Posts

Image
 185 ఏళ్ల నుంచి ఇప్పటికీ మోగుతున్న బెల్..  శాస్త్రవేత్తలకే అర్థం కాని మిస్టరీ నేటి టెక్నాలజీ అద్భుతాల్ని సృష్టిస్తోంది. ఏ మెషిన్ చూసినా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం ఇస్తోంది. కానీ, ఇదంతా  కొత్తకాదని, శతాబ్దాల కిందట కూడా కొన్ని అద్భుతాలు జరిగాయని చెబుతున్నారు నిపుణులు. ఆ అద్భుతాల్లో ఒకటే, 185 ఏళ్లుగా పని చేస్తున్న ఒక చిన్న ఎలక్ట్రిక్ బెల్. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? 185 ఏళ్ల నుంచి ఎలక్ట్రికల్ బెల్ పనిచేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. ఈ బెల్ 1840లో మొదటిసారిగా మోగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు శతాబ్దాలుగా అది ఒక్కసారైనా ఆగిందన ఆధారాలే లేవు. దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.  సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ గానీ, మరే వస్తువైనా గానీ ఎన్ని రోజులు పనిచేస్తుంది? మహా అయితే ఆర్నెల్లు, అంతకు మించితే ఏడాది చేయవచ్చు. కానీ,  ఆక్స్‌ఫర్డ్‌లోని క్లారెండన్ లాబొరేటరీలో ఉన్న ఈ గంట ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఈ బెల్ విద్యుత్ ఆధారంగా నడుస్తోంది. కానీ అది ఏ సౌరశక్తి కాదు, నేడు మనం వాడుతున్న లిథియమ్ బ్యాటరీలు కూడా కావు....
Image
 మస్క్ ఎంతటి రసికుడో తెలుసా? కోట్లాది పిల్లలను కనాలనుకుంటున్నాడు! మరో ఛంగిజ్‌ ఖాన్‌లా మారతానంటున్న మస్క్!  ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడు, అపర మేధావి మాత్రమే కాదు. అంతకుమించిన రసికుడు కూడా. అతని రాసలీలలు ఏ స్థాయిలో ఉన్నాయో.. సంతానం విషయంలో అతని ఆలోచనలు ఎక్కడిదాకా వెళ్లిపోయాయో తెలిస్తే షాక్ అవుతారు. మస్క్ ప్రస్తుత ప్లాన్ కేవలం పిల్లలను కనడమే. అది కూడా కోట్లలలో ఇది సినిమా కథ కాదు, నిజంగా లీక్ అయిన షాకింగ్ సీక్రెట్!   ఎలాన్ మస్క్ ఈ విచిత్రమైన ప్లాన్ ఏంటి, అతను ఎందుకు ఇలాంటి క్రేజీ ఆలోచనలు చేస్తున్నాడు. ఈ వివాదం ఎలా బయటపడిందో తెలుసుకుందాం.  ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్, X లాంటి కంపెనీల సృష్టికర్త. కానీ, అతని జీవితంలో ఒక సీక్రెట్ సైడ్ ఉంది, అది ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం.. మస్క్ తన జన్యువులతో ఒక ‘లీజన్’ అనే భారీ సంఖ్యలో పిల్లలను సృష్టించాలని కలలు కంటున్నాడు! అవును, మస్క్ ఇప్పటికే 14 మంది పిల్లల తండ్రి, నలుగురు వేర్వేరు మహిళలతో పిల్లలను కలిగి ఉన్నాడు. కానీ, ఇది కేవలం ఆరంభం అని సోర్సెస్ చెబుతున్నాయి! మరిన్ని పిల్లలు ఉండొచ...
