బిడ్డను చంపి.. తల్లిపై గ్యాంగ్ రేప్..!
నేడు చట్టాలు ఎంత కఠినతరం చేసినా కానీ, దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల హర్యానాలోని జీంద్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన మనసును కలచివేస్తోంది. దేశంలో రోజురోజుకీ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, రోజూ సగటున 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీంద్‌లోని ఓ మురికివాడలో జరిగిన ఈ ఘటన మరోసారి సమాజంలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. ఓ మహిళ, ఆమె ఐదేళ్ల చిన్నారిపై నలుగురు దుండగులు చేసిన దాడి గుండెల్ని పిండేసేలా ఉంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
హర్యానా రాష్ట్రంలోని జీంద్ మురికివాడలో ఓ మహిళ భర్త నలుగురు పిల్లలతో నివసిస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం గుడిసెలో భర్త లేని సమయం చూసి స్నేహితులతో కలిసి అమిత్ వచ్చాడు. ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నిద్రపోతున్న బాధితురాలపై దాడి చేశారు. అనంతరం ఆమెతో పాటు ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్త కుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం బాధితురాలిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా ఆ చెత్తకుప్పలనే అలాగే ఉండిపోయింది. బుధవారం ఉదయం స్థానికులు బాధితురాలిని గమనించి, ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గురువారం స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలియజేసింది.ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో అమిత్ అనే వ్యక్తితోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారిపై కూడా అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నామని, పోస్ట్‌మార్టమ్ పరీక్షకు తరలించారు. చిన్నారిపైనా అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నామని, పోస్ట్ మార్టమ్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే నిర్ధరిస్తామని వెల్లడించారు.
అయితే, 15 రోజుల క్రితం బాధితురాలి భర్తకు పక్కనే స్థానికంగా అక్కడే ఉండే అమిత్ అనే వ్యక్తితో పాటు అతడి స్నేహితులతో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె భర్త తలకు తీవ్ర గాయం కావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అమిత్‌తో పాటుగా అతడి స్నేహితులు బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Post a Comment