Sr NTR పైన ఎందుకు ఇంతలా trolls చేస్తున్నారు
ఎన్టీఆర్ తిండి అలవాట్ల పై ట్రోల్స్ వైసీపీ, జనసేన సోషల్ మీడియాను దాటుకుని.. మీమర్స్, కామన్ నెటీజన్స్, జియో హాట్ స్టార్, జోమాటో వరకు వెళ్లిపోయాయి.
టీడీపీ స్వయంకృతం. ప్రజలు హద్దులు దాటిన వ్యక్తి పూజను అంగీకరించరు. ఓదార్పు యాత్ర సమయంలో జగన్ పై కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి.. కానీ కార్పొరేట్ స్థాయి వరకు వెళ్ళలేదు.
ఎన్టీఆర్ లేకపోతే తెలుగు ప్రజలు లేరు, తెలుగు ఐడెంటిటీ లేదు, తెలుగు ప్రముఖుల్లో ఎన్టీఆర్ ది ప్రధమస్థానం అని ఇన్నాళ్లూ టీడీపీ జనం పై రుద్దింది. బతికుండగా ఎన్టీఆర్ ను పదవి నుండి తప్పించి, టీడీపీ నుండి బహిష్కరించి, చెప్పులు వేసి మరీ అవమానించారు. 11 మంది సంతానంలో ఒక్కళ్ళూ ఆయన పక్షాన నిలబడింది లేదు.
ప్రస్తుతం వీరే ఎన్టీఆర్ ను కారణజన్ముడు, దైవంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అంటూ ప్రతి ఏటా ప్రజలకు విసుగు, చికాకు తెప్పిస్తున్నారు. ఎందుకు ఈ సారి నెటిజన్లు ఔట్ బరస్ట్ అయ్యారు.

Comments
Post a Comment