కిమ్ రూల్స్ తెలిస్తే.. పిచ్చెక్కుతుంది!

 పాపం నార్త్ కొరియా ప్రజలకు.. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు! 

ఉత్తర కొరియా దేశాన్ని భూమిపైనే ఉన్న మరో ప్రపంచమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటుగా ఉంటుంది. ప్రపంచంతో సంబంధం లేని ఆ దేశంలో జీవించడం అంత ఈజీ కాదు. అక్కడి పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ఉత్తర కొరియా నియంత కిమ్ అత్యంత కఠినంగా ఉంటాడు. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు, విధించే ఆంక్షలు మనకు చిత్రంగా అనిపిస్తాయి. కానీ, నార్త్ కొరియా ప్రజలకు మాత్రం అవి తప్పని తిప్పలు.

మరి కిమ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.


ఉత్తర కొరియాలో జీవితం అంటే ఒక విచిత్రమైన కల కంటే తక్కువేమీ కాదు. ఇక్కడ ప్రతి చిన్న విషయంపై నియంత్రణ ఉంటుంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం మధ్యయుగ శైలిలోనే బతుకుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ప్రజలు శ్వాస కూడా తీసుకోవడం కష్టమే!ఇలాంటి ఉత్తర కొరియాలోని రూల్స్ గురించి మాట్లాడుకోవడమంటే కిమ్ జాంగ్ ఉన్ గురించి మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇతగాడు ఒక దేశాన్ని పాలిస్తున్నాడా లేక ఒక భారీ రియాలిటీ షో నడుపుతున్నాడా అన్నట్లు ఉందని కిమ్ పాలన. ఉత్తర కొరియా ప్రజలు ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో కావచ్చు. కానీ, అవి కిమ్ అనుమతి పొందినవై ఉండాలి. కాదని జీన్స్ వేసుకుని స్టైలిష్‌గా కనిపిస్తే.. అదే వారి చివరిరోజు అవుతుంది. అక్కడి ప్రజలకు టీవీ వార్తులు చూసే అదృష్టం ఉంది. కానీ, అందులో వచ్చే వార్తలు కేవలం కిమ్ గురించి మాత్రమే వస్తాయి. ఒకవేళ మీరెవరైనా చాటుగా విదేశీ సంగీతం వింటే? వారి ఫ్యూచర్ కిమ్ చేతిలో ఓ థ్రిల్లర్ మూవీలా మారిపోతుంది!


కిమ్ పాలన అంటే నిబంధనలతో నిండిన ఓ ఆట అన్నట్లు. ఇందులో విజయం సాధించాలంటే.. ప్రాణాలు పోగొట్టుకోవడమే! ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే.. మూడు తరాల కుటుంబం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంటే మీ తాతయ్య బ్లూ జీన్స్ వేసుకుని తిరిగితే.. మీ నాన్న, నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రూల్స్ కంటే కూడా డేంజరస్!


కిమ్ జాంగ్ ఉన్ పాలన గురించి వింటుంటే, ఒక డిస్టోపియన్ సినిమాను చూస్తున్నట్లే ఉంటుంది. కానీ, ఇది నిజంగా జరుగుతోంది! ఉత్తర కొరియాలో జీవించడం అంటే కిమ్ సృష్టించిన విశ్వంలో అడుగుపెట్టినట్టే. 


ప్రజలు కేవలం ఒకే టీవీ ఛానల్ చూడాలి. అది కూడా ప్రభుత్వానిదే. అంటే, వాళ్లు రిమోట్‌ను పట్టుకుని ఛానల్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. కాదని విదేశీ ఛానల్స్ చూస్తే.. ఇక అంతే సంగతులు. ఎవరైనా హోటల్‌కి వెళ్లి, బ్లూ జీన్స్ వేసుకుని కనిపిస్తే.. వారు విదేశీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. 


