ఆసియాలో అత్యతం భయంకరమైన కోట..

ఇవ్వాల మనం చెప్పుకునే విషయం కేవలం ఓ కోట గురించి కాదు… అది భారత చరిత్రలోనే అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచిన కోట గురించి. ఉదయం పూట పర్యాటకులతో కిక్కిరిపోయే ఈ ప్రదేశం.. రాత్రి అయితే

చాలు అక్కడ ఒక్క  అడుగు కూడా వేయలేనంత భయంకరంగా మారుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు. అదే భంగర్ కోట. 


ఈ  కోట ఒకప్పుడు రాజరిక చరిత్రకు నిదర్శనంగా నిలిచిన గొప్ప కోట. కానీ ఇప్పుడు? ఇది భారతదేశంలోనే.. అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచింది. కొందరు ఇది ఏమాత్రం నిజం కాదని, ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆ కోటలోకి వెళ్లారు. ఇక అంతే.. వాళ్లు మళ్లీ తిరిగి బయటకు రాలేదు.  వాళ్లు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా చంపేశారా అంటే అక్కడ డెడ్‌బాడీలు లేవ్, ఎక్కడికైనా వెళ్లారా అంటే ఆనవాళ్లు లేవు. వాళ్లు ఏమయ్యారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అందుకే  భారత ప్రభుత్వం ఈ కోట చుట్టుపక్కల భారీ హెచ్చరికలు ఉన్న బోర్డులను పెట్టి, కట్టుదిట్టమైన కాపాలాను ఏర్పాటు చేసింది. దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.


అసలు ఈ భంగర్ కోట లోపల ఏం జరుగుతుంది..? అక్కడి గోడల వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి..?

నిజంగానే ఆ కోట లోపల ప్రేతాత్మలు తిరుగుతున్నాయా..? లేదా ఇది కేవలం  స్థానికుల ఊహా ప్రపంచమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ కోట చుట్టూ తిరుగుతున్నాయి. అసలు ఈ కోట చరిత్ర ఏంటి? బంగారు కోట దెయ్యాల కోటగా ఎలా మారింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. 


ఈ భయంకరమైన కోట రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో ఉంది. అంబర్‌ను పాలించిన కచ్వాహా పాలకుడు   భగ్‌వంత్ దాస్ అనే రాజవంశస్థుడు, తన కుమారుడు మాధో సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో కోటను 

నిర్మించారు. అప్పట్లో ఇక్కడ సుమారు 10 వేల మంది జనాభా ఉండేవారు. అయితే, ఈ ప్రాంతానికి రెండు భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కోటను ఏర్పాటు చేయక ముందు ఆ ప్రాంతంలో ఒక సాధువు ఉండేవాడు. 

అతడి నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా , దాని నీడ తన ఇంటి మీద పడితే అది కూలిపోతుందని ఆ సాధువు ముందే హెచ్చరించాడు. కానీ, ఆ సాధువు మాటలు లెక్క చేయకుండా.. కోట గోడలు నిర్మిస్తారు. అలా నిర్మించిన కోట గోడ నీడ ఆ సాధువు ఇంటిపై పడటంతో ఆ కోట నిర్మించిన ప్రాంతమంతా కుప్పకూలిపోయింది. 


మరొక కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఓ మాంత్రికుడు ఉండేవాడు. అదే సమయంలో భంగర్ రాజ వంశానికి చెందిన ఓ రాజ కుమారి అందంగా ఉండటంతో ఆమెను ఇష్టపడ్డు. దీంతో ఆ రాకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం ప్రయోగించిన రసాయనం ఆమెకు ఇవ్వగా.. దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనం అయ్యిందని చెబుతారు. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతమంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెబుతారు. ఈ రెండూ ఆ భంగర్ కోట సమీప ప్రాంతాల్లో చెప్పే కథలు. ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా పాపులర్.


అయితే, ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పూర్తిగా శిథిలమైన ఈ కోట ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే..

దేవాలయాలు, రాజభవనాలు మొదలైనవి కనిపిస్తాయి. అలాగే ఈ కోటలోకి ప్రవేశించడానికి మరో నాలుగు ముఖ ద్వారాలు కూడా ఉన్నాయి. లాహోరీ గేట్, అజ్మీరు గేట్, ఫుల్బారి గేట్, ఢిల్లీ గేట్‌లని వాటికి పేర్లున్నాయి. ప్రధాన ద్వారం ప్రవేశం వద్దే హనుమాన్ ఆలయం, గోపీనాథ్ ఆలయం, సోమేశ్వరాలయం, కేశవ రాయ్ ఆలయం, మంగళ దేవి, గణేష్ ఆలయం వంటివి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం మనందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 


నిజ జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు. కానీ, దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా ఔనని చెప్పక తప్పదు. ఇప్పుడు చెప్పింది కేవలం పుకారని, కట్టుకథ అని కొట్టి పారేయలేం. ఎందుకంటే.. ఇక్కడ రాత్రి అయితే భయంకరమైన శబ్దాలు, వింతైన నవ్వులు, ఏడుపులు వినిపిస్తాయి. ఇది ఎంతమాత్రం నమ్మని కొందరు టూరిస్టులు అక్కడికి వెళ్లి కనిపించకుడా పోయారు. అక్కడి ప్రభుత్వం సైతం ఈ కోట చుట్టూ కట్టుదిట్టమైన కాపలాను విధించింది. ఇప్పుడు ఇది ఒక విస్టరీ ప్లేస్‌గా మాత్రమే కాకుండా.. హాంటెడ్ ప్లేస్‌గా పేరుగాంచింది. ఇది మీరు  నమ్మినా నమ్మకపోయినా, కోట యొక్క వాతావరణం మరోప్రపంచపు అనుభూతిని కలిగిస్తుంది.


మరి ఈ కోట నిజంగా హాంటెడ్ ప్లేసేనా..? లేక మన భయాలకే రూపమా..? ఈ కోట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 


Comments

Popular posts from this blog