మీకు రూ.92 లక్షలు కావాలా? అయితే ఆ దేశంలో ఉంటే చాలు



మన ఊర్లో ఓ ఇల్లు కొనాలంటే… లోన్స్, బ్యాంకు వడ్డీలు, డాక్యుమెంట్లు, ఇంటి పాస్‌బుక్ కోసం రెండేళ్లపాటు చుట్టూ తిరిగితే కానీ పని జరగదు. కానీ, ఓ దేశం మాత్రం.. ‘రా బాబూ, ఇల్లు కొనుగోలు చెయ్.. పైగా దాదాపు కోటి రూపాయలు ఫ్రీగా తీసుకో!’ అంటూ ఆహ్వానిస్తోంది.


ఆ దేశం ఏంటి? అక్కడున్న ఆఫర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 


ఈ అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న దేశం పేరు ఇటలీ. మీరు గాని ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం. ఇక్కడ సెటిల్ అయితే అక్కడి ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది.


ఉత్తర ఇటలీలోని కొన్ని పల్లెలు నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం యువత పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో గ్రామాల్లో నివసించే వాళ్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ జనాభా క్షీణతను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కొత్తగా ఒక ప్రయోగం మొదలెట్టింది.


ఇటలీ దేశస్థులైనా.. ఇతర దేశస్థులైనా ఇటలీలోని వర్మిగ్లియో గ్రామంలో స్థిరపడాలనకుంటే వారికీ అక్కడి ప్రభుత్వం రూ. 92 లక్షల వరకూ ఫ్రీగా ఇస్తుంది. 


ఈ ఆఫర్ పేపర్ మీద చూస్తే అదిరిపోతుందనిపిస్తుంది. ఇటలీలో ఒక అందమైన గ్రామంలో సెటిల్ అవ్వడం, పైగా ప్రభుత్వం డబ్బు ఇవ్వడం—ఇదంతా ఫ్రీగా దొరికిన జాక్‌పాట్‌లా అనిపించొచ్చు! కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఈ డబ్బును పొందడం అంత ఈజీ కాదు.


ఎందుకంటే ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీకు కేటాయించిన ఇంటిని బాగుచేయించుకోవడానికి సరిపోతుంది. అంటే ఇప్పటికే ట్రెంటీనో ప్రాంతంలో చాలా మంది తమ సొంత ఇళ్లను కూడా వదిలేసి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ ఇళ్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. చాలా కాలంగా ఇలా ఉండటంతో చాలా వరకు పాడైపోయాయి. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఆ ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి రూ.92 లక్షలు అంటే ఇటలీ కరెన్సీ ప్రకారం 100,000 యూరోలు ఇస్తుంది.



ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇంటిని కొని, రిపేర్ చేయించుకోవాలి. లేదా కొత్త ఇంటిని కొనుక్కోవాలి. అంతేకాదండోయ్.. ఇంకా కొన్ని షరతులు కూడా ఉన్నాయి. 


ఇటలీ ప్రభుత్వ డబ్బు తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో కనీసం 10 సంవత్సరాలు నివసించాలి. ఒక వ్యాపారం ప్రారంభించడం లేదా స్థానిక ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలి. ఈ ప్రాంతంలో నివసించడానికి వచ్చే ఇతర ప్రజలకి సహాయం చేయాలి. అంటే ఇక్కడ ప్రజల అవసరాలకు తగిన వ్యాపారాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇదంతా జరగాలంటే..ముందు మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.  అలాగే ఇటలీ భాష నేర్చుకోవాల్సి ఉంటుంది.


మరీ ఈ షరతులు అన్నింటికీ మీరు ఒకే అనుకుంటే.. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, వర్మిగ్లియో గ్రామంలో ఉండేందుకు అవసరమైన అప్లికేషన్‌ను ఫిల్ చేసి, పాస్‌పోర్ట్, విద్యార్హత సర్టిఫికెట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌‌లు వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి ఇంటర్వ్యూకు అటెంట్ అవ్వండి.


మరి ఈ ఆఫర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 


Comments

Popular posts from this blog