సీమా హైదర్ పాకిస్థాన్‌కు వెళ్లాలా? భారత్‌లోనే ఉండొచ్చా? చట్టం ఏం చెబుతోంది?
మీకు సీమా హైదర్ గుర్తుందా? 2019లో PUBG ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ 32ఏళ్ల ఒక పాకిస్తాన్ మహిళ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడితో ప్రేమపడి, చట్టవిరుద్ధంగా ఇండియాలోకి వచ్చింది.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల సీమా హైదర్.. PUBG ఆడుతూ నోయిడాకు చెందిన సచిన్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాట్ చేసుకున్న తర్వాత ప్రేమలో పడ్డారు. 2023లో సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చి సచిన్‌ను పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ఆ తర్వాత కేసులు నమోదవడం, అవి ఇప్పుడు విచారణంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ప్రస్తుతం భారత్‌లో ప్రతి పాకిస్తానీ.. భారత్ నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ అయింది. మరి పాకిస్తాన్ నుంచి పాయిపోయి వచ్చిన సీమా ఇప్పుడు భారత్‌లో వదిలి వెళ్లాలా? లేక ఇక్కడే ఉండిపోవచ్చా? అని హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
దీనిపై సీమా లాయర్ స్పందించాడు. సీమా లాయర్ ఎ.పి. సింగ్.. కేంద్రం ఆదేశాలు పాకిస్థానీ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే వర్తిస్తాయని, సీమా ఇప్పుడు భారతీయురాలని వాదిస్తున్నారు. వివాహం తర్వాత స్త్రీ భర్త పౌరసత్వం ఆధారంగా ఉంటుందని చెబుతున్నాడు. పైగా సీమాకు ఒక బిడ్డ కూడా ఉంది.. అంతర్జాతీయ చట్టాలు, గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం.. తల్లి పిల్లలకు సంరక్షకురాలని, భారత్‌లో జన్మించిన కుమార్తెను పాకిస్థాన్‌కు పంపడం సరికాదని వాదించాడు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఒక పిటిషన్ దాఖలు చేశామని, అది పెండింగ్‌లో ఉందట.
అయితే కొంతమంది వాదన ప్రకారం.. సీమా హిందూ మతంలోకి మారినందున, పాకిస్థాన్‌కు తిరిగి వెళితే ఆమె శరియా చట్టం ప్రకారం శిక్షను ఎదుర్కోవచ్చట.
మొత్తానికి సీమా భారత్‌లో ఉండే అవకాశం కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కోర్టుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఆమె వివాహం చట్టబద్ధంగా గుర్తించబడితే సీమా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాల్సిందే.
సీమా హైదర్ కేసు ఒక్కటే కాదు; భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు దాటి ప్రేమ కోసం వచ్చిన ఇతర కేసులు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన ఇక్రా అనే మహిళ 2023లో ఆన్‌లైన్ లూడో గేమ్ ద్వారా బెంగళూరుకు చెందిన ములాయం సింగ్ యాదవ్‌తో పరిచయమైంది. వీరు నేపాల్‌లోని కాఠ్మాండులోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక్రా తన పేరును రవా యాదవ్‌గా మార్చుకుని, బెంగళూరులో నివసిస్తోంది.
2023లో రాజస్థాన్‌కు చెందిన అంజు అనే 34 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాకు చెందిన నస్రుల్లాతో పరిచయమైంది. దీంతో వాఘా-అటారీ సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్థాన్‌కు వెళ్లి వివాహం చేసుకుని, తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. మరి ఇప్పుడు అంజు ఇండియాకు తిరిగి వస్తుందా లేదా అనేది పాకిస్తాన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇలా భారత్, పాకిస్థాన్ సరిహద్దు దాటిన ప్రేమకథలు చాలానే ఉన్నాయి. సీమా హైదర్, ఇక్రా కేసులతోపాటు ఇతర కేసుల్లో వారు భారత్ వదిలి వెళ్లాలా? లేదా అనేది చట్టపరమైన ప్రక్రియలు, రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బహుశా ప్రస్తుత పరిస్థితుల్లో వీరు భారత్‌లోనే ఉండే అవకాశం ఉంది.

Comments
Post a Comment