మిలియన్ల సందప దాగున్న కమ్రునాగ్ సరస్సు.. ఇది ఒక మిస్టరీ సరస్సు!
భారతదేశం అంటే కేవలం సంస్కృతి, సంప్రదాయాల గుండె చప్పుడు మాత్రమే కాదు. ఎన్నో రహస్యాలను తనలోనే దాచుకున్న ఒక పెద్ద కథల పుస్తకం. ఇక్కడి దేవాలయాలు, కోటలు, సరస్సులు శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసిరే విధంగా ఉన్నాయి. అలాంటి ఒక రహస్యమే హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక సరస్సు. మహాభారతం కాలం నాటి నుంచి ఈ సరస్సు చుట్టూ పురాణాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సర్ససు నీటిలో బంగారం, వెండి దాగి ఉన్నాయని, ఒక శక్తివంతమైన యోధుడి కథ దీని వెనుక ఉందని చెబుతారు. కానీ ఈ సంపద ఎలా వచ్చింది? దీని వెనుక కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
కమ్రునాగ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో, కరోగ్ లోయలో ఉంది. సముద్ర మట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో, దట్టమైన దేవదారు చెట్ల మధ్య ఈ సరస్సు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే.. ముందుగా బార్బరీకుడు ఎవరో తెలుసుకోవాలి.
పురాణాల ప్రకారం కమ్రునాగ్ మహాభారత యుగంలో ఒక యోధుడు. ఇతడినే బార్బారిక్ అని కూడా పిలుస్తారు. మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు. అతడు ఘటోత్కచుడి కొడుకు, భీముడి మనవడు. ఘటోత్కచుడు పాండవులలో భీముడి కొడుకు, రాక్షస జాతికి చెందిన హిడింబ అనే స్త్రీకి జన్మించాడు. బార్బారిక్ తన తండ్రి లాంటి రాక్షస శక్తులతో పాటు అసాధారణమైన యుద్ధ నైపుణ్యం కలిగినవాడు. అతడి వద్ద మూడు బాణాలు ఉండేవి, ఈ బాణాలు శివుడి వరం వల్ల అసామాన్య శక్తిని కలిగి ఉండేవి. ఒకే బాణంతో ఏ సైన్యాన్నైనా నిమిషాల్లో అంతం చేయగలవు, లక్ష్యాన్ని చేరిన తర్వాత తిరిగి అతడి వద్దకు వచ్చేవి.
బార్బారిక్ మహాభారత యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించాడు. తన తల్లిని అనుమతి అడిగినప్పుడు, ఆమె ఓడిపోయే సైన్యం తరఫున పోరాడమని చెప్పింది. బార్బారిక్ సరే అన్నాడు. కానీ ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. కౌరవులు ఓడిపోతారని, బార్బారిక్ వాళ్ల తరఫున చేరితే యుద్ధం ఫలితం పూర్తిగా మారిపోతుందని ఆయన ఫీలయ్యాడు. అందుకే బార్బారిక్‌ను యుద్ధంలో పాల్గొనకుండా ఆపాలని నిర్ణయించాడు.
శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో బార్బారిక్ దగ్గరకు వెళ్లాడు. అతడి మూడు బాణాలను చూసి, “ఈ మూడు బాణాలతో యుద్ధం చేస్తావా?” అని నవ్వాడు. బార్బారిక్, తన ఒకే బాణంతో లక్ష్యాన్ని చేధించి, తిరిగి తన వద్దకు వస్తుందని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఒక పరీక్ష పెట్టాడు. “ఈ చెట్టు ఆకులన్నీ నీ బాణంతో ఛేదించు,” అని చెప్పాడు. బార్బారిక్ సిద్ధమవుతుండగా, కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచాడు. బాణం విడిచిన కొద్ది క్షణాల్లో, అది చెట్టు ఆకులన్నీ ఛేదించి, కృష్ణుడి పాదం వైపు తిరిగింది. కృష్ణుడు పాదం తీసేసరికి, ఆ ఆకును కూడా ఛేదించింది. బార్బారిక్ శక్తిని చూసిన కృష్ణుడు, అతడిని ఒక కోరిక అడిగాడు. ఏది అడిగినా బార్బారిక్ ఇవ్వాలి. అప్పుడు కృష్ణుడు తన నిజ రూపంలో వచ్చి, బార్బారిక్ తల అడిగాడు.
బార్బారిక్ అంగీకరించాడు, కానీ ఒక కోరిక చెప్పాడు - మహాభారత యుద్ధం చూడాలని. కృష్ణుడు సరే అని, అతడి తలను యుద్ధభూమి ఎదురుగా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాడు. అక్కడ నుంచి బార్బారిక్ యుద్ధం మొత్తం చూశాడు. యుద్ధం అయిపోయాక, కృష్ణుడు బార్బారిక్‌కు వరం ఇచ్చాడు - కలియుగంలో అతడిని కామ్రుగా పూజిస్తారని, అతడి తల పూజలు అందుకుంటుందని.
చివరకు యుద్దం ముగిన తర్వాత పాండవులు తమ స్వర్గ ప్రయాణంలో బార్బారిక్ తల ఉన్న ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు.. అప్పుడు బార్బారిక్ వాళ్లను నీళ్లు అడిగాడు. అప్పుడు భీముడు తన అరచేతితో నేలను కొట్టి, ఒక సరస్సు ఏర్పడేలా చేశాడు. ఆ సరస్సే ఇప్పుడు కమ్రునాగ్ సరస్సుగా పిలవబడుతుంది. చెబుతారు, పాండవులు తమ వద్ద ఉన్న బంగారం, వెండి, ఆభరణాలను ఈ సరస్సులో వేసి, పూల లోయ వైపు వెళ్లారని పురాణాలు చెబుతన్నాయి. అలా మహా భారత కాలం నాటి నుంచి కమ్రునాగ్ సరస్సు నీటి అడుగున సంపద దాగి ఉందని నమ్ముతారు.
నేటికీ భక్తులు కూడా ఈ సరస్సులో బంగారం, వెండి, నాణేలు కానుకగా వేస్తారు. దీనిలో బిలియన్ల సంపద దాగి ఉంది. ఈ సరస్సు చాలా లోతైనది. దీని లోతు ఎంత ఉందో సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇక్కడ భారీగా “సరనాహులి” జాతర జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ సరస్సును చేరాలంటే 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి, కానీ ఆ దృశ్యం, ఆ రహస్యమైన వాతావరణం చూస్తే ఆ కష్టం అంతా పోతుంది.
కమ్రునాగ్ సరస్సు కేవలం ఒక సరస్సు మాత్రమే కాదు; ఇది మహాభారతం నుంచి వచ్చిన ఒక జీవన కథ. బార్బారిక్ శక్తి, పాండవుల ప్రయాణం, సరస్సులో దాగి ఉన్న సంపద ఇవన్నీ ఈ ప్రదేశాన్ని ఒక రహస్యమైన, స్ఫూర్తిదాయకమైన స్థలంగా మార్చాయి. ఈ సరస్సు నీళ్లు మనకు ఒకటే చెబుతున్నాయి. జీవితంలో ఎన్ని సవాళ్లు వచ్చినా, ధైర్యంగా ఉంటే అసాధ్యమైనవి సాధ్యం అవుతాయి. కమ్రునాగ్ సరస్సు ఒక అందమైన రహస్యం. ఈ సరస్సులో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో! చూడాలి.
మరి ఈ సరస్సుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
.jpeg)
Comments
Post a Comment