వడాపావ్ అమ్మే వ్యక్తి.. సినిమా తీసి 700 కోట్లు సంపాదించాడు!
ముంబయిలో పేదరికం, కలల్ని నెరవేర్చుకోవాలనే తపన లక్ష్మణ్ ఉటేకర్ అనే సాధారణ వ్యక్తిని అసాధారణ దర్శకుడిగా తీర్చిదిద్దాయి. వడాపావ్ అమ్మే తన స్వయకృషితో దేశం మొత్తం మాట్లాడుకునే ‘ఛావా’ అనే భారీ సినిమా తీసి 700 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇది సినిమా మాత్రమే కాదు ఓ వ్యక్తి జీవిత ప్రయాణం, ఓ కలల పయనం.
లక్ష్మణ్ మధ్యప్రదేశ్‌లోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సమర్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. అక్కడే చదువుకున్నాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, అతనికి సినిమాలంటే చాలా ఇష్టం. గ్రామంలో ఉన్న ప్రొజెక్టర్ థియేటర్ దగ్గర పనికి పోతూ సినిమాలు చూస్తూ పెరిగాడు. అప్పుడే లక్ష్మణ్ మనసులో ఒక ఆశయం ఏర్పడింది. ఈ ఆశయం ఏంటంటే. ‘నన్ను చూసేందుకు కూడా ఒక రోజు ప్రజలు థియేటర్‌కి వస్తారు’ అని.
కానీ, చిన్నప్పుడే కుటుంబ ఆర్థిక బాధ్యతలు భుజాన పడటంతో లక్ష్మణ్, ముంబయికి వచ్చాడు. అక్కడ స్టూడియోల్లో అసిస్టెంట్‌గా కూడా పని చేశాడు. ఏ రోజూ కెమెరా పట్టే అవకాశం రాకపోయినా, ఫ్రేమ్ ఎలా ఉండాలో, కధ ఎలా చెప్పాలో మౌనంగా నేర్చుకున్నాడు. డబ్బుల కోసం ఉదయాన్నే స్టూడియోలో క్లీనర్‌గా పని చేసి, సాయంత్రం బోరివలిలో వడా పావ్ అమ్మేవాడు.
ఎలాగైనా కెమెరా వెనుక కాకుండా కెమెరా ముందు కథ చెప్పాలనే ఒక్క నిర్ణయంతో లక్ష్మణ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అందుకోసం తన దగ్గర సొమ్ము లేకపోయినా, బంధువుల్ని, స్నేహితుల విమర్శలను పట్టించుకోకుండా తన టాలెంట్‌తో అవకాశాల కోసం ప్రయత్నించాడు. కొన్ని మ్యూజిక్ వీడియోలు, యాడ్స్ తీసి పేరు తెచ్చుకున్నాడు. తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా హిందీ సినిమాల్లో పనిచేశాడు. తన తాలూకు స్క్రిప్టింగ్ స్కిల్స్, విజువల్ స్టోరీటెల్లింగ్ వల్ల కొన్ని అవకాశాలు వచ్చాయి.
లక్ష్మణ్ తీసిన ‘లుకా ఛుప్పీ’ సినిమాతో అతనికి నిజమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విజయవంతం కావడంతో, నటీనటులు అతనితో పని చేయడానికి ముందుకొచ్చారు. ఆ తరువాత ‘మిమ్మి’, ‘జర్రీ’, లాంటి సినిమాలు తెరకెక్కించి, సామాజిక అంశాలను వినోదంగా మలిచాడు. లక్ష్మణ్ ప్రతిభ, వినూత్న కథా తత్వం, ప్రేక్షకుడిని ఆకట్టుకునే శైలి వంటివన్నీ లక్ష్మణ్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.
అప్పుడే లక్ష్మణ్ ఇంకొక ఆశయం ఏర్పడింది. చరిత్ర వీరులను తెరపై అద్భుతంగా చూపించే సినిమా తీయాలనే ఆలోచన పుట్టింది. అదే ‘ఛావా’. ఇది ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడానికి, పరిశోధన చేయడానికి సంవత్సరాల సమయం పట్టింది. లక్ష్మణ్ తన పూర్వీకుల ప్రాంతం మహారాష్ట్ర చరిత్రను తెలుసుకునే క్రమంలో చాలామంది చరిత్రకారులను కలిశాడు.
ఈ సినిమాలో నటించేందుకు వికీ కౌశల్‌ను తీసుకున్నాడు. ఛావా మూవీ కోసం నిర్మించిన సెట్స్ గగుర్పాటెక్కించే స్థాయిలో ఉన్నాయి. శివాజీ మహారాజ్ రాజ్యం కాలం నాటి పాలకుల తీరు, కోటలు, యుద్ధ భూములు, రాజప్రాసాదాలు – అన్నింటిని అద్భుతంగా తిరిగి నిర్మించారు. ఈ సెట్స్ నిర్మాణానికి లక్ష్మణ్ తానే పర్యవేక్షించాడు. ప్రతి డీటైల్‌ను ఒప్పుకునేంతవరకూ వదలలేదు.
ఛావా చిత్రాన్ని పూర్తి చేయడానికి తీసిన సమయం, మానసిక ఒత్తిడి, అనేక అడ్డంకులు – ఇవన్నీ లక్ష్మణ్‌ను ఓ యోధుడిలా మారేలా చేశాయి. మధ్యలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, చరిత్ర వక్రీకరణ అనే విమర్శలు వచ్చాయి.
సినిమా విడుదలైన వెంటనే సంచలనం సృష్టించింది. 'ఛావా'లో చూపిన సంభాజీ మహారాజ్ గాథ, ఆయన ధైర్యం, అతని త్యాగం ఇవన్నీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి.
ఇది లక్ష్మణ్ ఉటేకర్‌కు సాధారణ విజయం కాదు. ఇది జీవితాన్ని కొత్త పంథాలో తీసుకెళ్లిన అద్భుత సంఘటన. తనను హీనంగా చూసినవాళ్లు ఇప్పుడు గర్వంగా చూస్తున్నారు. వడా పావ్ అమ్మిన వ్యక్తి గురించి, దేశమంతా మాట్లాడుకునే దర్శకుడయ్యాడు.
అతని ప్రయాణం మనకు చెప్పే కథ ఏమిటంటే – కలలు గన్న వాళ్లు పేదలు కావొచ్చు, కానీ కలల్ని నెరవేర్చుకునే ధైర్యం ఉన్నవాళ్లు గొప్పవాళ్లు. డబ్బులేదని, పరిచయాల్లేదని వెనక్కి తగ్గకూడదు. ప్రతిభ, కృషి, పట్టుదల ఉంటే ఏమైనా సాధ్యమే.
లక్ష్మణ్ ఉటేకర్ జీవితం యువతకు స్పూర్తిగా నిలుస్తోంది. సినిమాలు తీయాలనే కలలున్నా, అవకాశాలు లేక కూర్చున్న ప్రతి వ్యక్తికి అతని కథ ఓ మార్గదర్శకం
ఒక వడా పావ్ అమ్మే వ్యక్తి నుంచి, వందల కోట్ల చారిత్రక సినిమా డైరెక్టరుగా ఎదగడం అంటే మాటలు కాదు. లక్ష్మణ్ ఉటేకర్ కేవలం డైరెక్టర్ కాదు, తన పని మీద అభిమానం ఉన్న సాహసికుడు అని చెప్పొచ్చు.
మరి లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment