అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుడు... 



హుటాహుటిన సింగపూర్ కు డిప్యూటీ సీఎం 

 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రద్దయింది. ఈ మేరకు అధికారులకు సమాచారం అందించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డారు దీంతో ఆయనకు సింగపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పవన్ కళ్యాణ్ తన విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు ఈ రోజు సాయంత్రం తన అరకు పర్యటనకు పూర్తి చేసుకొని విశాఖ ఎయిర్పోర్ట్  చేరుకొని సింగపూర్లో చికిత్స తీసుకుంటున్న తన కుమారుడు మార్క్స్ శంకర్ వద్దకు వెళ్ళనున్నారు

 


 సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్స్ శంకర్ సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది ఇందులో మార్క్ శంకర్ చిక్కుకోవడంతో శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి దట్టమైన పోగా కారణంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు దీంతో తోటి విద్యార్థులతో పాటు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అయిన మార్క్ శంకరును ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు 


 అయితే ప్రస్తుతం శంకర్ ఆరోగ్య పరిస్థితి స్పష్టమైన సమాచారం అందక పోయినప్పటికీ ఓ తండ్రిగా పవన్ కళ్యాణ్ పుట్టగొడిన సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే ఏజెన్సీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తన పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ సింగపూర్ కు వెళ్లనున్నారు

 


 అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ తో పాటు తన పెద్ద కుమారుడైన అఖీరా నందన్ కూడా సింగపూర్ వెళ్ళబోతున్నాడు అందరూ ప్రార్థించండి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని


Comments

Popular posts from this blog