్మకాల పరంపర, పౌరాణిక భయాలు ఇలా అనేక విషయాలు దాగి ఉన్నాయి. ఇదీ రావణుడే దేవుడిగా మారిన గ్రామం కథ. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గుడి ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రావణాసురుడంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సీతాపహరణం, రాక్షస స్వభావం, రామునితో యుద్ధం. కానీ, ఇదంతా ఆయన జీవితం...
- Get link
- X
- Other Apps
మరణ రహస్యాలు.. గరుడ పురాణం ఏం చెబుతోంది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది మన ఇంటిని, మన వస్తువులను గుర్తుంచుకుంటుందా? భారతీయ సంస్కృతిలో మరణం కేవలం శరీరం చావు కాదు, అది ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యే సమయం! గరుడ పురాణం ఈ రహస్యాలను శ్రీకృష్ణుడు గరుడ రాజుకు చెప్పిన జ్ఞానంతో వివరిస్తుంది. మరణం తర్వాత ఆత్మ భూమిపైనే తిరుగుతుందని, మృతుని వస్తువులను వాడితే ఆత్మ శాంతి భంగమవుతుందని చెబుతుంది. ఈ వస్తువులు ఏంటి? వాటిని ఎందుకు వాడకూడదు? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి! మన భారతీయ సంస్కృతిలో మరణం ఒక ఆధ్యాత్మిక మలుపు. ఒక జీవి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, అతని ఆత్మ మరో లోకానికి ప్రయాణం మొదలుపెడుతుందని నమ్ముతాం. ఈ ప్రయాణం సాఫీగా సాగాలంటే, పిండప్రదానం, శ్రాద్ధ క్రియలు వంటి ఆచారాలు జరగాలి. గరుడ పురాణం ఈ విషయంలో మనకు మార్గదర్శి. శ్రీకృష్ణుడు గరుడ రాజుకు చెప్పిన ఈ జ్ఞానం ప్రకారం.. మరణం తర్వాత ఆత్మ కొంతకాలం భూమిపైనే తిరుగుతూ, తనకు దగ్గరైన వస్తువులతో అనుబంధం కలిగి ఉంటుంది. అందుకే, మృతుని దుస్తులు, ఆభరణాలు, పాదరక్ష...
- Get link
- X
- Other Apps
అఘోరిలు పెళ్లి చేసుకోవచ్చా? అఘోరిలు చెబుతున్న మాటలు ఇవే ఇటీవలకాలంలో లోక కళ్యాణం, సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో తిరుగుతూ.. హల్ చల్ చేస్తున్న అఘోరీ పెళ్లి అనే అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా అఘోరి మరో సారి వార్తల్లో నిలిచారు. మొత్తానికి అఘోరి , వర్షిణి వివాహం చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్ని రోజులు కిందట నాగసాధు ఏం చెప్పారో అదే ప్రస్తుతం జరగడంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు అఘోరిలు పెళ్లి చేసుకోవచ్చా? అసలు వారి జీవన విధానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అఘోరీలు మనిషి జీవితంలో మనం సాధారణంగా చూడలేని, భయంకరమైన వ్యక్తులు. వీరు ఎక్కువగా హిమాలయాల్లో లేదా శవాల మధ్య జీవిస్తుంటారు. వారి జీవనశైలి మనకు చాలా భిన్నంగా కనిపిస్తుంటుంది. వారి ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక స్థితి మాత్రమే ఉన్నతమైన జీవన స్థాయికి నడిపిస్తాయి. సాధారణంగా అఘోరీల ప్రేమకు సంబంధించిన ఎలాంటి భావనలు లేదా ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు ఉండవు. పెళ్లి ఒక నియమం, సమాజంలో చోటుచేసుకున్న బంధాలు. కానీ అఘోరులు ఈ వివాహ బంధాలకు దూరంగా, తాత్కాలికమైన సమాజం నుంచి విడిపోయి, శివ...
