కిమ్ రూల్స్ తెలిస్తే.. పిచ్చెక్కుతుంది! పాపం నార్త్ కొరియా ప్రజలకు.. ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు! ఉత్తర కొరియా దేశాన్ని భూమిపైనే ఉన్న మరో ప్రపంచమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటుగా ఉంటుంది. ప్రపంచంతో సంబంధం లేని ఆ దేశంలో జీవించడం అంత ఈజీ కాదు. అక్కడి పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ఉత్తర కొరియా నియంత కిమ్ అత్యంత కఠినంగా ఉంటాడు. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు, విధించే ఆంక్షలు మనకు చిత్రంగా అనిపిస్తాయి. కానీ, నార్త్ కొరియా ప్రజలకు మాత్రం అవి తప్పని తిప్పలు. మరి కిమ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర కొరియాలో జీవితం అంటే ఒక విచిత్రమైన కల కంటే తక్కువేమీ కాదు. ఇక్కడ ప్రతి చిన్న విషయంపై నియంత్రణ ఉంటుంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం మధ్యయుగ శైలిలోనే బతుకుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ప్రజలు శ్వాస కూడా తీసుకోవడం కష్టమే!ఇలాంటి ఉత్తర కొరియాలోని రూల్స్ గురించి మాట్లాడుకోవడమంటే కిమ్ జాంగ్ ఉన్ గురించి మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇతగాడు ఒక దేశాన్ని పాలిస్తున్నాడా లేక ఒక భారీ రియాలిటీ షో ...