ఒక ఐడియా ఇస్తే.. రూ. 25 కోట్లు

ఒక చిన్న ఐడియా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. ఇప్పుడు అలాంటి ఒక చిన్న ఐడియా ఇస్తే చాలు.. అక్షరాల రూ.25 కోట్ల బహుమతిని మీరు సొంతం చేసుకోవచ్చు. ఒక ఐడియాకి రూ. 25 కోట్లగా అని ఆశ్చర్యపోతున్నారా..?. ఇది నమ్మసక్యంగా లేదని అనుకుంటున్నారా. కానీ ఇది నిజం. అసలు ఒక్క  ఐడియాకి అన్నీ కోట్లేంటి..? ఇంతకీ దేనికి సంబంధించిన విషయంపై ఐడియా ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 


చంద్రుడిపై శాశ్వతంగా మనిషి నివసించగలడా? ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే అంటే.. ఎంతమాత్రం కాదనే చెప్పాలి. చంద్రుడిపై మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో, ఎన్నో దేశాలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నాయి. కానీ, ఈ కలను సాకారం చేయడానికి ముందు ఎదురవుతున్న సమస్యలు చిన్నవేమీ కావు. వాటిలో మోస్ట్ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సమస్య ఏంటో తెలుసా? చంద్రుడిపై మనిషి వదిలిపోయిన వ్యర్థాలు! అవును… నాసా ఆపోలో మిషన్ల సమయంలో చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడే వదిలేసి వచ్చిన వ్యర్థాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. 



ఇప్పుడు అదే  నాసాకు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఈ వ్యర్థాలను తొలగించడానికి సరైన పరిష్కారం చెప్పిన వారికి రూ.25 కోట్ల బహుమతిని ఇస్తామాంటూ ప్రకటన చేసింది. అయితే, నాసా తన తొలి చంద్రయాత్రలను 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఆపోలో మిషన్ల ద్వారా నిర్వహించింది. ఆరుసార్లు జరిగిన ఈ విజయవంతమైన ల్యాండింగ్స్‌లో వ్యోమగాములు చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించి, అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకు వచ్చారు. ఈ  మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాములు 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. ఈ వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి దాదాపు రూ.25 కోట్లు అందజేస్తామని స్పష్టం చేసింది.

  

 చంద్రుడిపైనే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్‌ ద్వారా మళ్లీ వినియోగిస్తుంటారు. అక్కడ ఉండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా, తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా అనేక సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలు తెలపాలంటూ ఈ ప్రకటనను​ ఇచ్చింది.  


అసలు ఇది నిజంగా సాధ్యమేనా..? చంద్రుడిపై ఉన్న వ్యర్థాలను భూమిపైకి తీసుకురాగలమా..? లేదా అనే విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. 


Comments

Popular posts from this blog