- Get link
- X
- Other Apps
అందం వెనుక ఆపద.. ఎర్రసముద్రంలోని మినీ డెత్ జోన్ మిస్టరీ భూమి మీద కొన్ని ప్రాంతాలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ, కొన్ని అందమైన ప్రదేశాలు అంతరంగంగా భయంకరమైన మిస్టరీలను దాచుకుని ఉంటాయి. వాటిలో ఒకటే ఈ డెత్ పూల్ సరస్సు. ఇది సముద్రంలో ఉంటుంది. సముద్రంలో సరస్సు ఏంటని అనుకుంటున్నారా. అవును ఈ సముద్రంలో ప్రాణాలు తీసే ఒక సరస్సు ఉంది. ఎప్పుడూ.. అలలతో ఉప్పగా, జీవంతో నిండుగా ఉండే అదే సముద్రంలో, కొద్దిగా లోతులోకి వెళ్తే… అకస్మాత్తుగా గుండ్రంగా ఉన్న చిన్న ప్రాంతం కనిపిస్తుంది. అది చూడడానికి బంగారు రంగు ఆకృతి, మధ్యలో పొంగుతున్న నీరుతో ఉంటుంది. దాన్ని చూస్తే మనసు ఆనందంతో ఊగిపోతుంది. కానీ, అదే అందమైన నీటిలో మీరు ఒక్క అడుగు వేశారు అంటే.. అక్కడితో మీ ప్రయాణం ముగిసిపోతుంది. ఇది వినడానికి హాలీవుడ్ స్టోరీలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. దీనిని శాస్త్రవేత్తలు ‘Hot Tub of Despair’ అని పిలుస్తారు. ఇది మెక్సికో సమీపంలోని ఎర్రసముద్రం అడుగున ఉంటుంది. ఇది కొలనులా కనిపించే.. ఒక మినీ ‘డెత్ జోన్’. ఈ కొలనులో ఉండే ఉప్పు స్థాయి సాధారణ సముద్రపు నీటితో పోలిస్తే, సుమార...
- Get link
- X
- Other Apps
ఒక ఐడియా ఇస్తే.. రూ. 25 కోట్లు ఒక చిన్న ఐడియా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. ఇప్పుడు అలాంటి ఒక చిన్న ఐడియా ఇస్తే చాలు.. అక్షరాల రూ.25 కోట్ల బహుమతిని మీరు సొంతం చేసుకోవచ్చు. ఒక ఐడియాకి రూ. 25 కోట్లగా అని ఆశ్చర్యపోతున్నారా..?. ఇది నమ్మసక్యంగా లేదని అనుకుంటున్నారా. కానీ ఇది నిజం. అసలు ఒక్క ఐడియాకి అన్నీ కోట్లేంటి..? ఇంతకీ దేనికి సంబంధించిన విషయంపై ఐడియా ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రుడిపై శాశ్వతంగా మనిషి నివసించగలడా? ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే అంటే.. ఎంతమాత్రం కాదనే చెప్పాలి. చంద్రుడిపై మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో, ఎన్నో దేశాలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నాయి. కానీ, ఈ కలను సాకారం చేయడానికి ముందు ఎదురవుతున్న సమస్యలు చిన్నవేమీ కావు. వాటిలో మోస్ట్ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సమస్య ఏంటో తెలుసా? చంద్రుడిపై మనిషి వదిలిపోయిన వ్యర్థాలు! అవును… నాసా ఆపోలో మిషన్ల సమయంలో చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడే వదిలేసి వచ్చిన వ్యర్థాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అదే నాసాకు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఈ వ్యర్థాలను తొల...
- Get link
- X
- Other Apps
వీధుల్లో తిరిగే ఆమెకు వేలాది మంది భక్తులు.. ఆమె ఒక మతి స్థిమితం లేని మహిళ. ఎప్పుడూ మాసిన దుస్తులతో కనిపిస్తుంది. అసలు ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమెను అక్కడి వారు దైవ సమానులుగా భావిస్తుంటారు. ప్రజలు ఆమె నీడ పడడమే మహా భాగ్యమని అనుకుంటారు. అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరి ప్రదక్షిణ చేసే ఆమె అసలు పేరేంటో తెలియదు కానీ, భక్తులు మాత్రం ఆమెను టోపీ అమ్మ అని పిలుచుకుంటారు. ఇంతకీ ఎవరీ టోపీ అమ్మ.? అసలు ఆవిడ కథ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. తమిళనాడులోని తిరువణ్ణాలమై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి అందరికి తెలుసు. గిరి ప్రదక్షిణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుంది ఆ టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ ఆమె 11 వేల సార్లు గిరి ప్రదక్షిణ చేసిందని చెబుతారు. అందుకే ఆమె అనుగ్రహం కోసం భక్తులు పోటీపడతుంటారు. ఆమె కారణ జన్మురాలని, అవధూతగా భావిస్తూ అక్కడికి వెళ్లిన భక్తులు ఆమెను పూజిస్తారు. అలాగే ఆమె తాగి పడేసిన టీ కప్పును మహా ప్రసాదంగా భావిస్తుంటా...
