శ్రీదేవీ మరణం నాచురల్ డెత్ కాదు.. బోనీకపూర్ లై డిటెక్ట్!


సినిమా పరిశ్రమలో లెజెండ్‌గా నిలిచిన శ్రీదేవీ, దుబాయ్‌లోని హోటల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించి మనకు దూరమైన విషయం అందరికీ తెలిసింది. 2018లో జరిగిన ఆ షాకింగ్ ఘటన ఇప్పటికీ మనల్ని కలచివేస్తుంది. బాత్‌టబ్‌లో డ్రౌన్ అయినట్లు చెప్పిన అధికారిక రిపోర్ట్‌ను చాలామంది నమ్మలేదు. సోషల్ మీడియాలో కాన్స్‌పిరసీలు, శ్రీదేవీ భర్త బోనీ కపూర్ మీద అనుమానాలు వెల్లువెత్తాయి. ఇన్నేళ్లు మౌనంగా ఉన్న బోనీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు. అతను చెప్పిన నిజాలు, లై డిటెక్టర్ టెస్ట్ గురించి, ఇండియా మీడియా ఒత్తిడి గురించి వివరాలు అందరికీని ఆశ్చర్యపరిచాయి. ఈ వీడియోలో, ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 


శ్రీదేవీ మిస్టర్ ఇండియా, చాందినీ, ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి సినిమాలతో భారత సినిమాకు ‘ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్’ ట్యాగ్ సంపాదించిన గొప్ప నటి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఒక ఫ్యామిలీ వెడ్డింగ్‌కి వెళ్లిన ఆమె, జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ రూమ్ బాత్‌టబ్‌లో డ్రౌన్ అయి చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. అధికారికంగా ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’అన్నారు, కానీ ఇందులో ఏదో రహస్యం ఉందని ఫ్యాన్స్ నమ్మారు. శ్రీదేవీ లాంటి ఫిట్‌నెస్ ఫ్రీక్, స్టార్ ఇలా ఎలా చనిపోతుంది? బోనీ కపూర్‌పై హత్య ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలు సోషల్ మీడియాను షేక్ చేయడం చూశాము. దీంతో అప్పట్లోనే బోనీ కపూర్ కొంత వివరణ ఇచ్చాడు. అయితే, తాజాగా చెప్పిన కొన్ని విషయాలు ఈ కేస్‌ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి.


బోనీ చెప్పిన మొదటి మాట..‘శ్రీదేవీ మరణం నాచురల్ డెత్ కాదు, యాక్సిడెంటల్ డెత్.’ అప్పట్లో దుబాయ్ పోలీసులు ఈ కేస్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు, ఎందుకంటే ఇండియా మీడియా నుంచి భారీ ఒత్తిడి వచ్చింది. ‘ఇండియన్ మీడియా ప్రెషర్ వల్ల మేము ఈ కేస్‌ను ఇంత డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది,’ అని దుబాయ్ అధికారులు బోనీతో చెప్పారట. ఈ ఒత్తిడి వల్ల బోనీని దాదాపు 24 నుంచి 48 గంటల పాటు విచారించారు. CCTV ఫుటేజ్, హోటల్ స్టాఫ్ స్టేట్‌మెంట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశారు. అంతేకాదు, బోనీని లై డిటెక్టర్ టెస్ట్ సహా ఇతర టెస్ట్‌లకు కూడా సబ్జెక్ట్ చేశారట! ఈ లై డిటెక్టర్ టెస్ట్‌లో అతని స్టేట్‌మెంట్స్‌ను, బాడీ రియాక్షన్స్‌ను టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేశారు, అతను నిజం చెబుతున్నాడా లేక అబద్ధం చెబుతున్నాడా అని తెలుసుకోవడానికి. బోనీ చెప్పాడు, ‘నేను అన్ని టెస్ట్‌లను ఫేస్ చేశాను, లై డిటెక్టర్ టెస్ట్ కూడా. చివరకు, దుబాయ్ పోలీసులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్‌లో శ్రీదేవీ మరణం యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని క్లియర్‌గా చెప్పారు.’ అని వివరించాడు. ఈ 


బోనీ కపూర్ చెప్పిన ఇంకో షాకింగ్ ఏంటేంటే..  శ్రీదేవీ హెల్త్ సీక్రెట్స్! బోనీ చెప్పిన ప్రకారం.. శ్రీదేవీ తన బాడీ ఇమేజ్ గురించి చాలా సీరియస్‌గా ఉండేది. సినిమాల్లో అందంగా, ఫిట్‌గా కనిపించడానికి ఆమె కఠినమైన క్రాష్ డైట్స్ ఫాలో చేసేది. ఆమె సాల్ట్‌ను పూర్తిగా అవాయిడ్ చేసేది. ఒక్కోసారి బ్లాక్‌ అవుట్ అయ్యేదట. డాక్టర్ ఆమెకు లో బీపీ ఇష్యూ గురించి వార్న్ చేసినా, ఆమె సీరియస్‌గా తీసుకోలేదట. ఒకసారి నాగార్జునతో షూటింగ్‌లో ఆమె క్రాష్ డైట్ వల్ల బాత్‌రూమ్‌లో ఫాల్ అయి పళ్లు విరిగాయని కూడా బోనీ తెలిపాడు. ఆ రోజు బాత్‌టబ్‌లో ఆమె బ్లాక్‌ అవుట్ అయి డ్రౌన్ అయి ఉండొచ్చని డాక్టర్స్ చెప్పారట.


ఇక శ్రీదేవి చనిపోయిన ఆ రాత్రి గురించి బోనీ ఇంటర్య్వూలో వివరంగా చెప్పాడు. బోనీ చెప్పిన ప్రకారం.. అతను ముంబై నుంచి దుబాయ్‌కు సర్‌ప్రైజ్‌గా వెళ్లాడు. శ్రీదేవీ రూమ్‌లో సాయంత్రం 5:30కి  శ్రీదేవిని డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆమె రెడీ అవ్వడానికి బాత్‌రూమ్‌కు వెళ్లింది. 15 నిమిషాలు రాకపోవడంతో బోనీ డోర్ నాక్ చేశాడు. స్పందన లేకపోవడంతో బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే.. ఆమె బాత్‌టబ్‌లో మోషన్‌లెస్‌గా కనిపించింది. వెంటనే బోనీకపూర్ రివైవ్ చేయడానికి ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు, ఫై ఆమెను సేవ్ చేయలేకపోయాడు.


బోనీ ఈ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెబుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ‘నేను శ్రీదేవీని ఎంతగా లవ్ చేశానో, ఆమె లేని ఈ జీవితం నన్ను ఎంత బాధపెడుతోందో ఎవరికీ తెలీదు’ అని బాధపడ్డాడు. లై డిటెక్టర్ టెస్ట్, మీడియా ఒత్తిడి, రూమర్స్ ఇవన్నీ అతన్ని మానసికంగా బాధ పెట్టాయని తెలిపాడు.


ఏది ఏమైనప్పటికీ.. శ్రీదేవీ మరణం ఒక ట్రాజెడీ, అది బోనీ జీవితంలో ఓ శాశ్వతమైన గాయం. కానీ, శ్రీదేవి చేసిన సినిమాలు, ఆమె నవ్వు ఎప్పటికీ అభిమానులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.



Comments

Popular posts from this blog