అమెరికా రహస్యంగా చేస్తున్న ప్రయోగాల గురించి మీకు తెలుసా? ఇప్పటికీ కొనసాగున్నాయి! 

అమెరికా.. ప్రపంచ అగ్రరాజ్యంగా ఉన్న దేశం. ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ.. తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా.. రహస్య ప్రయోగాలు చేస్తోంది. వాటిల్లో ప్రాజెక్ట్ MK Ultra, Area 51, PRISM ఈ పేర్లు వినగానే ఒక మిస్టరీ సినిమా సీన్ మన కళ్లముందు కనబడుతంది. కానీ, ఇవి కేవలం సినిమా కథలు కాదు.. అమెరికా చరిత్రలో నిజంగా జరిగిన, ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలిన సంఘటనలు. అసలు ఈ రహస్య ప్రయోగాలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు అవి ఏ స్టేజ్‌లో ఉన్నాయి? అనే విషయాలతోపాటు అమెరికా రహస్య ప్రయోగాల చీకటి అధ్యాయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.


అమెరికా రహస్య ప్రయోగాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది. 1947-1991 మధ్య జరిగిన కోల్డ్ వార్‌లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. సైన్స్, టెక్నాలజీ, గూఢచర్యం, ఆయుధాలలో ఒకరినొకరు మించిపోవాలనే పోటీతత్వం నడిచేది. ఈ సమయంలో, అమెరికా తన శత్రువులను అధిగమించడానికి, లేదా వారి రహస్యాలను తెలుసుకోవడానికి, అనేక రహస్య ప్రయోగాలను చేపట్టింది. ఈ ప్రయోగాలు కొన్ని సైన్స్ ఆధారితమైనవి, మరికొన్ని మానసిక యుద్ధాల గురించినవి ఉండేవి.


ఒక ఉదాహరణ ప్రాజెక్ట్ MK Ultra. 1953లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది. దీని లక్ష్యం? మనుషుల మనస్సును నియంత్రించడం. అంటే, ‘మైండ్ కంట్రోల్’. సోవియట్ యూనియన్, చైనా, ఉత్తర కొరియా తమ ఖైదీలపై మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాయనే భయంతో, CIA ఈ రహస్య ప్రయోగాన్ని ప్రారంభించింది. LSD లాంటి సైకోఆక్టివ్ డ్రగ్స్, హిప్నాటిజం, ఎలక్ట్రోకాన్వల్సివ్ థెరపీ ఇవన్నీ సాధారణ అమెరికన్ పౌరులపై, తరచూ వారికి తెలియకుండా, ప్రయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1973 వరకు కొనసాగింది. చివరకు 1975లో దీని గురించి ప్రజలకు తెలిసినప్పుడు, అది ఒక పెద్ద వివాదంగా మారింది.


మరో ఉదాహరణ Area 51, నెవాడా ఎడారిలో ఉన్న ఒక రహస్య సైనిక స్థావరం. 1940ల నుంచి, ఈ ప్రాంతం అమెరికా వైమానిక దళం యొక్క అత్యంత రహస్య ప్రయోగాలకు కేంద్రంగా ఉంది. U-2 స్పై ప్లేన్, SR-71 బ్లాక్‌బర్డ్, F-117 స్టెల్త్ ఫైటర్ లాంటి అత్యాధునిక విమానాలు ఇక్కడ పరీక్షించబడ్డాయి. కానీ, Area 51 గురించి ఎక్కువగా చర్చించబడేది ఏలియన్ సంబంధిత రూమర్స్. 1947లో రోస్‌వెల్ ఘటన తర్వాత, Area 51లో ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అందులోనూ  90లలో X-Files లాంటి షోలు టీవీలో వచ్చినప్పుడు, ఏలియన్స్ గురించిన ఊహాగానాలు బాగా పాపులర్ అయ్యాయి. 


మరో ఆసక్తికరమైన ప్రయోగం PRISM, 2007లో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేపట్టిన ఒక సర్వైలెన్స్ ప్రోగ్రామ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ లాంటి టెక్ కంపెనీల నుంచి డేటా సేకరించి, అమెరికన్, విదేశీ పౌరుల ఇమెయిల్స్, ఫోన్ కాల్స్, బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేశారు. 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ ప్రోగ్రామ్ గురించి లీక్ చేసినప్పుడు, అది ప్రపంచవ్యాప్తంగా వివాదంగా మారింది.


