అందం వెనుక ఆపద.. ఎర్రసముద్రంలోని మినీ డెత్ జోన్ మిస్టరీ
భూమి మీద కొన్ని ప్రాంతాలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ, కొన్ని అందమైన ప్రదేశాలు అంతరంగంగా భయంకరమైన మిస్టరీలను దాచుకుని ఉంటాయి. వాటిలో ఒకటే ఈ డెత్ పూల్ సరస్సు. ఇది సముద్రంలో ఉంటుంది. సముద్రంలో సరస్సు ఏంటని అనుకుంటున్నారా. అవును ఈ సముద్రంలో ప్రాణాలు తీసే ఒక సరస్సు ఉంది. ఎప్పుడూ.. అలలతో ఉప్పగా, జీవంతో నిండుగా ఉండే అదే సముద్రంలో, కొద్దిగా లోతులోకి వెళ్తే… అకస్మాత్తుగా గుండ్రంగా ఉన్న చిన్న ప్రాంతం కనిపిస్తుంది. అది చూడడానికి బంగారు రంగు ఆకృతి, మధ్యలో పొంగుతున్న నీరుతో ఉంటుంది. దాన్ని చూస్తే మనసు ఆనందంతో ఊగిపోతుంది. కానీ, అదే అందమైన నీటిలో మీరు ఒక్క అడుగు వేశారు అంటే.. అక్కడితో మీ ప్రయాణం ముగిసిపోతుంది.
ఇది వినడానికి హాలీవుడ్ స్టోరీలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. దీనిని శాస్త్రవేత్తలు ‘Hot Tub of Despair’ అని పిలుస్తారు. ఇది మెక్సికో సమీపంలోని ఎర్రసముద్రం అడుగున ఉంటుంది. ఇది కొలనులా కనిపించే.. ఒక మినీ ‘డెత్ జోన్’. ఈ కొలనులో ఉండే ఉప్పు స్థాయి సాధారణ సముద్రపు నీటితో పోలిస్తే, సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది శరీరాన్ని తేలనివ్వదు. ఆ ఉప్పు కంటెంట్‌తో పాటు ఇందులో అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ సల్పైడ్, మీథేన్ వంటి రసాయనాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఈ రెండు రసాయనాలు శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేసి, ప్రాణాన్ని తీస్తాయి.
అందుకే ఈ ప్రాంతాన్ని ‘డెత్ పూల్’ గా పిలుస్తున్నారు. ఇందులోకి ఏదైనా జీవి దిగితే చాలు.. అది ఒక్క క్షణంలోనే చనిపోతుంది. చేపలు లేదా ఇతర జీవులు పొరపాటున ఈ కొలను దగ్గరికి చేరినప్పుడు.. అవి ఒక్కసారిగా మూర్చపోయి చనిపోతున్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. ఇది ప్రకృతిలో ఏర్పడిన ఓ మిని మిస్టరీ. దీనిలోకి ఏ జీవి వెళ్లినా.. చనిపోకుండా బయటకు రాదు. తొలిసారిగా శాస్త్రవేత్తలు రిమోట్ సబ్‌మరైన్ల సహాయంతో దీన్ని గుర్తించారు. ప్రస్తుతం దీని గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మొదట ఇది ఒక ప్రకృతి అద్భుతంలా కనిపించింది. పొంగుతున్న వేడి నీరు, చుట్టూ బంగారంలా మెరిసే పాక్షిక నిర్మాణం చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
కానీ, లోతులోకి వెళ్లే కొద్దీ, ఇది జీవానికి ప్రమాదకరం అన్న వాస్తవం తెలిసింది. అసలు ఈ కొలను ఎలా ఏర్పడింది..? ఈ ప్రదేశంలోని నీరు మాత్రమే ఎందుకు ఇంత ఉప్పు ఉంది? అనే విషయాల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇది భూమిపై కనిపించే అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఒకేచోట అందం, ఆపద, ఆధ్యాత్మిక గంభీరత అన్నీ కలిసి ఉండే ఈ విస్మయకరమైన కొలనును చూస్తే, మనం ప్రకృతి వైవిధ్యాన్ని మరో కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
.jpg)

Comments
Post a Comment