- Get link
- X
- Other Apps
ముచ్చటగా మూడోసారి పెళ్లిచేసుకున్న అఘోరి! గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో.. అఘోరీ నాగసాధువు అలియాస్ శ్రీనివాస్ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. తాను లోక కళ్యాణం, సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో తిరుగుతూ.. హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా మరో సంచలన పని చేశాడు. చెప్పినట్లుగానే అఘోరీ శ్రీనివాస్ మూడవ సారి వర్షిణి మెడలో తాళి కట్టాడు. సోమవారం నాడు మధ్య ప్రదేశ్ లోని ఒక ఆశ్రమంలో వీరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారాయి. అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరీ వర్షిణి మెడలో తాళి కట్టాడు. అనంతరం అఘోరీ, శ్రీ వర్షిణి పరస్పరం దండలు మార్చుకుని, తలంబ్రాలు పోసుకుని.. ఏడు అడుగులు వేశారు. అఘోరి గతంలో వర్షిణికి రెండు సార్లు తాళి కట్టినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకముందు దేవాలయంలో ఒక సారి.. ఇలా రెండు సార్లు తన మెడలో తాళి కట్టినట్టుగా స్వయంగా వర్షిణీనే చెప్పింది. అదే సమయంలో అఘోరీ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ.. మరోసారి కూడా వివాహం చేసుకుంటా.. ఈ సారి అంగరంగ వైభవంగా చేసుకుంటా అని చెప్పాడు. అన్నట్లుగానే ఇప్పుడు అఘోరీ శ్రీ వర్షిణి మెడలో ...
- Get link
- X
- Other Apps
ఆసియాలో అత్యతం భయంకరమైన కోట.. ఇవ్వాల మనం చెప్పుకునే విషయం కేవలం ఓ కోట గురించి కాదు… అది భారత చరిత్రలోనే అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచిన కోట గురించి. ఉదయం పూట పర్యాటకులతో కిక్కిరిపోయే ఈ ప్రదేశం.. రాత్రి అయితే చాలు అక్కడ ఒక్క అడుగు కూడా వేయలేనంత భయంకరంగా మారుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు. అదే భంగర్ కోట. ఈ కోట ఒకప్పుడు రాజరిక చరిత్రకు నిదర్శనంగా నిలిచిన గొప్ప కోట. కానీ ఇప్పుడు? ఇది భారతదేశంలోనే.. అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచింది. కొందరు ఇది ఏమాత్రం నిజం కాదని, ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆ కోటలోకి వెళ్లారు. ఇక అంతే.. వాళ్లు మళ్లీ తిరిగి బయటకు రాలేదు. వాళ్లు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా చంపేశారా అంటే అక్కడ డెడ్‌బాడీలు లేవ్, ఎక్కడికైనా వెళ్లారా అంటే ఆనవాళ్లు లేవు. వాళ్లు ఏమయ్యారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అందుకే భారత ప్రభుత్వం ఈ కోట చుట్టుపక్కల భారీ హెచ్చరికలు ఉన్న బోర్డులను పెట్టి, కట్టుదిట్టమైన కాపాలాను ఏర్పాటు చేసింది. దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ భంగర్ కోట లోపల ఏం జరుగుతుంది...
- Get link
- X
- Other Apps
మానవ శరీరంలో మూడో కన్ను..! మనిషికి రెండు కన్నులే ఉన్నాయి అనే విషయం మీద ఎవరికీ సందేహం ఉండదు. కాని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు, పురాతన విశ్వాసాలు చూస్తే… మన శరీరంలో మరో ‘కన్ను’ ఉంది. మనం చూస్తే కనిపించదు… కానీ మన జీవనశైలిని, ఆలోచనల్ని, శరీర వ్యవస్థల్ని అన్నింటిని నియంత్రించే శక్తి మాత్రం దీనిలో దాగి ఉంటుంది. ఈ శక్తివంతమైన భాగాన్నే పీనియల్ గ్రంథి అంటారు. ఈ పీనియల్ గ్రంథి పేరు వినగానే చాలామందికి ఇది బోరింగ్ మెడికల్ టాపిక్‌లా అనిపించవచ్చు. కానీ అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే, ఇది నిజంగా మన శరీరంలో దాగి ఉన్న ఒక మిస్టరీ చాంబర్ లాంటిది. ఈ గ్రంథి మన మెదడులోని మద్యభాగంలో, రెండు బ్రెయిన్ హాల్ఫ్‌ల మధ్యన కనిపిస్తుంది. దాని ఆకారం ఓ ఒక బియ్యపు గింజంత సైజులో ఉంటుంది. ఇది కేవలం 5 నుండి 8 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. కానీ, శరీరం మీద దీని ప్రభావం… ఒక గొప్ప మాస్టర్ కంట్రోల్ సెంటర్‌లా ఉంటుంది. ఈ గ్రంథి చేసే ముఖ్యమైన పని మెలటొనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడమే. ఇది నిద్రపట్టడానికి అవసరమైన హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తోంది. మన శరీరం లోపల డే అండ్ నైట్ సైకిల్‌ను నియంత్రించేది ఇదే. అంటే వ...