Image
 శ్రీదేవీ మరణం నాచురల్ డెత్ కాదు.. బోనీకపూర్ లై డిటెక్ట్! సినిమా పరిశ్రమలో లెజెండ్‌గా నిలిచిన శ్రీదేవీ, దుబాయ్‌లోని హోటల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించి మనకు దూరమైన విషయం అందరికీ తెలిసింది. 2018లో జరిగిన ఆ షాకింగ్ ఘటన ఇప్పటికీ మనల్ని కలచివేస్తుంది. బాత్‌టబ్‌లో డ్రౌన్ అయినట్లు చెప్పిన అధికారిక రిపోర్ట్‌ను చాలామంది నమ్మలేదు. సోషల్ మీడియాలో కాన్స్‌పిరసీలు, శ్రీదేవీ భర్త బోనీ కపూర్ మీద అనుమానాలు వెల్లువెత్తాయి. ఇన్నేళ్లు మౌనంగా ఉన్న బోనీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు. అతను చెప్పిన నిజాలు, లై డిటెక్టర్ టెస్ట్ గురించి, ఇండియా మీడియా ఒత్తిడి గురించి వివరాలు అందరికీని ఆశ్చర్యపరిచాయి. ఈ వీడియోలో, ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.  శ్రీదేవీ మిస్టర్ ఇండియా, చాందినీ, ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి సినిమాలతో భారత సినిమాకు ‘ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్’ ట్యాగ్ సంపాదించిన గొప్ప నటి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఒక ఫ్యామిలీ వెడ్డింగ్‌కి వెళ్లిన ఆమె, జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ రూమ్ బాత్‌టబ్‌లో డ్రౌన్ అయి చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. అధికారికంగా ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’అన్నారు, కానీ ఇందులో ఏద...
Image
 అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా లైన్ వేస్తున్నారు! సర్వే చెప్పిన సరికొత్త నిజాలు! అమ్మాయిల అందానికి ఫిదా కాని అబ్బాయి ఎవరైనా ఉంటారా? ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకసారి అమ్మాయిల అందం ముందు అబ్బాయిల గుండె జారి గల్లంతు అవడం సహజం! ఈ విషయంపై ‘కోడాక్ లెన్స్ విజన్ సెంటర్స్’ అనే సంస్థ 3000 మందిపై చేసిన సర్వే ఫలితాలు నోరెళ్లబెట్టేలా ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని చూస్తూ రోజుకు ఏకంగా 43 నిమిషాలు గడుపుతున్నారట! ఇది సంవత్సరానికి 259 గంటలు, అంటే దాదాపు 11 రోజులు! అంటే అబ్బాయిలు ఏడాదిలో దాదాపు రెండు వారాల పాటు అమ్మాయిల అందాన్ని ఆస్వాదిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సర్వే ప్రకారం, ఒక సగటు పురుషుడు రోజుకు 10 మంది అమ్మాయిలను చూస్తున్నాడట. ఎక్కడంటే.. సూపర్‌మార్కెట్‌, బస్తాండ్‌లు ఈ విషయంలో టాప్‌లో ఉన్నాయి!  ఆ తర్వాత పబ్‌లు, నైట్‌క్లబ్‌లు, వర్క్‌ప్లేస్‌లు కూడా ఈ లిస్టులో హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సగం మంది అబ్బాయిలు ‘అమ్మాయిల శరీరాకృతినే చూస్తాం’ అని ఒప్పుకున్నారు! అయితే, ఈ అబ్బాయిల చూపులను చాలామంది అమ్మాయిలు ఆనందంగా తీసుకుంటారట, అంటే కాంప్లిమెంట్ అన్నట్లు ఫీలవుతున్నారట. క...
Image
 భారత్, పాకిస్తాన్‌కి ఎన్ని యుద్ధాలు జరిగాయి..? యుద్ధంలో పైచేయి ఎవరిది..? పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరోసారి ఉధృతం చేసింది. ఈ దాడి కేవలం ఒక ఉగ్రవాద చర్యగానే మిగిలిపోలేదు. అది కాశ్మీర్ వివాదంలోని లోతైన గాయాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై, భవిష్యత్ శాంతి అవకాశాలపై లోతైన ప్రభావం చూపింది. అయితే, ఈ సంఘటన నుంచి బయటపడాలంటే, రెండు దేశాలూ ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ద్వారా కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ చరిత్ర చూస్తే, ఈ మార్గం అంత సులభం కాదని తెలుస్తోంది.   1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, మతపరమైన విభేదాలు యుద్ధాల రూపంలో బయటపడ్డాయి. ఈ యుద్ధాలు కేవలం రెండు సైన్యాల మధ్య జరిగినవి కాదు. అవి రెండు దేశాల ప్రజల జీవితాలను, వారి భవిష్యత్తును లోతుగా ప్రభావితం చేశాయి.  ఈ క్రమంలోనే.. ఇరు దేశాల మధ్య మొదటి యుద్ధం 1947-48లో జరిగింది. దీన్ని మొదటి కాశ్మీర్ యుద్ధంగా పరిగణించారు. భారత్, పాకిస్తాన్ స్వా...
