హ్యాకింగ్ ఎలా చేస్తారో తెలుసా? 



మీరు ఏదైనా డివైజ్ హ్యాక్ అవుతుందనగానే, ఒక్క వ్యక్తి laptop ముందు కూర్చుని green screen లో కోడింగ్ చేస్తూ కీబోర్డ్ నొక్కేస్తూ ఉండే మూవీ సీనే గుర్తుకొస్తుంది? కదా. నిజానికి  అంత cinematic గా ఉండకపోయినా, హ్యాకింగ్ అన్నదే చాలా సీరియస్ టాపిక్. ఇది తప్పుడు పని అయినా, దాన్ని ఎలా చేస్తారో తెలుసుకుంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోగలం. చట్టబద్ధంగా హ్యాకింగ్ అనే స్కిల్‌ను "ఎథికల్ హ్యాకింగ్"గా కూడా నేర్పిస్తున్నారు. కానీ, ఇక్కడ మనం అసలైన హ్యాకింగ్ ఎలా జరుగుతుందో, దాని ప్రధాన రకాలేంటో, మామూలు మనుషుల్ని ఎలా టార్గెట్ చేస్తారో తెలుసుకుందాం. అలాగే మన డివైజెస్ హ్యాకింగ్‌కు దూరంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం.


హ్యాకర్లు నిన్ను ట్రాప్‌లోకి లాగడానికి ఎన్నో ట్రిక్స్ వాడతారు. ఒక రోజు నీకు ఇమెయిల్‌ లేదా మెసేజ్‌లు పంపిస్తారు. అందులో ‘మీ బ్యాంక్ అకౌంట్ సమస్యలో ఉంది, ఈ లింక్ క్లిక్ చేయండి!’ అని ఉంటుంది. ఆ మెయిల్ లేదా మెసేజ్ అచ్చం బ్యాంక్ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేసి, పాస్‌వర్డ్ టైప్ చేస్తే.. మీ డేటా అంతా హ్యాకర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీన్నే ఫిషింగ్ అంటారు. ఇది ఒక రకమైన ఎర వేయడం. 


మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా గూగుల్ వెబ్‌సైట్స్‌ నుంచి ఏదైనా సినిమా లేదా గేమ్ డౌన్‌లోడ్ చేశారనుకో..  దానితో పాటు ఒక వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ నీ డివైజ్‌లో దాక్కుని, నీ ఫొటోలు, మెసేజ్‌లు అన్నీ దొంగిలిస్తుంది. దీన్ని మాల్‌వేర్ అంటారు. ఒక రకమైన డిజిటల్ దొంగతనం.


మరి కొన్నిసార్లు హ్యాకర్లు నీ పాస్‌వర్డ్‌నే గెస్ చేస్తారు. నీ పాస్‌వర్డ్ ‘123456’ లేదా ‘మీ పేరు’ లాంటి సులభమైనదైతే, వాళ్లు కంప్యూటర్ ప్రోగ్రామ్‌తో సెకన్లలో కనిపెడతారు. ఒకవేళ మీరు పబ్లిక్ వై-ఫై వాడి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే.. ఆ నెట్‌వర్క్‌లో హ్యాకర్ ఉంటే, మీరు టైప్ చేసే ప్రతి అక్షరం హ్యాకర్లకు కనిపిస్తుంది.


అన్నింటికంటే ఆసక్తికరమైన టెక్నిక్ ఒకటి ఉంది. అదే సోషల్ ఇంజనీరింగ్. ఈ తరహా హ్యాకింగ్‌లో హ్యాకర్ మీకు ఫోన్ చేసి.. "నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, మీ అకౌంట్ హ్యాక్ అయింది, OTP చెప్పండి" అంటాడు. మీరు భయపడి OTP చెప్పేస్తే, నీ డబ్బు గోవిందా! ఇలా హ్యాకర్లు మన మనసును కూడా హ్యాక్ చేస్తారు. చివరగా, నీ ఫోన్ లేదా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పాతదైతే, దానిలో ఉన్న లోపాల ద్వారా హ్యాకర్లు సులభంగా లోపలికి వస్తారు.


ఇప్పుడు హ్యాకింగ్ నుంచి ఎలా కాపాడుకోవాలో చూద్దాం. 



మీరు Instagram, Gmail, Bank అన్నింటికీ ఒకే password వాడితే, ఒకటి hack అయితే అన్ని డోర్‌లు ఓపెన్ అవుతాయి. అందుకే ప్రతి అకౌంట్‌కి వేరే  password  ఉండాలి.


ఆ పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. 123456, password123, mobile number లాంటి వాటిని ఎప్పటికీ పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. Capital letters, numbers, special characters కలిపి కనీసం 8 అక్షరాలు ఉండాలా చేసుకోండి.


బ్యాంక్, గవర్నమెంట్ ఎప్పుడూ మీకు ఫోన్ చేసి OTP అడగదు. మీకు తెలిసిన వ్యక్తి అయినా  OTP చెప్పొద్దు. హ్యాకింగ్‌లో ఎక్కువగా ఈ ఒక చిన్న పొరపాటు వల్లే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు.



బస్ స్టేషన్, కాఫీ షాప్ లాంటి చోట్ల ఉచిత Wi-Fi వాడుతున్నపుడు Bank transaction చేయడం, OTP టైప్ చేయడం చాలా ప్రమాదకరం. 


మీరు అందుకునే మెసేజ్‌లలో ‘మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది’, ‘మీ parcel dispatch కావాలి’ లాంటి లింకులు ఉంటే వాటిపై క్లిక్ చేయొద్దు. నిజమైన వెబ్‌సైట్‌లోకి మీరే టైప్ చేసి వెళ్లండి.


Play Store లేకుండా APK ఫైల్‌గా ఆప్స్ ఇన్‌స్టాల్ చేస్తే, వాటిలో virus ఉండే అవకాశం ఉంది. ఇవి Keylogger లాగా పనిచేస్తాయి. unknown sources నుండి వచ్చిన apps‌కి నో చెప్పండి.


Gmail, Facebook, Instagram లాంటి వాటిలో Two-Factor Authentication ఓనచేయండి. హ్యాకర్‌కి మీ పాస్‌వర్డ్ తెలిసినా, OTP లేకుండా లోపలికి రావలేడు.


ఇప్పడు మీకు హ్యాకింగ్ గురించి ఒక అవగాహణ వచ్చిందనుకుంటున్నాను. అలాగే హ్యకింగ్‌కు దూరంగా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా క్లారిటీ వచ్చిందనుకుంటున్నాము. 




Comments

Popular posts from this blog