- Get link
- X
- Other Apps
మిస్టరీగా మిగిలిన 8 బంగారు బావులు ఒకప్పుడు అది రాజుల కోట, ఇప్పుడు రహస్యాల నిలయం. హిమాచల్ ప్రదేశ్ పర్వతాలలో ఓ పురాతన కోట. దాని గోడలు కాలాన్ని జయించిన కథల్ని చెబుతుంటే… నేలలో దాగిన బావులు మాత్రం ఎన్నో రహస్యాలను, అపార సంపదను దాచుకొని ఉన్నాయి. అనేక శతాబ్దాలుగా ఈ కోటలో దాగిన బంగారం కథలు, రత్నాల రహస్యాలు చుట్టుపక్కల ప్రజల ఊహలకు ఎగిసిన మంటల్లా ఉన్నాయి. అదే కాంగ్రా కోట. ఇది కేవలం ఒక ప్రాచీన కోట మాత్రమే కాదు.. ఇది రహస్యంగా దాగిన ధనసంపదలతో నిండి ఉన్న ఒక మిస్టరీ. శతాబ్దాలుగా ఈ కోట అనేక రాజుల చేతుల్లోనూ, దొంగల చేతుల్లోనూ దోపిడీకి గురైంది. కానీ,ఈ బావుల్లో దాగి ఉన్న రహస్యాలు మాత్రం ఎప్పటికీ బయటపడలేదు. ఆ బావిలో బంగారు ఆభరణాలు, రత్నాలు నిజంగా ఉన్నాయా? ఉంటే అవి కోటలో ఎక్కడ ఉన్నాయి? లేక ఇదంతా ఒక కల్పిత గాధేనా? దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం భారతదేశంలో రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం కోటలను బలంగా నిర్మించేవారు. అంతేకాకుండా కోటలోని సంపద మొత్తంను కాపాడుకునేందుకు రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకునేవారు. అలాంటి రహస్యమైన కోటల...
- Get link
- X
- Other Apps
మరణానికి 5 నిమిషాల ముందు శరీరం చెప్పే సంకేతాలు ఇవే! మరణం అనేది మనం ఎప్పటికీ తప్పించుకోలేని నిజం. కానీ చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తుందంటారు. అయితే ఆ లక్షణాలు ప్రతి ఒక్కరిలో కనిపించకపోయినా, ఎక్కువగా కనిపించే కొన్ని సూచనలు ఉన్నాయని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతోంది. మరణం దగ్గరపడుతున్నప్పుడు, శరీరం ఒక యంత్రంలా కాకుండా నిశ్చలంగా ఉండిపోతుంది. చివరి ఐదు నిమిషాల్లో శరీరం ఆక్సిజన్, రక్త ప్రసరణ నెమ్మదిగా తగ్గుతుంది. హృదయం గట్టిగా కొట్టుకోవడం మానేసి, ఒక ప్రత్యేకమై లయలో బీట్ చేస్తుంది. చాలా సార్లు ఒక నిమిషంలో 40 నుంచి 20 బీట్స్‌కి పడిపోతుంది, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. చివరి ఐదు నిమిషాలు సమయంలో శ్వాస కూడా వింతగా మారుతుంది. తడబడుతూ, ఒక్కోసారి లోతుగా, ఒక్కోసారి ఆగి ఆగి వస్తుంది. దీన్ని వైద్యులు ‘చీన్-స్టోక్స్ బ్రీదింగ్’ అంటారు. ఈ సమయంలో శరీరం చల్లగా అనిపిస్తుంది. రక్తం శరీరం అంతా చేరడం మానేస్తుంది కాబట్టి, చేతులు, కాళ్లు మొదలైన భాగాలు ముందు చల్లబడతాయి. చర్మం రంగు కూడా మారుతుంది. ఒక వింతైన బూడిద రంగులోకి లేదా నీలం ఛాయలోకి వస్తుంది. ఎందుకంటే ఆక్...
