టీకొట్టులో పనిచేస్తూనే.. కలెక్టర్‌గా మారాడు!
రోజూ మనం టీ తాగుతాం. కానీ ఆ టీ కప్పుతో ఎవరి జీవితాలూ ఎలా మారిపోతున్నాయో మనకి తెలియదు. ఈ కథలో చెప్పబోయే అనిల్ చౌరాసియా అనే టీ కొట్టు వ్యక్తి.. తన టీ కొట్టుకు వచ్చే వ్యక్తులు మాట్లాడుకునే మాటలు వింటూ తన జీవితాన్ని మార్చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ అనే పట్టణంలో చిన్న టీ స్టాల్‌లో పని చేసే ఓ అబ్బాయి పేరు అనిల్. మిడిల్ క్లాస్ కుటుంబం. ఇంట్లో పరిస్థితి అంత బాగుండదు. పదవ తరగతి అయిపోయిన తర్వాత చదువు ఆపేశాడు. ఎందుకంటే తినడానికే డబ్బు లేకపోతే చదువు అయ్యే ఖర్చలు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే ఓ చిన్న స్టవ్, మూడు కప్పులతో టీ చేస్తూ అదే తన ప్రపంచంగా మార్చేసుకున్నాడు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ టీ తయారు చేస్తూ, కస్టమర్లతో నవ్వుతూ, జీవితాన్నినెట్టుకొస్తున్నాడు అనిల్. కానీ అసలైన మార్పు అతని చుట్టూ ఉండే మాటల వల్ల వచ్చింది. అనిల్ దగ్గరకు టీ కోసం వచ్చే వారిలో కొందరు ఉద్యోగులు, కొంతమంది స్టూడెంట్లు, ఇంకొందరు సీనియర్ ఆఫీసర్లు. వీళ్లందరూ మాట్లాడుకునే ప్రభుత్వ విధానాలు, పథకాలు గురించి వినేవాడు అనిల్.
మొదట్లో వాళ్లు మాట్లాడేవి అనిల్‌కు అర్థం కాలేదు కానీ వాటిపై ఆసక్తి పెరిగింది. ఇంటికి వెళ్లాక పాత పేపర్లు చదవడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్ లేదు. మొబైల్‌లో డేటా కూడా లేదు. కానీ పేపర్లే అతనికి టీచర్లు అయ్యాయి. రోజూ కొత్త పదాలు, కొత్త వార్తలు తెలుసుకుంటూ ఉన్నాడు.
ఒక రోజు ఓ ప్రొఫెసర్ టీ తాగుతూ, తన మిత్రులతో వారికి అవగాహణ లేని కొత్త ప్రభుత్వ పథకాలు గురించి మాట్లాడుతుండగా అనిల్ వాటి గురించి క్లియర్‌గా చెప్పడంతో ప్రోఫెసర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే. ప్రొఫెసర్ నువ్ చదువుకోలేదు కదా.. ఈ విషయాలు గురించి నీకు ఎలా తెలుసు అని అడిగాడు. దానికి అనిల్.. నేను రోజూ పేపర్ పాలో అవుతాను సార్. అలాగే ఇక్కడి వచ్చే వారు మాట్లాడుకునే మాటలు వినేవాడిని అందుకే నాకు వాటి కొంచెం అవగాహణ ఉందని చెప్పాడు. మరి నవ్ చదువుకోవచ్చు కదా అని ప్రెఫెసర్ అడిగాడు. దానికి అనిల్ మౌనంగా తలదించుకుని. చదవాలని ఉంది సార్, కానీ ఇంట్లో పరిస్థితులు సపోర్ట్ చేయలేదు అన్నాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పిన మాటలు అనిల్ జీవితాన్ని మార్చేశాయి. ‘నువ్వు చదవడం నీకు మాత్రమే కాదు, సమాజానికీ అవసరం. నువ్వు ఎంత స్థాయికి వెళ్లగలవో నీకు తెలుసుకోవడానికి ఇదే అవకాశం.’ అనే ప్రెఫెసర్ మాటలు అనిల్ మాటలు గుండెల్లో తాకాయి. ఆ రాత్రే స్టాల్ మూసిన తర్వాత అనిల్ ఓ పాత నోటుబుక్ తీసుకుని. తన కల అయిన 'MPPSC' అని రాసుకున్నాడు. ఆ తర్వాతి రోజులు అనిల్‌కు పూర్తిగా కొత్తవిగా మారాయి. తన పని చేసుకుంటూనే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం మొదలెట్టాడు. మొదట అర్థం కాకపోయినా, వాటిని వదల్లేదు.
