ముచ్చటగా మూడోసారి పెళ్లిచేసుకున్న అఘోరి!
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో.. అఘోరీ నాగసాధువు అలియాస్ శ్రీనివాస్ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. తాను లోక కళ్యాణం, సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో తిరుగుతూ.. హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా మరో సంచలన పని చేశాడు.
చెప్పినట్లుగానే అఘోరీ శ్రీనివాస్ మూడవ సారి వర్షిణి మెడలో తాళి కట్టాడు. సోమవారం నాడు మధ్య ప్రదేశ్ లోని ఒక ఆశ్రమంలో వీరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారాయి. అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరీ వర్షిణి మెడలో తాళి కట్టాడు. అనంతరం అఘోరీ, శ్రీ వర్షిణి పరస్పరం దండలు మార్చుకుని, తలంబ్రాలు పోసుకుని.. ఏడు అడుగులు వేశారు. అఘోరి గతంలో వర్షిణికి రెండు సార్లు తాళి కట్టినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకముందు దేవాలయంలో ఒక సారి.. ఇలా రెండు సార్లు తన మెడలో తాళి కట్టినట్టుగా స్వయంగా వర్షిణీనే చెప్పింది. అదే సమయంలో అఘోరీ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ.. మరోసారి కూడా వివాహం చేసుకుంటా.. ఈ సారి అంగరంగ వైభవంగా చేసుకుంటా అని చెప్పాడు. అన్నట్లుగానే ఇప్పుడు అఘోరీ శ్రీ వర్షిణి మెడలో తాళి కట్టాడు. ఇద్దరం కలిసి మరోసారి పార్వతి పరమేస్వర్లకు జన్మనిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీ వర్షిణీని తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామానికి వచ్చే పనిలో ఉన్నాడు అఘోరి.
మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు కావాలనే తమ కుమార్తెను వశీకరణంతో లొంగ తీసుకుని ఈ రకంగా వ్యవహరిస్తున్నాడని, ఆమెను మోసం చేసి వివాహం చేసుకున్నాడంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మరో యువతి తెరమీదకు వచ్చింది. కరీంనగర్ కి చెందిన ఓ యువతి అఘోరీ భార్య అంటూ మీడియా ముందుకు వచ్చింది. భక్తితో అఘోరీని కలిశానని, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి వివాహానికి దారితీసిందని ఆ యువతి తెలిపింది. తామిద్దరూ కలిసి ఒక ఆశ్రమం స్థాపించి సేవ చేయాలని కలలు కన్నామని.. కానీ అఘోరీ తన మాటపై నిలబడకపోవడంతో అది సాధ్యపడలేదని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై అఘోరీ స్పందించింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదని తెలిపింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. అయితే బాధిత యువతి మాత్రం లేడీ అఘోరీ.. గతేడాది జనవరి 1న తనను పెళ్లాడాడని చెబుతోంది. తన మెడలో వెండి తాళి కట్టాడని.. అయితే రిసెంట్‌గా ఇంటికి వచ్చి తన తాళి తనకు ఇచ్చేయమని గొడవ చేసి.. ఆ వెండి తాళి తీసుకెళ్లిపోయాడని చెబుతోంది. ఈ క్రమంలోనే వర్షిణి గురించి అడిగితే.. వర్షిణి తనకు కూతురు లాంటిదని.. తాను ఆమెకు గురువునని అఘోరీ చెప్పాడంది. అంతేకాడు కొన్ని ఆడియో రికార్డ్స్‌కూడా బయటకు వచ్చాయి.
ఆ ఆడియోలో బాధిత యువతిని చాలా మిస్ అవుతున్నా.. రాగానే తాళి కడతా.. గుండెలో చాలా పెయిన్ ఉంది.. మనం జీవితాంతం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలని కోరిక.. అందరూ వేరు.. నువ్వు వేరు. అని చెప్పే ఆడియో బాగా వైరల్ అవుతోంది. ఇవేకాదు.. గతంలో అఘోరీ చేసిన మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 25న నమోదైన ఎఫ్ఐఆర్ వైరల్‌గా మారింది.
ఫిర్యాదులో అఘోరి ఒక మహిళా ప్రొడ్యూసర్‌కు పూజ చేస్తానని దాదాపు 10లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు పూజలు చేసిన తర్వాత ఇంకా రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే నిన్ను, కుటుంబ సభ్యులను మంత్ర శక్తులతో అంతమొందిస్తానని.. బెదిరింపులకు పాల్పడ్డట్లు కంప్లైంట్‌లో పేర్కొంది. మరోవైపు సినీ ప్రముఖులకు, హై ప్రోఫైల్ వ్యక్తుల కోసం స్శశానంలో ప్రత్యేక పూజలు కూడా చేసేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అఘోరికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
.jpeg)

Comments
Post a Comment