నిజానికి ఈ ప్రయోగాలను అమెరికా చాలా సీక్రేట్‌గా చేసింది. కోల్డ్‌వార్ సమయంలో.. అమెరికా తన సైనిక టెక్నాలజీ, గూఢచర్య రహస్యాలను శత్రువుల నుంచి కాపాడాలనుకుంది. Area 51లో అభివృద్ధి చేసిన స్టెల్త్ విమానాలు సోవియట్ రాడార్‌లను మోసం చేయగలవు. అందుకే దాన్ని రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం. అలాగే ప్రజల భయం. MK Ultra లాంటి ప్రయోగాలు నైతికంగా తప్పని తెలిసిన CIA, ప్రజల నుంచి వ్యతిరేకాన్ని నివారించడానికి వాటిని దాచింది. ఇక Tuskegee Syphilis Studyలో అమెరికా ప్రభుత్వం 600 మంది ఆఫ్రికన్-అమెరికన్ పురుషులపై సిఫిలిస్ రోగాన్ని చికిత్స లేకుండా అధ్యయనం చేసింది, వారికి తెలియకుండా. ఇలాంటి ప్రయోగాలు ప్రజలకు తెలిస్తే, ప్రభుత్వంపై నమ్మకం పోతుందని భయపడింది. 


మొత్తానికి ఈ రహస్య ప్రయోగాల వల్ల అమెరికా సైన్స్‌లో, గూఢచర్యంలో ఎంతో పురోగతిని తెచ్చాయి, అయితే, అవి వివాదాలను కూడా సృష్టించాయి. MK Ultraలో, వందలాది మంది అమెరికన్ పౌరులు తమ అనుమతి లేకుండా డ్రగ్స్‌కు గురయ్యారు. కొందరు మానసిక సమస్యలతో బాధపడ్డారు. 1975లో సెనేట్ చర్చ్ కమిటీ విచారణ తర్వాత, CIA ఈ ప్రయోగాలను ఆపేసింది, కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. Area 51 విషయంలో, ఏలియన్ రూమర్స్ ప్రజల ఊహాశక్తిని రెచ్చగొట్టాయి, కానీ అమెరికా ప్రభుత్వం 2013 వరకు Area 51 ఉనికిని అధికారికంగా ఒప్పుకోలేదు. 


మరి ఇప్పుడు  అంటే 2025లో అమెరికా తన రహస్య ప్రయోగాలను పూర్తిగా ఆపేసిందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. Area 51లో ఇప్పటికీ ఏలియన్స్‌తోపాటు కొత్త డ్రోన్స్, హైపర్‌సోనిక్ విమానాలు పరీక్షిస్తున్నారని ఊహాగానాలు ఉన్నాయి. NSA సర్వైలెన్స్ ప్రోగ్రామ్స్, సైబర్ యుద్ధ సామర్థ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ Sun Streak లాంటి విచిత్రమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో రిమోట్ వ్యూయింగ్ అంటే.. దూరం నుంచి మానసికంగా చూడగల సామర్థ్యం గురించి ప్రయోగాలు ప్పటికీ కొనసాగుతున్నాయని కొందరు నమ్ముతారు. అమెరికా సైనిక బడ్జెట్‌లో 728 బిలియన్ డాలర్లు రీసెర్చ్ మరియు డిఫెన్స్ టెక్నాలజీల కోసం ఖర్చు చేస్తోందట. ఇందులో లేజర్ ఆయుధాలు, AI ఆధారిత సైనిక వ్యవస్థలు ఉన్నాయని చెబుతున్నారు. 


మరి అమెరికా ఈ ప్రయోగాలను ప్రపంచానికి ఎందుకు తెలియకుండా చేస్తున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఈ ప్రయోగాల వల్ల ప్రపంచానికి త్వరలో ముప్పుు ఉందని చాలా దేశాలు వాదిస్తున్నాయి. 

.


Comments

Popular posts from this blog