Image
 మిలియన్ల సందప దాగున్న కమ్రునాగ్ సరస్సు.. ఇది ఒక మిస్టరీ సరస్సు! భారతదేశం అంటే కేవలం  సంస్కృతి, సంప్రదాయాల గుండె చప్పుడు మాత్రమే కాదు. ఎన్నో రహస్యాలను తనలోనే దాచుకున్న ఒక పెద్ద కథల పుస్తకం. ఇక్కడి దేవాలయాలు, కోటలు, సరస్సులు శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసిరే విధంగా ఉన్నాయి. అలాంటి ఒక రహస్యమే హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక సరస్సు. మహాభారతం కాలం నాటి నుంచి ఈ సరస్సు చుట్టూ పురాణాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సర్ససు నీటిలో బంగారం, వెండి దాగి ఉన్నాయని, ఒక శక్తివంతమైన యోధుడి కథ దీని వెనుక ఉందని చెబుతారు. కానీ ఈ సంపద ఎలా వచ్చింది? దీని వెనుక కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.  కమ్రునాగ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో, కరోగ్ లోయలో ఉంది. సముద్ర మట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో, దట్టమైన దేవదారు చెట్ల మధ్య ఈ సరస్సు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే.. ముందుగా  బార్బరీకుడు ఎవరో తెలుసుకోవాలి.  పురాణాల ప్రకారం కమ్రునాగ్ మహాభారత యుగంలో ఒక యోధుడు. ఇతడినే బార్బారిక్ అని కూడా పిలుస్తారు. మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు. అతడు ఘటోత్కచుడి కొడుకు,...
Image
 ఈ ఒక్క ఆయుధం చాలు.. పాక్‌ను ఉచ్చ పోయించడానికి!  భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి, ఒకవేళ ఈ టెన్షన్ యుద్ధంగా మారితే, భారత్ ఆయుధశాలలో ఒక ఆయుధం గేమ్-చేంజర్‌గా మారుతుంది. అదే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్ భారత్-రష్యా జాయింట్ వెంచర్‌లో డెవలప్ అయిన వరల్డ్-క్లాస్ ఆయుధం. దీని స్పీడ్, యాక్యురసీ పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేయగలదు. ఒక్కసారి బ్రహ్మోస్‌‌ లాంచ్ చేస్తే.. ఈ మిసైల్ సెకనుకు 3700 కిలోమీటర్ల వేగంతో, శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా వెళ్లి, ఇస్లామాబాద్‌లోని కమాండ్ సెంటర్‌ను సెకన్లలో బూడిద చేయగలదు. ఈ మిసైల్ ఎంత స్పీడ్‌గా వెళ్తుందంటే.. ఢిల్లీ నుండి కరాచీకి కారులో వెళ్తే 20 గంటలు పడుతుంది. కానీ, బ్రహ్మోస్ అక్కడికి 72 సెకన్లలో చేరుతుంది. దీని రేంజ్ 1500 కిలోమీటర్లు, అంటే పాకిస్థాన్‌లో ఏ మూల ఉన్న టార్గెట్ అయినా దీని రాడార్‌లో ఉంటుంది. బ్రహ్మోస్‌ను ల్యాండ్ నుండి మొబైల్ లాంచర్స్‌తో, సముద్రంలో యుద్ధ నౌకల నుండి, లేదా సు-30MKI ఫైటర్ జెట్స్ నుండి లాంచ్ చేయవచ్చు. ఉదాహరణకు, 2019లో బాలాకోట్ స్ట్రైక్‌లో భారత్ సర్జికల్ ప్రెసిషన్ చూపించింది. ఇప్పుడు బ్...