కోట్ల ఆస్తిని, కన్నవారిని కాదనుకొని ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..?
డబ్బులు ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కొందరు కోటీశ్వరులను చూసి.. తాము కూడా కోటీశ్వరుల ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేదని, లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసే వాళ్లం అని అనుకుంటారు. ఇలా చాలా మంది కోరుకునే ఈ అద్భుతమైన జీవితం ఓ యువతికి దక్కింది. కానీ, ఆమె వాటన్నింటిని కాదని, ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కన్నవారికి బాధను మిగిల్చింది. పుట్టుకతోనే ఆమె కోటీశ్వరురాలు. చిటికెస్తే.. కోరుకున్నవన్నీ కళ్ల ముందుకొస్తాయి. ఆమెకు ఘనంగా వివాహం చేయాలని పేరెంట్స్ ఎన్నో కలలు కన్నారు. కానీ, ఆమె మాత్రం ఆ కలల్ని కల్లలు చేసింది. వైవాహిక జీవితం, డబ్బు ఏమీ తనకు వద్దని..ఇవన్నీ శాశ్వతం కావని సన్యాసం పుచ్చుకుంటాను అంటూ తెగేసి చెప్పింది. మరి, ఆమె ఎవరు? ఆమె కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
కర్ణాటక యాదిర్ నగరంలోని జైన్ బ్లాక్ కి చెందిన కోటీశ్వరుడు నరేంద్ర గాంధీ. వీళ్లు వారసత్వంగా వ్యాపారంను చేస్తున్నారు. మూడు, నాలుగు తరాలుగా వ్యాపారంలో ఉన్న నరేంద్ర గాంధీ కోట్లలో ఆస్తులను కూడపెట్టాడు. ఆయనకు భార్య సంగీత గాంధీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె నిఖితా గాంధీని చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమె కోరింది ఏదీ కాదనకుండా, ఆమె అడిగిన ప్రతీది ఆమెకు తీసుకొచ్చి ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఎప్పటి నుంచో ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించినా.. దానికి ఆమె అంగీకరించలేదు.
డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగిన ఆ అమ్మాయికి.. ఆ డబ్బు మీద, లగ్జరీ లైఫ్ మీద విరక్తి కలిగింది. ఆమె సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంది. దాదాపు ఏడేళ్లుగా.. సన్యాసం పుచ్చుకోవాలని ఆమె ప్రయత్నించగా.. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రీసెంట్ గా ఆమె జైన మతం ప్రకారం సన్యాసం తీసుకుంది.
జైనమతం ప్రకారం, సన్యాసి అయిన తర్వాత, ప్రతి ఒక్కరూ అత్యంత కష్టతరమైన మార్గంలో నడవాల్సి ఉంటుంది. సన్యాసం తీసుకున్న వారు బతికున్నంత వరకు కనీసం చెప్పులు కూడా ధరించకూడదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాలి. వారు కేవలం తెల్లని దుస్తులు మాత్రమే ధరించాలి. ప్రతిరోజూ కాలినడకనే ప్రయాణం చేయాలి. తల మీద జుట్టు కూడా ఉండకూడదు. జుట్టు మొత్తం తొలగించి గుండు చేస్తారు. జీవితాంతం గుండు తోనే వారు జీవించాలి.
ఇటువంటి అనేక కష్టతరమైన నియమాలు ఉన్నా కూడా.. నికితా గాంధీ ఆ మార్గాన్నే ఎంచుకోవడం గమనార్హం. కోటీశ్వరుడి కూతురుగా ఇంతకాలం విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె, ఆ జీవితాన్ని వదులుకుంది. ఈ క్రమంలోనే.. ఆమె తల్లిదండ్రులు నిఖితా సన్యాసిగా మారుతుందని, చివరిగా ఆమె గుర్తుగా ఆ నగరంలో ఒక గొప్ప ఊరేగింపును నిర్వహించారు. వివిధ సంగీత వాయిద్యాలతో ఊరేగింపు జరిగింది. మొత్తం జైన సమాజం అందులో పాల్గొంది. ఆమె ఇకపై ఏ వస్తువులను ఉపయోగించదు కాబట్టి, ఆమె వేలాది మందికి కొత్త దుస్తులతో సహా వివిధ వస్తువులు, డబ్బులను దానంగా ఇచ్చేసింది.
నికితా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలుపండి.
.jpeg)
Comments
Post a Comment