మూడు నెలలు అయ్యేసరికి, అతనికి కొన్ని పేపర్లు, పుస్తకాలు దొరికాయి. కొంతమంది రెగ్యులర్ కస్టమర్లు అతనికి సపోర్ట్ చేశారు. ఒకరు ఓ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు. ఇంకొకరు, హైద్రాబాద్‌లో చదువుతున్న తన తమ్ముడు నోట్స్ షేర్ చేశాడు. ఇంకొకరు ఎక్సెల్‌లో టైమ్ టేబుల్ ఎలా తయారు చేయాలో చూపించాడు. అతను మొట్టమొదటి సారి టైమ్ మేనేజ్‌మెంట్ అనే మాట అర్థం చేసుకున్నాడు.
అనిల్ అందరూ నిద్రపోయే టైంలో లైటు వేసుకుని చదివేవాడు. తెల్లవారేదాకా, కనీసం రోజుకి 4-5 గంటలు. అతని జీవితం ఒకేలా నడుస్తున్నట్టే కనిపించేది కానీ ప్రోఫెసర్ చెప్పిన మాట, ఎదుటివారి విజయం చూసిన ప్రతిసారి మరింత పట్టుదల వచ్చేది.
అనిల్‌కు MPPSC అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాకముందే పరీక్షలు రాయడం మొదలుపెట్టాడు. మొట్టమొదటి సారి MPPSC ప్రిలిమ్స్ రాసాడు. ఫెయిలయ్యాడు. రెండోసారి కూడా అదే ఫలితం. మూడోసారి రాసినప్పుడు కొంత మెరుగైన రిజల్ట్ వచ్చినా, ఎంపిక కాలేదు. అయితే అనిల్ ప్రయత్నం ఆపలేదు. ‘నేను ఇప్పటివరకు ఓడిపోలేదు.. కేవలం ఫెయిల్ అయ్యాను. ప్రయత్నం ఆపితేనే నిజంగానే ఓడినట్టవుతుంది. అనే ఆత్మవిశ్వాసం అతన్ని ముందుకు నడిపింది.
చివరకు నాలుగోసారి పరీక్ష రాసాడు. ఈసారి అతని కృషికి ఫలితం దక్కింది. MPPSC పరీక్షను క్లియర్ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. అతను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నాడు.
ఇప్పుడు అనిల్ ప్రభుత్వ సర్వీస్‌లో జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. నెలలో ఒకసారి తన టీ స్టాల్ దగ్గరికి వచ్చి చూసుకుని పోతాడు. ఇప్పటికీ ఆ చోటు వద్ద ఒక బోర్డు ఉంది. దానిమీద ‘ఇక్కడ ఒకప్పుడు ఓ టీ వాడు పని చేసేవాడు… ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ అధికారి’అని ఉంటుంది.
అనిల్ కథ ఒక వ్యక్తిగత విజయం కాదు. ఇది లక్షల మందికి స్పూర్తినిచ్చే ప్రయాణం. మనలో ప్రతిఒక్కరిలోనూ ఒక కల ఉంటుంది. ఆ కలను నిలబెట్టుకోవడమే అసలైన గెలుపు. చిన్న మార్పులు, చిన్న మాటలు, కొన్ని పుస్తకాలు, కొన్ని త్యాగాలు ఇవే మన జీవితాల్ని మార్చగలవు.
నిజానికి జీవితాన్ని మార్చడానికి పెద్ద అవకాశం రావాలనే అవసరం లేదు. ఒక చిన్న మాట, ఒక మంచి ప్రేరణ, ఒక సాధారణ రోజు… ఇవే ఒక అసాధారణ మార్పుని తీసుకోస్తాయి.. మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, మన ప్రయత్నం గొప్పదైతే విజయం మనది అవుతుంది.
మరి అనిల్ అసాధారణ ప్రయాణం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment