అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా లైన్ వేస్తున్నారు! సర్వే చెప్పిన సరికొత్త నిజాలు!


అమ్మాయిల అందానికి ఫిదా కాని అబ్బాయి ఎవరైనా ఉంటారా? ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకసారి అమ్మాయిల అందం ముందు అబ్బాయిల గుండె జారి గల్లంతు అవడం సహజం! ఈ విషయంపై ‘కోడాక్ లెన్స్ విజన్ సెంటర్స్’ అనే సంస్థ 3000 మందిపై చేసిన సర్వే ఫలితాలు నోరెళ్లబెట్టేలా ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని చూస్తూ రోజుకు ఏకంగా 43 నిమిషాలు గడుపుతున్నారట! ఇది సంవత్సరానికి 259 గంటలు, అంటే దాదాపు 11 రోజులు! అంటే అబ్బాయిలు ఏడాదిలో దాదాపు రెండు వారాల పాటు అమ్మాయిల అందాన్ని ఆస్వాదిస్తూ కాలం గడుపుతున్నారు.


ఈ సర్వే ప్రకారం, ఒక సగటు పురుషుడు రోజుకు 10 మంది అమ్మాయిలను చూస్తున్నాడట. ఎక్కడంటే.. సూపర్‌మార్కెట్‌, బస్తాండ్‌లు ఈ విషయంలో టాప్‌లో ఉన్నాయి!  ఆ తర్వాత పబ్‌లు, నైట్‌క్లబ్‌లు, వర్క్‌ప్లేస్‌లు కూడా ఈ లిస్టులో హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సగం మంది అబ్బాయిలు ‘అమ్మాయిల శరీరాకృతినే చూస్తాం’ అని ఒప్పుకున్నారు!


అయితే, ఈ అబ్బాయిల చూపులను చాలామంది అమ్మాయిలు ఆనందంగా తీసుకుంటారట, అంటే కాంప్లిమెంట్ అన్నట్లు ఫీలవుతున్నారట. కానీ, 16% మంది ఇలాంటి అబ్బాయిల చూపులను అసౌకర్యంగా ఫీలవుతారట. 20% మంది సిగ్గుపడతారట. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 35% మంది అబ్బాయిలు ఈ చూపుల మధ్యనే లవ్‌లో పడిపోయి, రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారట! కానీ, అదే సమయంలో మూడో వంతు మంది అబ్బాయిలు తమ భాగస్వాములతో ‘ఎవరిని చూస్తున్నావ్?’ అంటూ గొడవలు పడ్డారట. 


ఇక అమ్మాయిల విషయానికొస్తే, వాళ్లూ తక్కువేం కాదని సర్వే చెబుతోంది. అమ్మాయిలు రోజుకు సగటున 20 నిమిషాలు అబ్బాయిలను చూస్తారు, అదీ కూడా 6 మంది అబ్బాయిలను! 18 ఏళ్లు దాటిన అమ్మాయిలు సుమారు ఆరు నెలలు ఇలా అబ్బాయిలను ఆస్వాదిస్తూ గడపటానికి ఇష్టపడతారట. ఇంకా ఆసక్తికరమైన విషయం 40% కంటే ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిల కళ్లు తమను ఎక్కువగా ఆకర్షిస్తాయని చెప్పారు. అంటే, అబ్బాయిల లుక్‌లోనే మాయ ఉందన్నమాట!


ఈ సర్వేని బట్టి చూస్తే.. అందాన్ని ఆస్వాదించడం అనేది ఇటు అబ్బాయిలకూ, అటు అమ్మాయిలకూ ఒక సహజమైన, ఆనందమైన అనుభవం. కానీ, ఈ చూపులు కొన్నిసార్లు లవ్ స్టోరీలను రాస్తాయి, మరికొన్నిసార్లు చిన్న గొడవలను తెస్తాయి. మరి మీకెప్పుడైనా కేవలం చూపులతోనే ప్రేమ పుట్టిందా? లేక గొడవలు తెచ్చి పెట్టిందా


Comments

Popular posts from this blog