1. మనుషుల్ని తినే భయంకరమైన తెగలు..



ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో కూడా… కొన్ని తెగలు ఇంకా ఆదిమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి మనిషి పుట్టుక, సమాజ నిర్మాణానికి సంబంధించి ఎన్నో రహస్యాలను దాచుకొని ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని తెగలు మాత్రం.. మనిషికి, సమాజానికి శత్రువులేనని చెప్పవచ్చు. మనషులను చూస్తే చాలు వారిపై దాడి చేసి, వారిని చంపేంత క్రూరమైన తెగల వారు ఇంకా ఉన్నారు. ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎన్నడూ బయటకి రాకుండా.. వారి జీవనశైలి మానవాళికి విరుద్ధంగా కనిపించే వారి చర్యలను ఒకసారి లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం భయంకర తెగలకు సంబంధంచిన కథలు మాత్రమే కావు… మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని మరో మానవ చరిత్ర కోణం గురించి తెలిపే మూడు తెగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 


2004లో సంభవించిన విధ్వంసకర సునామీ తర్వాత, హిందూ మహాసముద్రం అండమాన్ దీవులలోని గిరిజన ప్రజల జీవన విధానం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఆ గిరిజన తెగలలోని వారిలో ఒక జాతి సెంటినెలీస్. ఇది ఒక భయంకరమైన తెగ. బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక చిన్న దీవికే పరిమితమై జీవిస్తున్న అతి కొద్ది ఆదిమ తెగల్లో ఈ సెంటినెల్ తెగ ఒకటి. వీరు నివసిస్తున్న దీవి అండమాన్ ద్వీప సమూహంలో ఉంది. ఈ దీవి సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. కానీ వారి గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అసలు ఈ దీవిలో ఎంత మంది ప్రజలు ఉన్నారు? వారేం భాష మాట్లాడతారు? అనే విషయాలు కూడా ఇంత వరకు ఎవ్వరికీ తెలియలేదు. వీరు.. దాదాపు 60 వేల సంవత్సరాల నుంచీ ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని అంచనా వేస్తున్నారు. 


వీరు ఎంత భయంకరమైన తెగ వారు అంటే.. వీరి చుట్టు పక్కల తెలియని వ్యక్తులు ఏవరైనా వస్తే వారిని చంపడానికి కూడా వెనకాడరు. 1974లో ఒక దర్శకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, బాణంతో ఆయన కాలికి గాయం చేశారు. నేషనల్ జియోగ్రఫిక్ చానల్ కోసం డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసేందుకు ఆయన సిబ్బంది ప్రయత్నించాగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత 2018 నవంబర్‌లో అమెరికాకు చెందిన 27 ఏళ్ల జాన్ అలెన్ చౌ.. ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలీస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకు అక్కడికి వెళ్లగా.. ఆయన హత్యకు గురయ్యారు. అప్పటి  భాతర ప్రభుత్వం ఈ దీవిలోని వారిని ఎవరూ కలవకూడదని నిషేధించింది. 1956 నుంచి ఈ నిషేధం కొనసాగుతోంది. ఎవరూ ఈ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దీవి చుట్టూ ఇండియన్ కోస్ట్ గార్డు పర్యవేక్షణ ఉంటుంది.

ఇక రెండవ తెగ.. ఆస్మత్ తెగకు చెందిన పశ్చిమ పాపువా హెడ్‌హంటర్లు. పశ్చిమ పాపువా ప్రాంతంలోని న్యూ గినియాలోని దక్షిణ తీర ప్రాంతాలలో వీరు నివసిస్తుంటారు. వీరిని నరమాంస భక్షకులు అని కూడా అంటారు. వీళ్లు శత్రువుల తలను నిప్పుల కొలిమిలో కాల్చుకొని.. పుర్రెలోని మాంసాన్ని తింటారు. కొన్నిసార్లు పుర్రెలు పగలగొట్టి పాత్రలు తయారు చేస్తారు. వాటిలోనే ఆహారం తింటారు.  మరికొన్ని పుర్రెలను దిండుగా చేసుకొని.. వాటిపైనే నిద్రిస్తారు. వారి ఎముకలను ఆభరణాలుగా  తయారు చేసుకుని పండగలు, ఇతర కార్యక్రమాల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం వీరు నివసిస్తున్న చోటును అక్కడి ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా పరిగణించింది. 



పండుగ సమయంలో శత్రువుల పుర్రెలను.. పిల్లల పాదాల మధ్య ఉంచుతారు. ఇలా చేయడం వల్ల శత్రు శక్తి తమ పిల్లలకు బదిలీ అవుతుందని నమ్ముతారు. శత్రువు వెన్నెముక, దిగువ భాగాన్ని తమతో పాటు ట్రోఫీలాగా తీసుకువెళతారు. శత్రువు కింది దవడను ఇంట్లో ఉంచడం వల్ల ధైర్యసాహసాలు వారికి కలుగుతాయని ఈ తెగ వారు నమ్ముతారు. అస్మత్ తెగలో ఎవరైనా చనిపోతే... వారి మృతదేహాన్ని చాలా హీనంగా చూస్తారు. చనిపోతున్న వ్యక్తి గొంతు కోసి.. అతని మెదడును, కళ్లను బయటకు తీస్తారు. ఇది దుష్టశక్తులను దూరం చేయగలదని వారి నమ్మకం. 


 ఇక, మూడవ తెగ వారు యానోమామి. ఈ తెగ వారు ఇప్పటికీ తమ సంస్కృతి,సంప్రదాయాలను అనుసరిస్తారు. ఈ తెగలో అంత్యక్రియలు చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ తెగలో ఎవరైనా మరణిస్తే.. వారి మాంసాన్ని తింటారు. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో నివసిస్తున్న యానోమామి తెగ వారు.. మరణం తర్వాత శరీరం ఆత్మను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే.. వారు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాల్చుకొని.. ఆ మాంసాన్ని వారి బంధువులు తింటారు. ఇలా చేయడం ద్వారా చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారు భావిస్తారు. 


ఇలాంటి తెగలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని తెగలు నవీన యుగంతో కలిసిపోతుందటే..మరికొన్ని తెగలు వారి పూర్వికుల ఆచారాలను పాటిస్తూ అక్కడే ఉండిపోతున్నాయి.వాళ్లల్లో ఈ మూడు తెగలు భయంకరమైనవని చెప్పుకోవచ్చు.


మరి ఈ తెగలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి

Comments

Popular posts from this blog