తెలంగాణకు భూకంపం వార్తల్లో నిజమెంత..?



గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. మయన్మార్, థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా, జపాన్‌ను వరుసగా భూకంపాలు వణికించాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ ముప్పు సంభవిస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేథ్యంలోనే కొన్ని పరిశోధన సంస్థలు భూకంపం గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.  


పిక్ ఎర్త్‌క్విక్ అనే పేరు కలిగిన ఓ సంస్థ వెల్లడించిన భూకంప సూచనల నేపథ్యంలో ఈ వార్తలు వైరల్ అవుతూ జనాల్లో టెన్షన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం కేంద్రంగా పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని.. అది హైదరాబాద్, అమరావతి వరకు ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వటంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి.


ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు  పెద్దగా లేదు. కానీ, కొన్ని సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 2013లో కూడా చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా... ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. కానీ,  ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. అలాగే శ్రీశైలం డ్యాం పరిసరాల్లో కొన్ని సందర్భాల్లో భూమి కంపించినట్లు రికార్డు అయ్యాయి. 


అయితే,  ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ చెప్పిన  భూకంపం సూచనలను ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించలేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదు. కొన్ని చిన్నచిన్న ప్రకంపనలు కనిపించినా.. అవి పెద్ద భూకంపానికి సంకేతాలు కావు. కానీ, ఈ సంస్థ వెల్లడించిన భూకంప సూచనల నేపథ్యంలో ఈ వార్తలు వైరల్ అవుతూ జనాల్లో టెన్షన్ క్రియేట్ చేసింది.  


నిజానికి ఈ భూకంప వార్తలపై దేశంలోనే ప్రముఖ శాస్త్రీయ సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్‌ శశిధర్  క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన ఈ భూకంప అంశం పూర్తిగా నిజం కాదని, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు జోన్-2, జోన్-3లో ఉంటాయని.. రామగుండం, గోదావరి పరివాహక ప్రాంతం జోన్-3 గా ఉందని..  భూకంపం సంభవించే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదని స్పష్టం చేశారు. అసలు రామగుండం దగ్గర భూకంప సంకేతాలు ఏమీలేవని తేల్చిచెప్పారు. 


తెలంగాణ ప్రాంతం ఎర్త్ ప్లేట్ బౌండరీకి దూరంగా ఉండడం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని.. భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. దీనికి సంబంధించి ఏదైనా  సమాచారం ఉంటే,  ప్రభుత్వం లేదా ఎన్‌జీఆర్‌ఐ లేదా జాతీయ సంస్థలు అప్రమత్తం చేస్తాయనన్నారు.


Comments

Popular posts from this blog