AP లో NDA ప్రభుత్వం 2024 సం. లో ఏర్పడిన తర్వాత 2025 సం. కు గాను వేట నిషేద సమయంలో 1,29,789 మందికి మత్స్యకార భరోసా కింద జీవనభృతి 258 కోట్ల రూపాయలు విడుదల చేసారని ఏప్రిల్ 26 వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రభుత్వం చెక్ ను విడుదల చేస్తూ ప్రకటన చేసింది . ఇంకా అందులో 53650 మంది అర్హత కలిగిన మత్స్యకారులకు మత్స్యకార భరోసా రావాల్సి ఉందని ప్రచారం జరుగుతుంది. కనుక ఇంకా ఎంత మందికి మత్స్యకార భరోసా ఇవ్వలేదో, ఏ కారణాలు చేత ప్రభుత్వం అకౌంట్ లలో డబ్బులు జమ చేయలేదో అలాగే మిగిలిన వారికి మత్స్యకార భరోసా డబ్బులు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లలో జమ చేస్తారో సరియైన ప్రకటన చెయ్యాలి అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని , ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రార్ధిస్తున్నాం 🙏.