మస్క్ ఎంతటి రసికుడో తెలుసా? కోట్లాది పిల్లలను కనాలనుకుంటున్నాడు! మరో ఛంగిజ్ ఖాన్‌లా మారతానంటున్న మస్క్!
ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడు, అపర మేధావి మాత్రమే కాదు. అంతకుమించిన రసికుడు కూడా. అతని రాసలీలలు ఏ స్థాయిలో ఉన్నాయో.. సంతానం విషయంలో అతని ఆలోచనలు ఎక్కడిదాకా వెళ్లిపోయాయో తెలిస్తే షాక్ అవుతారు. మస్క్ ప్రస్తుత ప్లాన్ కేవలం పిల్లలను కనడమే. అది కూడా కోట్లలలో ఇది సినిమా కథ కాదు, నిజంగా లీక్ అయిన షాకింగ్ సీక్రెట్!
ఎలాన్ మస్క్ ఈ విచిత్రమైన ప్లాన్ ఏంటి, అతను ఎందుకు ఇలాంటి క్రేజీ ఆలోచనలు చేస్తున్నాడు. ఈ వివాదం ఎలా బయటపడిందో తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్, X లాంటి కంపెనీల సృష్టికర్త. కానీ, అతని జీవితంలో ఒక సీక్రెట్ సైడ్ ఉంది, అది ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం.. మస్క్ తన జన్యువులతో ఒక ‘లీజన్’ అనే భారీ సంఖ్యలో పిల్లలను సృష్టించాలని కలలు కంటున్నాడు! అవును, మస్క్ ఇప్పటికే 14 మంది పిల్లల తండ్రి, నలుగురు వేర్వేరు మహిళలతో పిల్లలను కలిగి ఉన్నాడు. కానీ, ఇది కేవలం ఆరంభం అని సోర్సెస్ చెబుతున్నాయి! మరిన్ని పిల్లలు ఉండొచ్చని రూమర్స్ కూడా ఉన్నాయి.
నిజానికి మస్క్ ఒక విచిత్రమైన భయం గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. అదేప్రపంచ జనాభా తగ్గిపోతుందని, ఇది సివిలైజేషన్‌కు అతిపెద్ద ముప్పు అని. అందుకే, అతను తన జన్యువులతో స్మార్ట్, గిఫ్టెడ్ పిల్లలను సృష్టించి, భవిష్యత్తును రక్షించాలని నమ్ముతున్నాడని అంటున్నారు.. ఈ ఆలోచన అతని మార్స్ ప్లాన్‌తో కూడా లింక్ అయ్యింది. అవును, మార్స్‌లో మానవ జాతిని స్థిరపరచడానికి స్మార్ట్ జనరేషన్ కావాలని అతని డ్రీమ్! కానీ, ఈ ప్లాన్‌ను అమలు చేయడానికి మస్క్ ఏం చేతిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో మహిళలతో డైరెక్ట్ మెసేజెస్ ద్వారా కనెక్ట్ అవుతాడట. కొందరితో ఈ చాట్స్ రొమాంటిక్‌గా మారి, పిల్లల గురించి డిస్కషన్‌కు వెళ్తాయని సోర్సెస్ చెబుతున్నాయి. ఉదాహరణకు, యాష్లీ స్ట్ క్లెయిర్ అనే కన్సర్వేటివ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో మస్క్ 2023లో Xలో కనెక్ట్ అయ్యాడు. వీరి సంబంధం త్వరగా డెవలప్ అయ్యి, న్యూ ఇయర్ ట్రిప్‌లో వారు ఒక బిడ్డను కన్నారని ఆమె క్లెయిమ్ చేసింది. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మస్క్ ఈ బిడ్డను సీక్రెట్‌గా ఉంచమని, తన పేరును బర్త్ సర్టిఫికెట్‌లో చేర్చొద్దని ఆమెను ఒత్తిడి చేశాడని ఆరోపణలు! యాష్లీ ఈ సీక్రెట్‌ను బయటపెట్టడంతో, మస్క్ ఆమెకు ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్‌ను తగ్గించాడని, లీగల్ బెదిరింపులు కూడా ఎదుర్కొందని ఆమె చెప్పింది.
ఇది ఒక్క యాష్లీ కథ మాత్రమే కాదు. మస్క్ తన పిల్లల తల్లులతో డీల్ చేయడానికి ఒక స్పెషల్ ‘ఫిక్సర్’ ని, జారెడ్ బిర్చాల్‌ని ఉపయోగిస్తాడట. ఈ వ్యక్తి మహిళలతో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ సైన్ చేయిస్తాడు. మిలియన్ల డాలర్లు ఆఫర్ చేస్తూ వారిని సైలెంట్‌గా ఉంచమని చెబుతాడు. యాష్లీకి దాదాపు 15 మిలియన్ డాలర్ల ఆఫర్ వచ్చిందని, కానీ ఆమె తన బిడ్డను సీక్రెట్‌గా ఉంచడం ఇష్టం లేక లీగల్ ఫైట్ ఎంచుకుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలాంటి ఒత్తిళ్లు ఇతర మహిళలు, గ్రైమ్స్ వంటి వారు కూడా ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే.. మస్క్ తన పిల్లలను ఒకే చోట ఉంచడానికి ఆస్టిన్‌లో 35 మిలియన్ డాలర్లతో ఒక భారీ కాంపౌండ్ కూడా కొన్నాడు! ఈ కాంపౌండ్‌లో అతని 11 మంది పిల్లలు, వారి తల్లులు కలిసి ఉండాలని అతని ప్లాన్. ఇంకా, సరోగసీ ద్వారా మరిన్ని పిల్లలను కనాలని చూస్తున్నాడట. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది కదూ?
ఇలాంటి ఆలోచన కేవలం మస్క్‌కే కాదు.. చరిత్రలోని ఒక లెజెండరీ అయిన ఛంగిజ్ ఖాన్‌కు కూడా వచ్చింది. 13వ శతాబ్దంలో మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛంగిజ్ ఖాన్, తన జన్యువులను విస్తరించడానికి వేలాది మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, అతని వారసులు ఆసియా జనాభాలో దాదాపు 0.5% ఉన్నారు. మస్క్ కూడా తన స్మార్ట్ జన్యువులతో భవిష్యత్తును ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఛంగిజ్ యుద్ధభూమిలో చేసిన పనిని మస్క్ టెక్నాలజీ అండ్ డబ్బుతో చేస్తున్నాడు. ఇద్దరి లక్ష్యం ఒకటే తమ వారసత్వాన్ని శాశ్వతం చేయడం! కానీ, ఛంగిజ్ ఓపెన్‌గా చేశాడు. మస్క్ సీక్రెట్‌గా చేయడానికి ట్రై చేశాడు.
కానీ, మస్క్‌కు ఈ ప్లాన్ అంత సులభం కాదు. మస్క్ ఈ సీక్రెట్‌ను కాపాడుకోవడానికి చాలా ట్రై చేశాడు. లీగల్ ఒత్తిళ్లు, మిలియన్ల డాలర్ల ఆఫర్స్, NDAs. కానీ, యాష్లీ లాంటి మహిళలు దీని గురించి మాట్లాడడంతో ఈ ‘లీజన్’ ప్లాన్ బయటపడింది. మస్క్ నిజంగా మానవ జాతిని రక్షించాలనుకుంటున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
.jpeg)
Comments
Post a Comment