పది తలల రావణాసురుడికి ప్రత్యేక ఆలయం.. మనకి దగ్గర్లోనే..?


పది తలల రావణుడు.. రాముడి చేతిలో ఓడిపోయిన రాక్షసుడిగా మనందరికీ తెలుసు. కానీ, రావణుడు అనేక విద్యలు తెలిసిన మహాపండితుడు. అయినా మనం అతన్ని రాక్షసుడిగానే గుర్తుపెట్టుకున్నాం. కానీ,  ఈ దేశంలో ఓ ఊరు మాత్రం, రావణుడిని దేవుడిలా పూజిస్తుంది. ఆలయం కట్టి ప్రతిరోజూ అర్చనలు, అభిషేకాలు చేస్తుంది. మనం ఎలా అయితే, భగవంతుడికి ప్రత్యేకంగా జాతర జరుపుతామో. అదే విధంగా ఆ ఊరుఊరంతా రావణుడికి జాతర నిర్వహిస్తుంది. 


ఈ ఊరిలో రాముడి పేరు కాదు, రావణుని పేరే వినిపిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే పూజారి రావణుని ఆశీస్సులు కోరతారు. ఒకసారి ఊరిలో వర్షం కురిసిందంటే అది రావణుడి కటాక్షమని నమ్ముతారు. ఇదంతా వినడానికి వింతగా ఉంది కదా? కానీ ఈ కథ వెనుక దాగున్న నిజాలు, నమ్మకాల పరంపర, పౌరాణిక భయాలు ఇలా అనేక విషయాలు దాగి ఉన్నాయి. 


ఇదీ రావణుడే దేవుడిగా మారిన గ్రామం కథ. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గుడి ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 


రావణాసురుడంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సీతాపహరణం, రాక్షస స్వభావం, రామునితో యుద్ధం. కానీ, ఇదంతా ఆయన జీవితంలోని ఒక కోణం మాత్రమే. రావణాసురుడు నిజానికి రాక్షసుడే అయినా, అతి పెద్ద జ్ఞాని, 

అన్ని వేదాలు చేతివేళ్లపై చెప్పగలిగే శక్తి, శివుడిని పూజించి వరాలు పొందిన భక్తి,  లంకను స్వర్గంగా తీర్చిదిద్దిన రాజనీతి పది తలల రావణాసురుడిది.  


మరి అటువంటి రావణాసురుడిని పూజించే ఊరు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న చిక్కాలి గ్రామం. ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు, రావణుడికి జాతర చేసి, ఆ రోజు ఊరి ప్రజలంతా రామ, రావణ యుద్ధంపై నాటకం కూడా వేస్తారు. ఈ జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊరుల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తుంటారు. 


ఈ ఆలయంలో పూజారి పేరు బాబూభాయ్ రావణ్. రావణుడికి సమర్పించే పూజలన్నింటిని ఈయన నిర్వహిస్తుండటంతో ఈయనను బాబూభాయ్ రావణ్ అని పిలుస్తారు. ఈ పూజారికి రావణుడి ఆశీర్వాదం ఉందని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఊరికి ఏదైనా సమస్య వస్తే, ప్రజలు అతని వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు. అప్పుడు రావణుడి విగ్రహం ముందు బాబూభాయ్ రావణ్ కూర్చుని ప్రజల కోరిక తీరేంతవరకు నిరాహార దీక్షలో ఉంటారు. 


ఒకసారి ఈ గ్రామం, చుట్టుపక్కల ఊర్లు నీటి కొరతతో సతమతమయినప్పుడు, బాబుబాయ్ రావణుడి విగ్రహం ముందు కూర్చుని పూజ ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా 3 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో కుంభవృష్టిగా వాన కురిసింది. ఈ గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది. 


అయితే, ఒకసారి ఏదో కారణంగా ఊరి ప్రజలు,  చైత్ర దశమి రోజున రావణుడికి జాతర, పూజలు చేయకుండా ఉండిపోయారట. తర్వాత అగ్నిప్రమాదంలో చిక్కుకుని ఊరంతా తగలబడి పోయింది. కానీ, ఎవ్వరికీ ప్రాణ నష్టం జరగలేదు. 


ఈ సంఘటన జరిగిన తరువాత  మరోసారి రావణుడి జాతర నిర్వహించకుండా ఊరు ఎలా మంటల్లో తగులబడుతూందో పరీక్షించాలని ప్రయత్నించారు. ఈ సారి మంటలు వచ్చే అవకాశం లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఆ సమయంలో పెను తుఫాను వచ్చి ఊరిని అల్లకల్లోలం చేసింది. దీంతో భయపడిపోయన ప్రజలు అప్పటి నుండి క్రమం తప్పకుండా రావణాసురుడికి  జాతరను జరిపిస్తున్నారు.


మరి రావణాసురుడికి కూడా మన దేశంలో గుడి ఉందనే విషయం మీకు ముందే తెలుసో లేదో కామెంట్ చేయండి. 



Comments

Popular posts from this blog