సింధూ జలాలను భారత్ ఆపగలదు.. అందులో నో డౌట్

ప‌హ‌ల్గాం ఉగ్రదాడి నేప‌థ్యంలో భార‌త్ సింధు జ‌లాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ మంత్రి అయిస్ లెఘారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాల్లో ప్రతి నీటి చుక్కా పాకిస్థాన్‌దేనంటూ వ్యాఖ్యానించారు. ‘సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం పిరికిపంద, చట్టవిరుద్ధమైన చర్య అని. ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తిశక్తితో కాపాడుకుంటాం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని. . ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు’ అని పాకిస్థాన్‌ మంత్రి అవాయిస్‌ లెఘారీ స్పష్టం చేశారు.


అయితే, ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ జలాల్లో భారత్‌ 20 శాతం, పాకిస్థాన్‌ 80 శాతం వినియోగించుకోవాలి. ఆనాటి ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాక్‌లో ప్రవహించడానికి భారత్‌ వీలు కల్పించాల్సి ఉంది. కానీ,  పశ్చిమ నదుల నీటి వినియోగంపై పూర్తి నిషేధం లేదు. అయితే మౌలిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా నదీజల పంపకం ఒప్పందాల్ని రద్దు చేసుకోవచ్చు అని అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియెన్నా ఒడంబడికలోని 62వ అధికరణం పేర్కొంటోంది. కానీ పాక్ దుశ్చర్యలకు బుద్ధి చెప్పాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఒకవేళ ఇదే గనక జరిగితే.. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధు ప్రావిన్స్ లు ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్‌లోని వ్యవసాయ భూముల్లో 80% భూములకు సింధు జలాలే కీలకం. ఈ రెండు ప్రావిన్స్ లలో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది అంటే.. 23.7 కోట్ల మంది ఇండస్ బేసిన్‌లోనే నివాసం ఉంటున్నారు.


ఇక, కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నదీ వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. అంతేకాకుండా తర్బెలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్ కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు, వడ్లు, చెరకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, ఝీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే, పాకిస్తాన్‌లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల వలసపోయే పరిస్థితులు ఏర్పడుతాయి. 


అయితే, ఈ ఒప్పందాల కారణంగా ఇప్పటి వరకూ సింధు నదిపై ఎలాంటి డ్యాములు నిర్మించలేదు. ఇప్పటికిప్పుడు నిర్మించి భారత్ ఆపగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ,  సింధు నదిని మళ్లించే ప్లాన్ భారత్ వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి నిల్వకు డ్యాములు కట్ట ఇప్పటికిప్పుడు వేయలేదు.. కానీ, విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం వరుసగా భారత్ నిర్మిస్తూ వస్తోంది. బాగ్లిహార్  వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ నిర్మించింది. వాటి ద్వారా పాకిస్తాన్ కు జల ప్రవాహాన్ని ఇప్పటికే తగ్గించారు. 


ఇక, 2019 పుల్వామా దాడి తర్వాత, బియాస్, రావి, సట్లెజ్ జలాలను పూర్తిగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించే ప్రణాళికలను కేంద్రం ప్రకటించింది. ఈ జలాలను షాహ్‌పూర్, కండి డ్యామ్ లేదా ఇతర సౌకర్యాల ద్వారా మళ్లించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఇండస్ నది వ్యవస్థలోని రావి నదిపై పంజాబ్‌లో ఉన్న షాహ్‌పూర్ కండి డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. అయితే, ఈ  ఒప్పందాల కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను భారత్ ఇంకా పూర్తి చేయలేదు. ఒకవేళ ఇప్పుడు దాన్ని పూర్తి చేసినట్లైతే.. పాకిస్తాన్‌కు నీళ్లు ఆగిపోయ అవకాశం ఉంది.

మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Comments

Popular posts from this blog