కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా ? అయితే, మీ కళ్ళు డేంజర్ లో ఉన్నట్లే!
ఆధునిక ప్రపంచంలో కాంటాక్ట్ లెన్స్‌లు ఒక వరం లాంటివి. ఇవి కళ్ళజోడు లేకుండా స్పష్టంగా చూడడానికి ఎంతో సహాయపడతాయి. స్టైలిష్‌తోపాటు ఫ్యాషన్‌గానూ కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 మిలియన్ల మంది కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లు మీ కళ్ళను డేంజర్‌లో పడేసే అవకాశం ఉంది!
అసలు ఈ కాంటాక్ట్ లెన్స్‌లు ఎలా పుట్టాయి? ఎలా వాడుకలోకి వచ్చాయి? ఇంత పాపులర్ ఎలా అయ్యాయి? ప్రస్తుతం వీటి వల్ల ప్రమాదం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం.
కాంటాక్ట్ లెన్స్‌ల వాడకం 1887లో జర్మనీలో స్టార్ట్ అయ్యాయి. ఒక జర్మన్ ఆప్టాల్మాలజిస్ట్ అడాల్ఫ్ ఫిక్ అనే వ్యక్తి గ్లాస్‌తో తయారు చేసిన మొట్టమొదటి కాంటాక్ట్ లెన్స్‌లను రూపొందించాడు. అవి కంటి స్క్లెరా మీద ఉంచేలా డిజైన్ చేశాడు. అంటే అవి కంటి తెల్లటి భాగం మొత్తం కవర్ అయ్యేలా ఉండేవి. కానీ అవి భారీగా, అసౌకర్యంగా ఉండేవి. ఆ తర్వాత 1940లలో అమెరికాలో ప్లాస్టిక్ లెన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. అవి కాస్త లైట్‌వెయిట్‌గా, కంఫర్టబుల్‌గా మారాయి. ఇప్పుడు మనం ఉపయోగించే సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ 1960లలో చెక్ రిపబ్లిక్‌లో ఓటో విచ్టర్లే అనే సైంటిస్ట్.. హైడ్రోజెల్ మెటీరియల్‌తో డెవలప్ చేశాడు. అక్కడ నుంచి ఈ లెన్సెస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి!
ఈ లెన్సెస్ కేవలం చూపు కోసం మాత్రమే కాదు. ఇవి మన లైఫ్‌స్టైల్‌ను లెవెలప్ చేస్తాయి! కాంటాక్ట్ లెన్స్‌లు వచ్చాకా క్రీడలు ఆడేవాళ్లకు అద్దాలు జారిపోయే టెన్షన్ లేదు. సినిమా స్టార్స్ కళ్ళ రంగు మార్చి క్యారెక్టర్స్‌కి జీవం పోశాయి. సాధారణ జనాలు స్టైలిష్‌గా ఒక రేంజ్‌లో కనిపిస్తారు. ఇవి కంటి కార్నియాకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి, చూపును సహజంగా షార్ప్ చేస్తాయి. కానీ ఇదే స్పెషల్‌నెస్ వీటిని రిస్కీగా కూడా మారుస్తుంది. ఎందుకంటే ఇవి నీ కంటి సున్నితమైన భాగంతో డైరెక్ట్‌గా టచ్‌లో ఉంటాయి.
కాంటాక్ట్ లెన్సెస్ ఎంత అద్భుతంగా ఉన్నా, సరిగ్గా ఉపయోగించకపోతే చాలా సమస్యలు వస్తాయి. కాంటాక్ట్ లెన్స్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు.
2016లో బ్రిటన్‌లో జాకీ డేవిస్ అనే 42 ఏళ్ల అమ్మాయి కాంటాక్ట్ లెన్సెస్ వాడుతూ ఉండేది. ఒక రోజు కంట్లో నొప్పితోపాటు కళ్లు ఎర్రగా అవడం స్టార్ట్ అయ్యాయి. కారణం.. జాకీ లెన్సెస్‌ని క్లీన్ చేయకుండా, ఎక్కువ సేపు పెట్టుకుని ఉండటం. కనీసం స్నానం చేసేటప్పుడు కూడా తీయలేదు. చివరకు డాక్టర్స్ చెక్ చేస్తే.. నీటిలో ఉండే అకాంతమీబా అనే పరాన్నజీవి లెన్సెస్ ద్వారా కంట్లోకి వెళ్లి కార్నియల్ అల్సర్ వచ్చేలా చేసిందని తెలిసింది. చాలా నెలల ట్రీట్‌మెంట్ తర్వాత కూడా జాకీ కంటి చూపు సగం పోయింది.