- Get link
- X
- Other Apps
హ్యాకింగ్ ఎలా చేస్తారో తెలుసా? మీరు ఏదైనా డివైజ్ హ్యాక్ అవుతుందనగానే, ఒక్క వ్యక్తి laptop ముందు కూర్చుని green screen లో కోడింగ్ చేస్తూ కీబోర్డ్ నొక్కేస్తూ ఉండే మూవీ సీనే గుర్తుకొస్తుంది? కదా. నిజానికి అంత cinematic గా ఉండకపోయినా, హ్యాకింగ్ అన్నదే చాలా సీరియస్ టాపిక్. ఇది తప్పుడు పని అయినా, దాన్ని ఎలా చేస్తారో తెలుసుకుంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోగలం. చట్టబద్ధంగా హ్యాకింగ్ అనే స్కిల్‌ను "ఎథికల్ హ్యాకింగ్"గా కూడా నేర్పిస్తున్నారు. కానీ, ఇక్కడ మనం అసలైన హ్యాకింగ్ ఎలా జరుగుతుందో, దాని ప్రధాన రకాలేంటో, మామూలు మనుషుల్ని ఎలా టార్గెట్ చేస్తారో తెలుసుకుందాం. అలాగే మన డివైజెస్ హ్యాకింగ్‌కు దూరంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాకర్లు నిన్ను ట్రాప్‌లోకి లాగడానికి ఎన్నో ట్రిక్స్ వాడతారు. ఒక రోజు నీకు ఇమెయిల్ లేదా మెసేజ్‌లు పంపిస్తారు. అందులో ‘మీ బ్యాంక్ అకౌంట్ సమస్యలో ఉంది, ఈ లింక్ క్లిక్ చేయండి!’ అని ఉంటుంది. ఆ మెయిల్ లేదా మెసేజ్ అచ్చం బ్యాంక్ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేసి, పాస్‌వర్డ్ టైప్ చేస్తే.. మీ డేటా అంతా హ్యాకర్ చేతుల్ల...
- Get link
- X
- Other Apps
తెలంగాణకు భూకంపం వార్తల్లో నిజమెంత..? గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. మయన్మార్, థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా, జపాన్‌ను వరుసగా భూకంపాలు వణికించాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ ముప్పు సంభవిస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేథ్యంలోనే కొన్ని పరిశోధన సంస్థలు భూకంపం గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పిక్ ఎర్త్‌క్విక్ అనే పేరు కలిగిన ఓ సంస్థ వెల్లడించిన భూకంప సూచనల నేపథ్యంలో ఈ వార్తలు వైరల్ అవుతూ జనాల్లో టెన్షన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం కేంద్రంగా పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని.. అది హైదరాబాద్, అమరావతి వరకు ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వటంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు పెద్దగా లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 2013లో కూడా చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా... ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. కానీ, ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. అలాగ...
- Get link
- X
- Other Apps
హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉంది? రామాయణం అంటే మనందరికీ తెలిసిన పురాణ గాధ. శ్రీరాముడు, సీత, లక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతను అపహరించాడు. ఆమెను రక్షించేందుకు రాముడు వానరసేన సహాయంతో లంక మీద యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధంలో లక్ష్మణుడు కుంభకర్ణుడి కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. లక్ష్మణుడిని కాపాడేందుకు ఒక ప్రత్యేకమైన మూలిక అవసరమైంది. ఆ మూలిక పేరే సంజీవని. ఇది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుందని తెలియడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి, అక్కడ ఏది సంజీవనో తెలియక మొత్తం కొండనే తీసుకుని వచ్చేశాడు. ఆ మూలికల ద్వారా లక్ష్మణుడు ప్రాణం దక్కించుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. మరి లక్ష్మణుడు బతికి తర్వాత హనుమంతుడు సంజీవని కొండను తిరిగి హిమాలయాలకు తీసుకెళ్లాడా? లేక ఎక్కడన్న వదిలేశాడా? అనే విషయంపై అనేక నమ్మకాలు, భౌగోళిక పరిశోధనలు, పురాణ గాధలు, ఆసక్తికరమైన ఊహాగానాలు ఉన్నాయి. కొన్ని కథల ప్రకారం, మూలిక ఉపయోగించిన తర్వాత, హనుమంతుడు ఆ కొండను తిరిగి హిమాలయాల్లో ఉంచేశాడట. మరికొన్ని కథల ప్రకారం.. హనుమంతుడు కొండను తిరిగి హిమాలయాలకు తీసుకెళ్లలేదు. ఆ...
