మరణానికి 5 నిమిషాల ముందు శరీరం చెప్పే సంకేతాలు ఇవే!
మరణం అనేది మనం ఎప్పటికీ తప్పించుకోలేని నిజం. కానీ చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తుందంటారు. అయితే ఆ లక్షణాలు ప్రతి ఒక్కరిలో కనిపించకపోయినా, ఎక్కువగా కనిపించే కొన్ని సూచనలు ఉన్నాయని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతోంది.
మరణం దగ్గరపడుతున్నప్పుడు, శరీరం ఒక యంత్రంలా కాకుండా నిశ్చలంగా ఉండిపోతుంది. చివరి ఐదు నిమిషాల్లో శరీరం ఆక్సిజన్, రక్త ప్రసరణ నెమ్మదిగా తగ్గుతుంది. హృదయం గట్టిగా కొట్టుకోవడం మానేసి, ఒక ప్రత్యేకమై లయలో బీట్ చేస్తుంది. చాలా సార్లు ఒక నిమిషంలో 40 నుంచి 20 బీట్స్‌కి పడిపోతుంది, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది.
చివరి ఐదు నిమిషాలు సమయంలో శ్వాస కూడా వింతగా మారుతుంది. తడబడుతూ, ఒక్కోసారి లోతుగా, ఒక్కోసారి ఆగి ఆగి వస్తుంది. దీన్ని వైద్యులు ‘చీన్-స్టోక్స్ బ్రీదింగ్’ అంటారు. ఈ సమయంలో శరీరం చల్లగా అనిపిస్తుంది. రక్తం శరీరం అంతా చేరడం మానేస్తుంది కాబట్టి, చేతులు, కాళ్లు మొదలైన భాగాలు ముందు చల్లబడతాయి.
చర్మం రంగు కూడా మారుతుంది. ఒక వింతైన బూడిద రంగులోకి లేదా నీలం ఛాయలోకి వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేకపోవడంతో రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది.
ఇంకో ఆసక్తికరమైన సంకేతం కళ్లు. చివరి నిమిషాల్లో కళ్లు తెరిచి ఉండొచ్చు లేదా సగం మూసుకుపోవచ్చు. కొందరిలో కంటి రెప్పలు వణుకుతాయి, కానీ చూపు ఖాళీగా మారుతుంది. ఆక్సిజన్ తగ్గడం వల్ల, వ్యక్తి స్పృహ కోల్పోతాడు, బయటి ప్రపంచానికి స్పందించడం ఆగిపోతుంది. కొన్నిసార్లు, ఈ సమయంలో వింత శబ్దాలు వస్తాయి గురకలాంటిది లేదా గొంతులో ఏదో ఆడుతున్నట్టు. ఇది శ్వాసనాళంలో గాలి చిక్కుకోవడం వల్ల, ఒక చివరి ఊపిరి తీసుకునే ప్రయత్నంలా ఉంటుంది.
శరీరం కదలికలు కూడా ఆగిపోతాయి. చివరి ఐదు నిమిషాల్లో కండరాలు బలహీనపడి, ఒక్కోసారి చిన్న వణుకు లేదా జలదరింపు జరుగవచ్చు. ఇది నరాలు ఆగిపోతున్న సంకేతం. కొందరు ఈ సమయంలో ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి, తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోతారు. దీనినే "టెర్మినల్ బ్రీత్" అని పిలుస్తారు. శరీరం నుంచి మూత్రం లేదా మలం విడుదలవుతాయి, ఎందుకంటే కండరాల నియంత్రణ పూర్తిగా తప్పిపోతుంది కాబట్టి.
ఈ లక్షణాలు అనారోగ్యంతో చనిపోయే వాళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. కానీ వృద్ధాప్య కారణాలు కాకుండా ఇతరాత్ర మరణాలు లాంటి వాటిల్లో ఇవి జరిగే అవకాశం చాలా తక్కువ.. ఏదేమైనా, శరీరం ఈ సంకేతాలతో ఒక గొప్ప ప్రయాణం ముగిసినట్టు చెబుతుంది. ఈ చిన్న ఐదు నిమిషాలు జీవితం ఎంత విలువైనదో, ఎంత సున్నితమైనదో గుర్తుచేస్తాయి. అలాగే చాలామంది ఈ చివరి ఐదు నిమిషాల్లో తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలు కళ్లముందు మెదులుతుందని అంటారు.
.jpeg)
.jpeg)
Comments
Post a Comment