ఇలాగే 2019లో అమెరికాలో ఆష్లే రోజ్ అనే ఒక టీనేజర్.. తన కాంటాక్ట్ లెన్సెస్‌ని తీయకుండా ప్రతిరోజూ నిద్రపోయేది. క్రమంగా.. కంట్లో నొప్పితోపాటు కళ్లు ఎర్రగా అవడం స్టార్ట్ అయ్యాయి. డాక్టర్స్ చెక్ చేస్తే.. ప్సూడోమోనాస్ బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తేలింది. దీంతో రోజ్ శాశ్వతంగా తన చూపును కోల్పోయింది. లెన్సెస్ ఎక్కువ సేపు ఉంచడం, సరైన క్లీనింగ్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది.
ఇలాంటి కేసులు కేవలం విదేశాల్లోనే కాదు.. మన భారత్‌లో కూడా జరిగాయి. 2022లో రాహుల్ అనే 28 ఏళ్ల వ్యక్తి.. రోజూ 12-14 గంటలు కాంటాక్ట్ లెన్సెస్ ధరించేవాడు. ఒక రోజు అతని కళ్లు ఎర్రబడి, నీరు కారుతూ, చూడటానికి ఇబ్బందిగా అనిపించాయి. డాక్టర్ చెక్ చేస్తే, లెన్సెస్ వల్ల కార్నియా మీద చిన్న గీతలు పడి, ఆక్సిజన్ లోపం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ వచ్చినట్లు తెలిసింది. అతను లెన్సెస్ తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోవడం, ఎక్కువ సేపు వాడడమే ఇందుకు కారణం. చికిత్స తర్వాత కోలుకున్నా, అతను ఇప్పుడు లెన్సెస్‌కి బదులు అద్దాలు వాడుతున్నాడు.
ఇవన్నీ రియల్ లైఫ్ ఉదాహరణలు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కాంటాక్ట్ లెన్సెస్ వల్ల ఇన్ఫెక్షన్స్, కార్నియా డ్యామేజ్, లేదా చూపు కోల్పోవడం వంటి సీరియస్ పరిణామాలు రావచ్చు.
లెన్స్‌ను సరిగా వాడకపోతే చాలా ప్రమాదాలు ఎదురౌతాయి. లెన్సెస్ కంటికి ఆక్సిజన్ అందకుండా అడ్డుపడతాయి. దీని వల్ల కార్నియా వీక్ అవుతుంది. అంతేకాదు, లెన్సెస్‌ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ కంట్లోకి వెళ్లొచ్చు. ఎక్కువ సేపు పెట్టుకుంటే కొత్త రక్తనాళాలు పెరిగి కంటి ఆరోగ్యం చెడిపోతుంది. లెన్సెస్ పెట్టేటప్పుడు లేదా తీసేటప్పుడు కేర్‌లెస్‌గా ఉంటే కార్నియాకు స్క్రాచెస్ పడతాయి. కొందరికి లెన్స్ మెటీరియల్‌తో అలర్జీ, డ్రై ఐస్ వస్తాయి. అందుకే లెన్స్
ఒకవేళ లెన్సెస్ తప్పనిసరిగా వాడాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.
* కాంటాక్ట్ లెన్సులు ధరించి స్నానం చేయవద్దు.
* మీరు వాడే కాంటాక్ట్ లెన్స్‌ను ఇతరులతో ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దు
* రాత్రి పూట నిద్రపోయే ముందు కాంటాక్ట్ లెన్స్‌ను తీసేయండి.
* కాంటాక్ట్ లెన్స్ పెట్టే ముందు, బయటకు తీసే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి.
* కాంటాక్ట్ లెన్స్ వాడే చాలా మంది లెన్స్ బాక్స్‌ను రెగ్యులర్‌గా మార్చరు. కాంటాక్ట్ లెన్స్‌ల బాక్స్‌ను రెగ్యులర్‌గా మార్చడం, శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
* లెన్సులను శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు. డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్‌లను వాడకపోతే ప్రతిరోజూ లెన్స్‌లను శుభ్రం చేసుకోవాలి.
* కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు ఏడాదికి ఒకట్రెండు సార్లు తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవాలి.
మరి ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తున్నారో లేదో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీలో కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి ఈ వీడియోను షేర్ చేయండి.
.jpg)
.jpg)
.jpg)

Comments
Post a Comment