గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించిన టీచర్! తన కోసం జైలులోనే డిగ్రీ చదివిన గ్యాంగ్‌స్టర్!
ఈ రోజుల్లో ప్రేమంటే ఓ ఫిల్టర్ ఫోటో... ఒక Insta స్టోరి. కానీ కొన్ని ప్రేమలు నేరంగా మొదలై, జీవితంగా మారిపోతాయి. అలాంటి ప్రేమ కథే ఇది. ఒక టీచర్, ఒక గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించింది. ఆ గ్యాంగ్‌స్టర్ జైలులో ఉన్నప్పుడు... ఆమె జైలులోకి వెళ్లి అతనిని పెళ్లి చేసుకుంది. ఇది సినిమా కాదు... ఇది నిజమైన కథ.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండే ఒక టీచర్ పేరు స్నేహా. స్నేహా ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్. తనకి జాబ్, హోమ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. రోజూ స్కూలుకు వెళ్లి, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులని చూసుకుంటూ అదే జీవితం అన్నట్లు బతికేది.
ఒకరోజు, స్నేహకు ఒక పేపర్లో వార్త కనిపిస్తుంది. ఒక క్రిమినల్ ‘విక్రాంత్’ ను పోలీసులు అరెస్ట్ చేశారని. ఆర్టికల్‌లో ఉన్న ఫోటో, ఆ కథనం ఆమె మనసుని కదిలించింది. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్‌లో ఉన్న అతని ముఖంలో పశ్చత్తాప ఎక్స్‌ప్రెషన్ కనిపించింది స్నేహకు. పత్రిక చదవడం, ఆ వ్యక్తి గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం వంటివి చేసింది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి. విక్రాంత్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత స్నేహకు.. విక్రాంత్‌తో ఓ ‘ఎమోషనల్ అటాచ్‌మెంట్’ ఏర్పడింది. తర్వాత స్నేహ ఓ డెసిషన్ తీసుకుంది. అదే జైలులో ఉన్న విక్రాంత్‌కి లెటర్ రాయాలని.
నిజానికి విక్రాంత్ పేరు పోలీస్ రికార్డుల్లో ఓ 'రిపీట్ ఆఫెండర్'. బెంగళూరులో గ్యాంగ్‌ఫైట్స్, కిడ్నాప్, మర్డర్ టెంప్ట్ వంటి కేసులు అతని మీద ఉన్నాయి. కానీ అతని జీవితం ఒక ట్రాజడీ అని చెప్పొచ్చు.
విక్రాంత్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. దీంతో విక్రాంత్ చిన్నప్పుడే స్ట్రీట్ గ్యాంగ్స్‌లో చేరాడు. ఎన్నో ఓటములు చూసిన బాల్యం అతని వ్యక్తిత్వాన్ని తారుమారు చేసింది.
ఇదంతా తెలిసిన స్నేహ.. తాను అనుకున్నట్లుగానే విక్రాంత్‌కి ఒక లెటర్ రాసింది. ఆశించని విధంగా, జైలులో ఉన్న విక్రాంత్ కూడా ఆమెకు రిప్లై ఇచ్చాడు. మొదట ఆ లెటర్‌లో విక్రాంత్ విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. ‘నువ్ నాకెందుకు లెటర్ రాసావ్? నేను మంచివాడిని కాదు.. నేను నిన్ను ఏమైనా చేసే అవకాశం ఉంది. విక్రాంత్ అన్న ఆ మాటల్లో స్నేహకు ఓ వేదన కనిపించింది. స్నేహా ఆ లెటర్‌కి కూడా సమాధానం ఇచ్చింది.
అలా వారి మధ్య పదే పదే లెటర్లు మారుతూ, కొన్ని నెలల్లో అది ఓ రిలేషన్‌షిప్‌గా మారింది. స్నేహా చివరికి అతన్ని కలిసి మాట్లాడాలని డెసైడ్ అయింది. కోర్ట్ అనుమతితో, జైలులో అతన్ని కలిసింది. విక్రాంత్.. స్నేహను చూసిన మొదటిసారి చాలా ఆశ్చర్యపోయాడు. నిజంగా ఒక టీచర్ తనను ప్రేమించిందా? అని నమ్మలేకపోయాడు. కానీ, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తను లెటర్స్ రాసింది తనేని కన్ఫార్మ్ చేసుకున్నాడు. మరోవైపు స్నేహ కూడా.. నేను ఒక క్రిమినల్‌ను ప్రేమించడం కరెక్టేనా? ఎంతైనా అతను ఒక క్రిమినల్ అని ఆలోచిస్తూనే విక్రాంత్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లింది.
ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. చివరగా.. స్నేహ విక్రాంత్‌ను ఒక్క మాట చెప్పింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు మారిపోతావని నమ్ముతున్నాను’ అని. ఆ మాట విన్న విక్రాంత్‌కు కన్నీళ్ల ఆగలేదు. ఆ కన్నీటినీ తుడుచుకుంటూ ‘నీ కోసం నేను మారుతాను’ అని సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య లెటర్స్ నడిచాయి. చివరకు 2003 నవంబర్‌లో, ఇద్దరి కుటుంబ సభ్యులు, పోలీసుల అనుమతి తీసుకుని, జైలులోనే ఒక చిన్న పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత స్నేహా తరచుగా అతనిని కలుస్తూ, అతనికి చదువు చెప్పింది. అతను జైలులో ఉండగానే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు.
వారి పెళ్లి వార్త బయటికి రావడంతో, సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వచ్చాయి.
కొందరు ‘ఒక టీచర్ ఇలా నేరస్థుడిని పెళ్లి చేసుకోవడం తప్పు’ అని వాదించారు. మరికొందరు ‘ప్రేమ ఎవరినైనా మారుస్తుందని సపోర్ట్ చేశారు.
2024లో విక్రాంత్‌కు బెయిల్ మంజూరైంది. బెయిల్ షరతుల ప్రకారం.. అతను కెన్సలింగ్‌కి హాజరవుతున్నాడు. ప్రస్తుతం విక్రాంత్ ఒక NGOలో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాడు. స్నేహ తన టీచర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తోంది.
వీరి ప్రేమపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో పంచుకోండి.

Comments
Post a Comment