- Get link
- X
- Other Apps
గాలిలో విమానం ... పైలట్ కు గుండెపోటు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగినఒక షాకింగ్ ఘటన అందరినీ కలవరపెడుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ అర్మాన్, శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన కొద్ది సేపటికే గుండెపోటుతో కన్నుమూశాడు! అవును, ఈ వార్త వినగానే మనసు బరువెక్కిపోతుంది కదా? ఏం జరిగింది, ఎలా జరిగిందో కాస్త వివరంగా చూద్దాం! ఇది ఏప్రిల్ 9, 2025న జరిగిన వాస్తవ సంఘటన. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ అర్మాన్ 36 సంవత్సరాల లోపే . శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని (IX-747) నడిపిన తర్వాత ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటు తో మరణించాడు. అయితే విమానం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే అర్మాన్ కాక్‌పిట్‌లో వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత డిస్‌పాచ్ ఆఫీస్‌లో ఉండగా అతను కుప్పకూలిపోయాడు. వెంటనే విమానాశ్రయ వైద్య సిబ్బంది అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చేరే సమయానికి అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ఈ ఘటన గురించి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తూ, అర...
- Get link
- X
- Other Apps
కోట్ల ఆస్తిని, కన్నవారిని కాదనుకొని ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..? డబ్బులు ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కొందరు కోటీశ్వరులను చూసి.. తాము కూడా కోటీశ్వరుల ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేదని, లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసే వాళ్లం అని అనుకుంటారు. ఇలా చాలా మంది కోరుకునే ఈ అద్భుతమైన జీవితం ఓ యువతికి దక్కింది. కానీ, ఆమె వాటన్నింటిని కాదని, ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కన్నవారికి బాధను మిగిల్చింది. పుట్టుకతోనే ఆమె కోటీశ్వరురాలు. చిటికెస్తే.. కోరుకున్నవన్నీ కళ్ల ముందుకొస్తాయి. ఆమెకు ఘనంగా వివాహం చేయాలని పేరెంట్స్ ఎన్నో కలలు కన్నారు. కానీ, ఆమె మాత్రం ఆ కలల్ని కల్లలు చేసింది. వైవాహిక జీవితం, డబ్బు ఏమీ తనకు వద్దని..ఇవన్నీ శాశ్వతం కావని సన్యాసం పుచ్చుకుంటాను అంటూ తెగేసి చెప్పింది. మరి, ఆమె ఎవరు? ఆమె కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక యాదిర్ నగరంలోని జైన్ బ్లాక్ కి చెందిన కోటీశ్వరుడు నరేంద్ర గాంధీ. వీళ్లు వారసత్వంగా వ్యాపారంను చేస్తున్నారు. మూడు, నాలుగు తరాలుగా వ్యాపారంలో ఉన్న నరేంద్ర గాంధీ కోట్లలో ఆస్తులను కూడపెట్టాడు. ఆయనకు భార్య సంగీత గాంధీ, ఇద్...
- Get link
- X
- Other Apps
నల్లగండ్లలో సందడి చేసిన సన్రైజర్స్ ఆటగాళ్లు, సినీ నటులు హైదరాబాద్ పరిధిలోని నల్లగండ్లలో పలువురు క్రికెటర్లు నటులు సందడి చేశారు. శుక్రవారం అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన టిబిసి సెలూన్ ప్రారంభోత్సవానికి సన్రైజర్స్ హైదరాబాద్ టీం క్రికెటర్లు హాజరై సందడి చేశారు. ఆస్ట్రేలియా కు చెందిన ప్రముఖ హెయిర్ సెలూన్ నల్లగండ్లలో నూతన బ్రాంచ్ ప్రారంభించక సన్రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టైలిష్ తో పాటు మరికొందరు క్రికెటర్లు సినీ నటులు అక్కడికి వెళ్లి సందడి చేశారు . దీనికి సంబంధించిన విజువల్స్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.... ఈ టీబీసీ సెలూన్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి