అల్లుడితో పారిపోయిన అత్త

సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు రకరకాల కారణాలతో ఇరు కుటుంబ పెద్దలు అడ్డుకుంటారు. వీరి ప్రేమకు ఆస్తులు, కులాలు, మతాలు అడ్డుగా నిలుస్తాయి. కొందరు రాజీ పడి విడిపోగా..

మరికొందరు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు. కానీ, ఇప్పుడున్న ప్రేమ మాత్రం వావి వరుసలు లేకుండా ఉంటుంది. సరిగా ఇలాంటి ఓ వార్త నెట్టింట సంచలనం  సృష్టిస్తోంది.  పది రోజుల్లో కూతురి వివాహం అనగా .. ఓ తల్లి అమ్మాయికి కాబోయే వరుడితో పారిపోయింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 


ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం ఓ మహిళ కూతురికి పెళ్లి చేయడం కోసం ఓ యువకుడిని చూసింది. అతనితోనే కూతురికి నిశ్చితార్థం జరిగింది.పెళ్లికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉందనగా.. అమ్మాయి తల్లి కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన అత్తా అల్లుడు అటు నుంచి అటే జంప్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది. దాంతో,  రెండు కుటుంబాల వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 



అంతేకాకుండా వారు పారిపోయేటప్పుడు తన కుమార్తె పెళ్లి కోసం దాచిన 5 లక్షల విలువ చేసే బంగారం, 2.5 లక్షల డబ్బున కూడా తనతో తీసుకెళ్లింది. అయితే, పెళ్లి కుదిరిన కొన్ని రోజుల తర్వాత అత్తకు అల్లుడు మొబైల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే ఆమెతో ప్రతిరోజూ ఫోన్‌లతో మాట్లాడేవాడని తెలిపారు. అంతేకాకుండా అప్పుడప్పుడు అత్త ఇంటికి వచ్చి, గంటల తరబడి ఒకే గదిలో ఉండి మాట్లేవాడు. ఇదిలా కొనసాగుతుండగా..అల్లుడితో ప్రేమలో పడిపోయింది.


ఈ నెల 16వ తేదీన పెళ్లనగా.. ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని అతడితో జంప్ అయ్యింది. విషయం తెలుసుకున్న పారిపోయిన మహిళ భర్త,  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కన్న కూతురి కోసం ఆ తల్లిదండ్రులు వరుడిని వెతికారు. తన కూతురి కాపురం బాగుండాలని, కలకాలం ఏ కష్టం లేకుండా సుఖంగా జీవించాలని కోరుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి ముహూర్తం అనగా ఈ సంఘటన బంధువులందరిని షాక్‌కి గురిచేసింది.


Comments

Popular posts from this blog