మిస్టరీగా మిగిలిన 8 బంగారు బావులు
ఒకప్పుడు అది రాజుల కోట, ఇప్పుడు రహస్యాల నిలయం. హిమాచల్ ప్రదేశ్ పర్వతాలలో ఓ పురాతన కోట. దాని గోడలు కాలాన్ని జయించిన కథల్ని చెబుతుంటే… నేలలో దాగిన బావులు మాత్రం ఎన్నో రహస్యాలను, అపార సంపదను దాచుకొని ఉన్నాయి. అనేక శతాబ్దాలుగా ఈ కోటలో దాగిన బంగారం కథలు, రత్నాల రహస్యాలు చుట్టుపక్కల ప్రజల ఊహలకు ఎగిసిన మంటల్లా ఉన్నాయి. అదే కాంగ్రా కోట. ఇది కేవలం ఒక ప్రాచీన కోట మాత్రమే కాదు.. ఇది రహస్యంగా దాగిన ధనసంపదలతో నిండి ఉన్న ఒక మిస్టరీ. శతాబ్దాలుగా ఈ కోట అనేక రాజుల చేతుల్లోనూ, దొంగల చేతుల్లోనూ దోపిడీకి గురైంది. కానీ,ఈ బావుల్లో దాగి ఉన్న రహస్యాలు మాత్రం ఎప్పటికీ బయటపడలేదు. ఆ బావిలో బంగారు ఆభరణాలు, రత్నాలు నిజంగా ఉన్నాయా? ఉంటే అవి కోటలో ఎక్కడ ఉన్నాయి? లేక ఇదంతా ఒక కల్పిత గాధేనా? దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
పూర్వం భారతదేశంలో రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం కోటలను బలంగా నిర్మించేవారు. అంతేకాకుండా కోటలోని సంపద మొత్తంను కాపాడుకునేందుకు రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకునేవారు. అలాంటి రహస్యమైన కోటలలో ఒకటే ఈ కాంగ్గ్రా కోట. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్‌డా సమీపంలో ఈ కోట ఉంది. సుమారు 3,500 సంవత్సరాల క్రితం ఈ కాంగ్‌డా కోటను కటోచ్ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర అనే రాజు శత్రువుల దాడి నుండి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు దీనిని నిర్మించారు. ఈ కోట లోపలికి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే , కాపాలాదారులు వారి తల మొడెంను వేరు చేసేవారు. అందుకు కారణం ఆ కోటలో ఉన్న అపారమైన సంపదే.
ఈ కోటలో ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు గుట్టలుగుట్టలుగా వచ్చేవి. అప్పటి రాజులు ఆ సంపద మొత్తంను దేవతలకు సమర్పించేవారట. కొంత కాలం తరువాత ఆ సంపద లెక్కపెట్టలేనంతగా పేరిగిపోయింది. ఈ సంపద మొత్తంను రక్షించాలని భావించి సుశర్మ చంద్ర కోటలోని రహస్యంగా ఏర్పాటు చేసిన 21 బావులలో ఈ సంపదను భద్రపరిచాడు. ప్రతి బావి సుమారు 4 మీటర్లు లోతు మరియు 2.5 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది.
అయితే, కాలక్రమేన ఈ కోటలోని 8 బావులను మహమ్మద్ గజినీ దొచుకోగా, ఆ తరువాత భారతదేశంలోని వచ్చిన బ్రిటీష్ వారు 5 బావులలోని సంపదను దోచుకెళ్లారు. ఆ తరువాత ఈ కోటలోని సంపద కోసం ఎన్నో భీకరమైన యుద్ధాలు జరిగాయి. కానీ, ఇప్పటికీ రహస్యంగా ఉన్న ఆ 8 బావులు ఎక్కడ ఉన్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. కోటలో ఉన్న ఆ 8 బావులు, అందులోని సంపద ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది
.jpg)

Comments
Post a Comment