మనలాగా స్పెషల్ హెయిర్ కటింగ్స్ ఉత్తరకొరియాలో ఉండవు. అక్కడి ప్రజలు ఎలా హెయిర్ కట్ చేయించుకోవాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. నార్త్ కొరియాలో మొత్తం 28 రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అందులో మహిళలకు షార్ట్ హెయిర్ కటింగ్ తప్పనిసరి. 


ఇక్కడ ఒక నిబంధన కూడా ఉంది. కిమ్‌కు ఉన్న హెయిర్ స్టైల్ దేశంలో ఎవరికీ ఉండకూడదు. పొరపాటున ఎవరైనా కిమ్ లాంటి హెయిర్ కటింగ్ చేయించుకుంటే.. నేరుగా జైలుకే.


ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ వాడాలంటే, ప్రభుత్వానికి మీ బ్రౌజింగ్ హిస్టరీ చూపించాల్సిందే. అక్కడ కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్స్ మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. ఫేస్‌బుక్, యూట్యూబ్? పాపం, అవేంటో కూడా అక్కడి వారికి తెలియదు.


కిమ్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం తప్పకుండ చేస్తారు. సెలవుదినంగా ప్రకటించడం పక్కా. కిమ్ బర్తడేని సెలబ్రేట్ చేయకపోతే.. చలో జైలుకే.


దేశంలో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలన్నా అనుమతి కావాలి. అంతెందుకు ఉత్తరకొరియా రాజధాని ‘ప్యొంగ్యాంగ్’ నగరాన్ని చూడాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.


పొరపాటును ఎవరైనా పోర్న్ చూసినా, షేర్ చేసినా కళ్లు పీకేస్తారు. 


మనలాగా డేట్ అండ్ నైట్స్ రోడ్లపై తిరుగుతానంటే ఉత్తర కొరియాలో కుదరదు. రాత్రి తొమ్మిది గంటలకెల్లా అందరూ ఇంటికి వెళ్లిపోవాలి. ఇక రాత్రి పది అయిందంటే చాలు.. కరెంట్ కట్. 


ఉత్తర కొరియా ప్రజలు వాహనాలు కొనడానికి లేదు.. కొనాలంటే ప్రభుత్వం అనుమతించాలి. కేవలం ప్రభుత్వంలో పనిచేసేవారికే కార్లు ఉంటాయి.


ప్రతి ఒక్కరి ఇంట్లో కిమ్ ఫ్యామిలీ ఫోటోలు ఉండాలి. పొరపాటున ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే.. ప్రాణాలకు తెగించైనా కిమ్ ఫ్యామిలీ ఫోటోలు బయటకు తీసుకురావాలి. అలా చేయకపోతే.. వాళ్లను సగర్వాంగా స్వర్గానికి సాగనంపుతారు.


ఎవరైనా నార్త్ కొరియా వెళ్తే.. దేశం మొత్తం తిరగడానికి అనుమతి ఉండదు. ప్రభుత్వం నిర్ణియించిన ప్రాంతాలకు మాత్రమే టూరిస్టులు వెళ్లాలి. కాదని అనుమతి లేని ప్రాంతాలకు వెళ్తే.. టూరుస్టులు కూడా జైలలో కూర్చోవాల్సిందే



నార్త్ కొరియా ప్రజలు విదేశీయులను పలకరించడం కూడా నేరమే. ఒకవేళ ఉత్తరకొరియా ప్రజలను చూసి ఓ టూరిస్ట్ ‘హాయ్’ అన్నాడనుకో.. అక్కడి ప్రజలు నవ్వకుండా వెళ్లిపోవాలి. లేదంటే వారు దేశద్రోహిగా మారిపోతారు.


ఇలా ఎన్నో రూల్స్, ఎన్నో నియమాలు, ఎన్నో  ఆంక్షలతో ఉత్తర కొరియా.. ఒక డిస్టోపియన్ దేశంగా మారింది. కానీ, అక్కడి ప్రజలు మాత్రం మౌనంగానే బతుకుతున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడిని అవే చివరి మాటలు అవుతాయి.


మరి కిమ్ రూల్స్ మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరిని నార్త్ కొరియాకు పంపించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.


Comments