Posts

Showing posts from June, 2025
Image
 AP లో NDA ప్రభుత్వం 2024 సం. లో ఏర్పడిన తర్వాత 2025 సం.  కు గాను వేట నిషేద సమయంలో 1,29,789 మందికి మత్స్యకార భరోసా కింద జీవనభృతి 258 కోట్ల రూపాయలు విడుదల చేసారని ఏప్రిల్ 26 వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రభుత్వం చెక్ ను విడుదల చేస్తూ ప్రకటన చేసింది . ఇంకా అందులో 53650 మంది అర్హత కలిగిన మత్స్యకారులకు మత్స్యకార భరోసా రావాల్సి ఉందని ప్రచారం జరుగుతుంది. కనుక ఇంకా ఎంత మందికి మత్స్యకార భరోసా ఇవ్వలేదో, ఏ కారణాలు చేత ప్రభుత్వం అకౌంట్ లలో డబ్బులు జమ చేయలేదో అలాగే మిగిలిన వారికి మత్స్యకార భరోసా డబ్బులు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లలో జమ చేస్తారో సరియైన ప్రకటన చెయ్యాలి అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని , ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రార్ధిస్తున్నాం 🙏.
Image
 అది రాయి దాడి కాదు... ఒక వడ్డెర కులస్తుడి జీవితాన్ని జగన్ నాశనం చేశారు: ఏబీ వెంకటేశ్వరరావు శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ రాయి దాడి కేసులో సతీశ్‌ను బలిపశువును చేశారని ఆరోపణ గజమాల దెబ్బను రాయి దాడిగా చిత్రీకరించి లబ్ధి పొందారన్న ఏబీవీ సతీశ్‌ను, అతని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కేసు మూసివేసి, బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగింది రాయి దాడి కానే కాదని, అది కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన కట్టుకథ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని, అమాయకుడైన వడ్డెర కులానికి చెందిన సతీశ్ అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, మనుషుల జీవితాలతో చెలగాటమాడే నైజం జగన్‌దని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు నేడు విజయవాడలో 'రాయి దాడి' కేసులో నిందితుడిగా చిత్రికరించబడి, 45 రోజుల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపిన...
Image
 Sr NTR పైన ఎందుకు ఇంతలా trolls చేస్తున్నారు ఎన్టీఆర్ తిండి అలవాట్ల పై ట్రోల్స్ వైసీపీ, జనసేన సోషల్ మీడియాను దాటుకుని.. మీమర్స్, కామన్ నెటీజన్స్, జియో హాట్ స్టార్, జోమాటో వరకు వెళ్లిపోయాయి.  టీడీపీ స్వయంకృతం. ప్రజలు హద్దులు దాటిన వ్యక్తి పూజను అంగీకరించరు. ఓదార్పు యాత్ర సమయంలో జగన్ పై కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి.. కానీ కార్పొరేట్ స్థాయి వరకు వెళ్ళలేదు.  ఎన్టీఆర్ లేకపోతే తెలుగు ప్రజలు లేరు, తెలుగు ఐడెంటిటీ లేదు, తెలుగు ప్రముఖుల్లో ఎన్టీఆర్ ది ప్రధమస్థానం అని ఇన్నాళ్లూ టీడీపీ జనం పై రుద్దింది. బతికుండగా ఎన్టీఆర్ ను పదవి నుండి తప్పించి, టీడీపీ నుండి బహిష్కరించి, చెప్పులు వేసి మరీ అవమానించారు. 11 మంది సంతానంలో ఒక్కళ్ళూ ఆయన పక్షాన నిలబడింది లేదు.  ప్రస్తుతం వీరే ఎన్టీఆర్ ను కారణజన్ముడు, దైవంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అంటూ ప్రతి ఏటా ప్రజలకు విసుగు, చికాకు తెప్పిస్తున్నారు. ఎందుకు ఈ సారి నెటిజన్లు ఔట్ బరస్ట్ అయ్యారు.
Image
 ఒకప్పుడు టీవీలో అరిచి గోల చేసిన Naaptol ఇప్పుడేమైంది? ప్రజలను ఎలా మోసం చేసింది! ‘నాప్టోల్’ ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని ఒక క్లిక్‌తో షాపింగ్ చేయడం సర్వసాధారణం. కానీ, ఆన్‌లైన్ షాపింగ్ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో టీవీలో నాప్టోల్ చేసిన అడ్వటైజ్ హడావుడి అంతా ఇంతా కాదు. జస్ట్ టీవీ ఆన్‌ చేస్తే చాలు.. ఆఫర్ ఆఫర్ అంటూ అరిచి గోల చేసేవాళ్లు. తక్కువ స్టాక్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్ కొద్ది సమయం మాత్రమే.. త్వరపడండి త్వరపడండి అంటూ హంగామా చేసేవాళ్లు. ఇలా నాప్టోల్ యాంకర్ అరిచి గోల చేయని ఇళ్లు ఉండదేమో.  ఇంటర్నెట్, ఆన్‌లైన్ షాపింగ్  అంతగా లేని రోజుల్లో అరిచి గోల చేసి మరీ సామాన్యులతో వస్తువులను కొనిపించిన నాప్టోల్ ఇప్పుడు కనీసం కనిపించును కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. నాప్టోల్‌లో జరిగిన మోసం, ఫిర్యాదులు, కోర్టు కేసులు ఒక కారణమని చెప్పొచ్చు.  అసలు ఈ నాప్టోల్ ఎలా పుట్టింది. ప్రతి ఇంట్లో ఈ యాడ్ వచ్చేలా చేసిన స్ట్రేటజీ ఏంటి? ఎలా పాపులర్ అయింది? ప్రజలను ఎలా మోసం చేసింది? కోర్టుకు ఎందుకు వెళ్లింది? చివరకు ఏమైందని ఈ వీడియోలో తెలుసుకుందాం. నాప్టోల్ క...
Image
 పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి  సత్తెనపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై  ఎమ్మెల్యే  కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ . జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగింది..  వైసీపీ పాలనలో ఎన్నికల ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారు .. జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారు .. కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది .. తెనాలి లో ఆరాచక శక్తులను మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహిస్తున్నారు .. గతంలో పరామర్శ వెళ్లిన లోకేష్ పై  వైసీపీ వాళ్లు దాడి చేశారు . ఆరాచక శక్తులకు జగన్ మద్దతు .. చంద్రబాబు ఆధికారంలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని సమిక్షించారు .. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు .. సత్తెనపల్లి నియోజకవర్గంలో  అభివృద్ధి కార్యక్రమలు చేస్తున్నాము .. కొండమోడు ..పేరెచర్ల రహదారి  పనులు ప్రారంభం .. కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి ,సంక్షేమం పరుగులు తీస్తుంది .. అమరావతి రాజధాని రావటంతో భూములు విలువ పెరిగింది ..