185 ఏళ్ల నుంచి ఇప్పటికీ మోగుతున్న బెల్.. 

శాస్త్రవేత్తలకే అర్థం కాని మిస్టరీ

నేటి టెక్నాలజీ అద్భుతాల్ని సృష్టిస్తోంది. ఏ మెషిన్ చూసినా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం ఇస్తోంది. కానీ, ఇదంతా  కొత్తకాదని, శతాబ్దాల కిందట కూడా కొన్ని అద్భుతాలు జరిగాయని చెబుతున్నారు నిపుణులు. ఆ అద్భుతాల్లో ఒకటే, 185 ఏళ్లుగా పని చేస్తున్న ఒక చిన్న ఎలక్ట్రిక్ బెల్. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? 185 ఏళ్ల నుంచి ఎలక్ట్రికల్ బెల్ పనిచేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. ఈ బెల్ 1840లో మొదటిసారిగా మోగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు శతాబ్దాలుగా అది ఒక్కసారైనా ఆగిందన ఆధారాలే లేవు. దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 


సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ గానీ, మరే వస్తువైనా గానీ ఎన్ని రోజులు పనిచేస్తుంది? మహా అయితే ఆర్నెల్లు, అంతకు మించితే ఏడాది చేయవచ్చు. కానీ,  ఆక్స్‌ఫర్డ్‌లోని క్లారెండన్ లాబొరేటరీలో ఉన్న ఈ గంట ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఈ బెల్ విద్యుత్ ఆధారంగా నడుస్తోంది. కానీ అది ఏ సౌరశక్తి కాదు, నేడు మనం వాడుతున్న లిథియమ్ బ్యాటరీలు కూడా కావు. ఇది ‘డ్రై పైల్’ అనే అరుదైన బ్యాటరీ సాంకేతికత మీద ఆధారపడి ఉంది. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తోంది.


దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి చూస్తే, ఇంతకాలం ఏ మెషిన్ పని చేయడం అసాధ్యమే. కానీ ఈ బెల్ మాత్రం ఇప్పటికీ పనిచేయడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు నిపుణులు. ఈ బెల్ డిజైన్ చాలా సాధారణంగా కనిపిస్తుంది. అయితే, 185 ఏండ్ల కిందట తయారు చేసిన ఆక్స్‌ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్ ఇప్పటి వరకు సుమారు 10 బిలియన్ సార్లు మోగిందని, భూమిపై అత్యంత మన్నికైన బ్యాటరీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. 


కాగా,  అప్పట్లోనే ఇంత మన్నికగల సాంకేతికత ఎలా సాధ్యమైంది? దానిలో ఏ పదార్థాలు వాడారు? అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. ఇది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఆక్స్‌ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్ విషయంలో పరిశోధనలు జరపాలనుకుంటున్నారు. అయితే అది ఎప్పుడైతే పనిచేయడం ఆగిపోతుందో అప్పుడు మాత్రమే పరిశోధన ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు.


ఇవాళ మనం ఎంత టెక్నాలజీ అభివృద్ధి చేశాం అంటే, గంటలలో రాకెట్‌లను పంపే స్థాయికి వచ్చాం. కానీ. రెండు శతాబ్దాల క్రితమే తయారైన ఈ చిన్న బెల్ విషయంలో మాత్రం ఇంకా సమాధానాలే దొరకలేదు. ఇది మానవ చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోతుందా? లేక ఏదో ఒకరోజు ఆగినప్పుడు దాని లోపలి రహస్యాలు బయటపడతాయా? అన్నది కాలమే చెప్పాలి. 


మరి ఈ ఎలక్ట్రికల్ బెల్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.


Comments

Popular posts from this blog