గాలిలో విమానం ... పైలట్ కు గుండెపోటు
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగినఒక షాకింగ్ ఘటన అందరినీ కలవరపెడుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ అర్మాన్, శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన కొద్ది సేపటికే గుండెపోటుతో కన్నుమూశాడు! అవును, ఈ వార్త వినగానే మనసు బరువెక్కిపోతుంది కదా? ఏం జరిగింది, ఎలా జరిగిందో కాస్త వివరంగా చూద్దాం!
ఇది ఏప్రిల్ 9, 2025న జరిగిన వాస్తవ సంఘటన. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ అర్మాన్ 36 సంవత్సరాల లోపే . శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని (IX-747) నడిపిన తర్వాత ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటు తో మరణించాడు. అయితే విమానం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే అర్మాన్ కాక్‌పిట్‌లో వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత డిస్‌పాచ్ ఆఫీస్‌లో ఉండగా అతను కుప్పకూలిపోయాడు. వెంటనే విమానాశ్రయ వైద్య సిబ్బంది అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చేరే సమయానికి అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ఈ ఘటన గురించి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తూ, అర్మాన్ కుటుంబానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు.
ఈ సంఘటన విమాన పైలట్ల ఆరోగ్యంపై ఒత్తిడి, వారి విధుల సమయంలో ఎదుర్కొనే శారీరక-మానసిక ఒడిదుడుకుల గురించి మరోసారి చర్చను రేకెత్తించింది. అర్మాన్ ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పటికీ, ఈ ఆకస్మిక గుండెపోటు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా బయటకు రాకపోయినా, ప్రాథమికంగా ఇది హృదయ సంబంధిత సమస్యగానే భావిస్తున్నారు.
ఇది ఇటీవలి కాలంలో భారతదేశంలో పైలట్లకు సంబంధించిన రెండో ఆకస్మిక మరణ ఘటన—గతంలో 2023లో ఇండిగో పైలట్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే మరణించాడు.
అయితే పైలట్‌లు ఎంత సేపు విమానాలు నడపాలి, వారి డ్యూటీ టైమింగ్స్‌కు సంబంధించి భారతదేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్దేశించిన "ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్" (FDTL) నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు పైలట్‌ల అలసట (fatigue) తగ్గించి, విమాన భద్రతను పెంచడానికి రూపొందించబడ్డాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి:
పాత నిబంధనల ప్రకారం ఒక రోజులో పైలట్ గరిష్ఠంగా 13 గంటల వరకు డ్యూటీలో ఉండవచ్చు , ఒకే రోజులో గరిష్ఠంగా 10 గంటలు విమానం నడపవచ్చు.
రాత్రి విమానాల్లో గరిష్ఠంగా 6 ల్యాండింగ్‌లు చేయవచ్చు.ఇక వారానికి 36 గంటల విశ్రాంతి తప్పనిసరి. ఇక
DGCA జనవరి 2024లో FDTL నిబంధనలను సవరించి, పైలట్‌లకు మరింత విశ్రాంతి కల్పించేందుకు కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ మార్పులు మొదట జూన్ 1, 2024 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, ఎయిర్‌లైన్స్ వ్యతిరేకత, ఆపరేషనల్ సవాళ్ల కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా, ఢిల్లీ హైకోర్టులో DGCA సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఈ కొత్త నిబంధనలు సూచించడం జరిగినది .
వీక్లీ రెస్ట్ పెంపు:
పాత నియమం ప్రకారం 36 గంటలు ఉన్న రెస్ట్ ని కొత్త నియమం ప్రకారం 48 గంటలు కి పెంచారు . రాత్రి అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి డ్యూటీగా పరిగణించబడేది.కానీ ఇపుడు మారిన నిబంధన ల ప్రకారం రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు పెంచడం జరిగినది . ఈ సమయాన్ని "విండో ఆఫ్ సర్కాడియన్ లో" (WOCL) అంటారు, ఇది శరీర గడియారం అలర్ట్‌నెస్ తక్కువగా ఉండే సమయం.ఇక రాత్రి విమానాల్లో 10 గంటల నుంచి 8 గంటలకు తగ్గించారు.గరిష్ఠ డ్యూటీ పీరియడ్: 13 గంటల నుంచి 10 గంటలకు తగ్గింది.
రాత్రి గరిష్ఠంగా 6 ల్యాండింగ్‌ల నుంచి 2 ల్యాండింగ్‌లకు పరిమితం చేశారు.రాత్రి సమయంలో అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి, భద్రత పెంచడానికి ఈ మార్పులు చేశారు .
క్వార్టర్లీ ఫాటీగ్ రిపోర్ట్స్:
అయితే ఎయిర్‌లైన్స్ ప్రతి త్రైమాసికంలో పైలట్‌ల అలసట గురించి నివేదికలు సమర్పించాలి.
అసలు కారణాలు : 2023లో ఇండిగో పైలట్ నాగ్‌పూర్ విమానాశ్రయంలో గుండెపోటుతో మరణించిన ఘటన తర్వాత, పైలట్‌ల అలసటపై ఫిర్యాదులు పెరిగాయి. దీనితో DGCA ఈ సమీక్ష చేపట్టింది. భారత్‌లో విమాన సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నందున, పైలట్‌లపై పనిభారం పెరిగింది. దీన్ని తగ్గించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చారు.ఈ సవరణలు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉన్నాయి.అయితే ఈ మార్పులకు ఎయిర్‌లైన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. కొత్త నిబంధనల వల్ల 10-20% అదనపు పైలట్‌లను నియమించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానాలు రద్దు అయ్యే ప్రమాదం ఉందని వాదించాయి.
ఢిల్లీ హైకోర్టులో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఇండియన్ పైలట్స్ గిల్డ్ వంటి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ల తర్వాత, DGCA దశలవారీ అమలుకు అంగీకరించింది.
సారాంశం:
పైలట్‌లు ఎంత సేపు విమానాలు నడపాలనే దానిపై DGCA కొత్తగా రాత్రి ఫ్లైట్ టైమ్‌ను 8 గంటలకు, డ్యూటీ పీరియడ్‌ను 10 గంటలకు తగ్గించింది, వీక్లీ రెస్ట్‌ను 48 గంటలకు పెంచింది. ఈ మార్పులు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి, భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి.
జూలై 1, 2025 నుంచి దశలవారీగా అమలు కానున్నాయి, మిగిలిన కొన్ని నిబంధనలు నవంబర్ 1, 2025 నుంచి అమమలులోకి రాబోతున్నాయి . సో, ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన అందరి గుండెల్లో బరువును మిగిల్చింది. అర్మాన్‌కు శాంతి కలగాలని కోరుకుందాం. మీ ఆలోచనలు కామెంట్స్‌లో చెప్పండి
.jpeg)
.jpeg)
Comments
Post a Comment