మానవ శరీరంలో మూడో కన్ను..!
మనిషికి రెండు కన్నులే ఉన్నాయి అనే విషయం మీద ఎవరికీ సందేహం ఉండదు. కాని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు, పురాతన విశ్వాసాలు చూస్తే… మన శరీరంలో మరో ‘కన్ను’ ఉంది. మనం చూస్తే కనిపించదు… కానీ మన జీవనశైలిని, ఆలోచనల్ని, శరీర వ్యవస్థల్ని అన్నింటిని నియంత్రించే శక్తి మాత్రం దీనిలో దాగి ఉంటుంది. ఈ శక్తివంతమైన భాగాన్నే పీనియల్ గ్రంథి అంటారు. ఈ పీనియల్ గ్రంథి పేరు వినగానే చాలామందికి ఇది బోరింగ్ మెడికల్ టాపిక్‌లా అనిపించవచ్చు. కానీ అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే, ఇది నిజంగా మన శరీరంలో దాగి ఉన్న ఒక మిస్టరీ చాంబర్ లాంటిది.
ఈ గ్రంథి మన మెదడులోని మద్యభాగంలో, రెండు బ్రెయిన్ హాల్ఫ్‌ల మధ్యన కనిపిస్తుంది. దాని ఆకారం ఓ ఒక బియ్యపు గింజంత సైజులో ఉంటుంది. ఇది కేవలం 5 నుండి 8 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. కానీ, శరీరం మీద దీని ప్రభావం… ఒక గొప్ప మాస్టర్ కంట్రోల్ సెంటర్‌లా ఉంటుంది.
ఈ గ్రంథి చేసే ముఖ్యమైన పని మెలటొనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడమే. ఇది నిద్రపట్టడానికి అవసరమైన హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తోంది. మన శరీరం లోపల డే అండ్ నైట్ సైకిల్‌ను నియంత్రించేది ఇదే. అంటే వెలుతురు ఉన్నప్పుడు మన శరీరం అలర్ట్‌గా, చురుగ్గా ఉంటుంది. చీకటి పడిన తర్వాత నిద్ర పట్టేలా మెలటొనిన్‌ను రిలీజ్ చేస్తుంది. దీన్ని ‘బయోలాజికల్ క్లాక్’ అంటారు. ఇది పని చేయకపోతే… నిద్రలేని రాత్రులు, అలసటతో కూడిన రోజులు మొదలవుతాయి. ఇలా జరిగితే శరీరంలోని వివిధ భాగాలు వాటి పనితీరును ప్రభావం చూపుతుంది.
అయితే, ఇప్పుడు చెప్పిన విషయం అంతా సైంటిఫిక్‌యే. కానీ, ఈ పీనియల్ గ్రంథిని గురించి చెప్పుకోవాల్సి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి. కొన్ని నమ్మకాల ప్రకారం, ఇది మానవ శరీరంలోని ‘మూడవ కన్ను’ గా చెప్పబడుతుంది. హిందూ తత్వశాస్త్రంలో దీనిని ఆజ్ఞా చక్రం అని అంటారు. అదే మన తల భాగంలో కళ్ల మధ్యన ఉన్న జ్ఞానం కేంద్రమని భావించేవారు. దానినే మూడవ కన్ను అని పిలిచేవారు. ఆధ్యాత్మికంగా ఇది మనలో ‘ఇన్నర్ విజన్’, ‘ఇంట్యూషన్’, ‘సూపర్ అవేర్‌నెస్‌కు కేంద్రంగా ఉంటుంది. అనేక తత్వశాస్త్రాలు, యోగ శాస్త్రాల్లో ఈ గ్రంథికి ప్రత్యేక స్థానం ఉంది.
అలాగే ఈ పీనియల్ గ్రంథిలో కాల్షియం డిపాజిట్లు అనే పదార్థం ఏర్పడుతుంది. ఇది వయస్సుతో పాటు పెరిగిపోతుంది. కానీ, ఇది ఎక్కువైతే శరీర రిథం మీద ప్రభావం చూపవచ్చు. ఇది అనుభవాలను, కలల స్పష్టతను, లోతైన ఆలోచనలను ప్రభావితం చేస్తుందన్న భావనలు కూడా ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే… చాలా జంతువుల్లో కూడా ఈ గ్రంథి అనేది ఉంటుంది. కానీ, కొన్ని జంతువుల్లో ఇది ‘లైట్ సెన్సర్’గా పనిచేస్తుంది. అంటే శరీరం వెలుతురును ప్రత్యక్షంగా గ్రహించే సామర్థ్యం ఉంటుంది. ఇది నిజంగా ‘కన్ను’ లా పని చేస్తుంది. కొన్ని reptiles అయితే, మూడవ కన్నుగా వెలుతురు మార్పులను నేరుగా గ్రహించి శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాయి.
మనుషులు ప్రత్యక్షంగా వెలుతురు చూడకపోయినా.. ఆ సమాచారాన్ని ఊపిరితిత్తులు, కళ్ళ ద్వారా అందుకొని మెదడులో పని చేస్తుంది. ఇంకొన్ని విశ్లేషణల్లో అయితే, ఈ గ్రంథి Dimethy ltryptamine అనే కెమికల్‌ను ఉత్పత్తి చేస్తుందని చెబుతారు. ఇది మనల్ని కలల లోకానికి, ఆధ్యాత్మిక అనుభూతికి దగ్గర చేస్తుందన్నది కొందరి నమ్మకం. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, కొంతమంది మాత్రం దీనిని ‘సోల్ గేట్‌వే’ అని పిలుస్తున్నారు.
అంటే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నీ కంట్రోల్ చేసే మాస్టర్ గ్రంథి మన శరీరంలో ఉంది అని. ఈ పీనియల్ గ్రంథిని ప్రభావితం చేసే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఎక్కువ మోబైల్ స్క్రీన్ ఎక్స్‌పోజర్, అప్రాపర్ డైట్, ఫ్లోరైడ్ కలిగిన నీరు వంటివి దీని పనితీరును దెబ్బతీయవచ్చు. కానీ, కొన్ని యోగాలు, ధ్యానం, ప్రాణాయామం వంటివి దీన్ని ‘యాక్టివేట్’ చేయగలవని భావించేవారు. అంతేకాకుండా, కొన్ని పురాతన పిరమిడ్ల నిర్మాణాల్లోనూ పీనియల్ ఆకారాన్ని పోలిన సింబల్స్ కనిపించడం విశేషం.
ఇన్ని మిస్టీరియస్ విషయాలు దాచుకున్న ఈ పీనియల్ గ్రంథి.. మన శరీరంలోని రహస్యంగా దాగి ఉన్న ‘మూడవ కన్ను’ అనే టాగ్‌ను ఎప్పటికీ వదలదు. ఇది మన శరీరంలోని ఒక శక్తివంతమైన కోణం.దీనిని మానవ శరీరంలోని ఆధ్యాత్మికత, సైన్స్, జీవనశైలి అన్నింటినీ కలిపే గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు.
.jpg)
.jpg)
Comments
Post a Comment