తల్లిపై కన్నేసిన పక్కింటి అంకుల్.. కూతురు ఏం చేసిందంటే?

ఇది ఒక అమ్మాయి గురించి కాదు... ఒక అమ్మ గురించి కాదు... ఇది ప్రేమించే వాళ్లను కాపాడుకోవడం కోసం ఓ చిన్నారి సింహంగా మారిన సంఘటన గురించి.

అది ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న ఓ సాదాసీదా కాలనీ. ఇలాంటి చోట పెరిగే పిల్లలకు చదువు, భవిష్యత్తు, భయం అన్నీ ఒకేసారి పరిచయం అవుతాయి. అక్కడే ఉంటోంది అనిత. ఆమె సింగిల్ మదర్. తన భర్త విడాకులిచ్చాక, తన 14 ఏళ్ల కూతురు శ్రేయతో కలిసి జీవిస్తోంది.


వారి పక్కింట్లో ఉండేవాడే నరేశ్. 45 ఏళ్ల వయసు, ఉద్యోగరిత్యా బైకు మీద తిరుగుతుంటాడు. ఒక్కోసారి పనిమీద బయట ఊరికి కూడా  వెళ్తుంటాడు. నరేశ్ పొరిగింటి వ్యక్తి కాబట్టి అనిత వంటపనిలో కొంచెం సాయం చేసేది. మొదట అనితాకి, శ్రేయకి అతను మంచి మిత్రుడే అనిపించింది. కానీ అలా అనిపించడమే అతడి టార్గెట్.


ఒక రోజు రాత్రి.. అనితకి జ్వరం వచ్చింది. ఆరోజే శ్రేయ హాస్టల్‌కి వెళ్లాల్సిన రోజు. కానీ తల్లి పడుకుని ఉంది కాబట్టి, పోవడం మానేసింది. శ్రేయ ఉందన్న విషయం తెలియని నరేశ్ నీళ్లు కావాలంటూ అనిత ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు శ్రేయ కిచెన్‌లో ఉంది. ఆ గదిలోంచే బయటకు చూస్తోంది. తన తల్లి మంచంపై పడుకుంటే ఆమె భుజంపై చేతి వేయడం చూసింది.


శ్రేయకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. అదే టైంలో శ్రేయ గొంతు ఒక్కసారిగా మూగబోయింది. వెంటనే ఆ స్థితి నుంచి తేరుకుని ఫోన్ తీసుకుంది. వీడియో రికార్డ్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే నరేశ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాడు. శ్రేయ ఫోన్ పట్టుకుని రికార్డ్ చేస్తున్నట్లు అనిపించింది. ‘నువ్వు ఏం రికార్డ్ చేస్తున్నావ్?’ అని గట్టిగా అరవడంతో నిద్రలో ఉన్న శ్రేయ తల్లి లేచింది.


షడన్‌గా నిద్ర లేచిన అనిత ‘ఏమైంది?’ అని అనగానే శ్రేయ పరిగెత్తుకుంటూ వెళ్లి తన మొబైల్ తల్లి చేతిలో పెట్టింది. నిమిషం పాటు నిశ్శబ్దం. ఆ తల్లికి ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకునేలా అనిపించింది. వీడియో చూసిన అనిత భయంతో వణికిపోయింది.


తాను దొరికిపోయానని అర్థమైన నరేశ్.. నువ్ తీసిన వీడియో డిలీట్ చేయ్. లేదంటే మీ ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఈ విన్న అనిత భయపడిపోతుంటే.. శ్రేయ మాత్రం వెళ్లి మొబైల్ తీసుకుని 112కి కాల్ చేసి.. ‘My neighbour tried to molest my mom’ అని చెప్పింది. దీంతో భయపడిపోయిన నరేశ్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నంచాడు. కానీ. శ్రేయ తెలివిగా తన ఇంటి డోర్ క్లోజ్ చేసి తాళం వేసి, ‘మా అమ్మను ఎవరైనా టచ్ చేస్తే… వదిలిపెట్టేది లేదు’ అని గట్టిగా అరిచింది. దీంతో నరేశ్ వారిపై చేసేందుకు ప్రయత్నంచాడు. ఈలోపు అక్కడికి పోలీసు జీప్ వచ్చేసింది. పోలీసులు నరేశ్‌ను అరెస్ట్ చేశారు. వీడియో సాక్ష్యంగా, తల్లి కూతురు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అతడిపై కేసు నమోదు చేశారు. 


సాధారణంగా ప్రతి కథలో పెద్దవాళ్లే పిల్లలను కాపాడతారు. కానీ ఈ కథలో ఒక చిన్నారి తన సమయస్పూర్తితో తన తల్లికి జరగబోయిన అన్యాన్ని ఎదిరించింది. 


మరి శ్రేయ ధైర్యం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 

Comments

Popular posts from this blog